కోల్‌కతా నైట్‌రైడర్స్
From Wikipedia, the free encyclopedia
కోల్‌కత నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో కోల్‌కతకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ జట్టు యాజమాన్యంలో ఒకడు. నటి జుహీ చావ్లా, ఆమె భర్త జే మెహతా కూడా సహ భాగస్వాములుగా ఉన్నారు. కోల్‌కత లోని ఈడెన్ గార్డెన్స్ ఈ జట్టుకు స్వంత మైదానం. ఈ జట్టు 2012 లో జరిగిన పోటీలలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించి విజేతగా నిలిచారు. అలాగే 2014 లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును ఓడించి విజేతలుగా నిలిచారు. ఈ జట్టుకు దినేష్ కార్తిక్ నాయకత్వం వహిస్తుండగా జాక్ కలీస్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
దస్త్రం:Kolkata Knight Riders Logo.svg | ||
లీగ్ | ఇండియన్ ప్రీమియర్ లీగ్ | |
---|---|---|
వ్యక్తిగత సమాచారం | ||
కెప్టెన్ | శ్రేయస్ అయ్యర్ 🏏 | |
కోచ్ | చంద్రకాంత్ పండిత్ | |
యజమాని | రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (55%) మెహతా గుప్తా(45%)[1] | |
జట్టు సమాచారం | ||
నగరం | కోల్‌కత, పశ్చిమ బెంగాల్ | |
రంగులు | ![]() | |
స్థాపితం | 2008 | |
స్వంత మైదానం | ఈడెన్ గార్డెన్స్ | |
సామర్థ్యం | 68,000[2] | |
చరిత్ర | ||
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాలు | 2 (2012, 2014) | |
అధికార వెబ్ సైట్ | kkr.in | |
| ||
![]() |
ఈ గ్రూపుకు బాలీవుడ్ సెలెబ్రెటీలు యజమానులుగా వ్యవహరిస్తుండటం వల్ల ఈ జట్టు మీద ఆసక్తి నెలకొంది. 2011 లో మొదటి సారిగా ప్లే ఆఫ్స్ కు ఎంపికైంది. 2012 లో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించి విజేతగా నిలిచింది. 2014 లో కింగ్స్ XI పంజాబ్ ను ఫైనల్లో ఓడించి మరోసారి విజేతగా నిలిచింది.[3] ట్వెంటీ ట్వెంటీ ఆటల్లో అత్యధిక వరుస విజయాలు (14) సాధించిన జట్టుగా కోల్‌కత నైట్ రైడర్స్ రికార్డు సృష్టించింది.[4]
ఈ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు గౌతం గంభీర్.[5] అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ సునీల్ నరైన్.[6] 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న మనోజ్ తివారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.