INS అరిహంత్
అణుశక్తితో పనిచేసే భారత జలాంతర్గామి / From Wikipedia, the free encyclopedia
INS అరిహంత్ (S-73) భారత్ నిర్మిస్తున్న అరిహంత్ తరగతికి చెందిన మొదటి అణు చోదిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి.[5][6] 6,000 టన్నుల ఈ నౌకను అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ (ATV) ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం లోని నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించారు.
త్వరిత వాస్తవాలు History, భారత్ ...
History | |
---|---|
భారత్ | |
Name: | INS అరిహంత్ |
Builder: | విశాఖపట్నం నౌకానిర్మాణకేంద్రం |
Launched: | 2009 జూలై 26 |
Acquired: | 2014 డిసెంబరు 13 |
Commissioned: | 2016 ఆగస్ట్ [1] |
Homeport: | విశాఖపట్నం |
Status: | కమిషన్ కు సిద్ధం [1] |
General characteristics | |
Class and type: | -class బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి |
Displacement: | surface: 6,000 టన్నులు (అంచనా) [2] |
Length: | 111 మీ. (364 అ.)[3] |
Beam: | 15 మీ. (49 అ.)[3] |
Draft: | 11 మీ. (36 అ.)[3] |
Installed power: | 83 MW (111,305 hp) |
Propulsion: | PWR using 40% enriched uranium fuel (83 MWe);[3] one turbine (47,000 hp/70 MW); one shaft; one 7-bladed, high-skew propeller (estimated) |
Range: | అపరిమితం (ఆహార సరఫరాల కోసం తప్పించి) |
Test depth: | 350 మీ. (1,150 అ.) (estimated)[4] |
Complement: | 95–100 సిబ్బంది |
Sensors and processing systems: | USHUS sonar |
Armament: | 6 × 533 mమీ. (21 అం.) torpedo tubes *12 × సాగరిక SLBM *or *4 × కె-4 |
మూసివేయి
అరిహంత్ 2009 జూలై 26 విజయ్ దివస్ (కార్గిల్ యుద్ధం విజయ దినం) రోజున ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. విస్తృతమైన పరీక్షలు పూర్తయ్యాక, 2016 ఫిబ్రవరి 23 న ఈ జలాంతర్గామి, ఆపరేషన్‌కు సిద్ధమైందని ధ్రువీకరించారు.[7][1]
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న అరిహంత్ తరగతి జలాంతర్గాముల్లో ఇది మొదటిది. ఇంకో నాలుగు వేర్వేరు నిర్మాణ దశల్లో ఉన్నాయి. దీని పొడవు 111 మీటర్లు. బరువు 6000 టన్నులు.