బొబ్బిలి

ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా, బొబ్బిలి మండల పట్టణం From Wikipedia, the free encyclopedia

బొబ్బిలిmap

బొబ్బిలి (వినండి: //), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని పట్టణం, అదే పేరుతో గల ఒక మండలానికి కేంద్రం.ఇది బొబ్బిలి పురపాలక సంఘం ప్రధాన పరిపాలన కేంద్రం.

త్వరిత వాస్తవాలు బొబ్బిలి, దేశం ...
బొబ్బిలి
Thumb
బొబ్బిలిలోని సంగీత కచేరీ మండపం
Thumb
బొబ్బిలి
బొబ్బిలి
ఆంధ్రప్రదేశ్ లో బొబ్బిలి స్థానం,
Coordinates: 18.5667°N 83.3667°E / 18.5667; 83.3667
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం
Government
  Typeపురపాలక సంఘం
  Bodyబొబ్బిలి పురపాలక సంఘం, బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ
  శాసనసభ్యుడుసంబంగి వెంకట చిన అప్పల నాయుడు
విస్తీర్ణం
  Total25.60 కి.మీ2 (9.88 చ. మై)
Elevation
103 మీ (338 అ.)
జనాభా
 (2011)[2]
  Total56,819
  జనసాంద్రత2,200/కి.మీ2 (5,700/చ. మై.)
భాషలు
  అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్
535558
ప్రాంతీయ ఫోన్ కోడ్91–8944
వాహనాల నమోదు కోడ్AP35 (Former)
AP39 (from 30 January 2019)[3]
లింగనిష్పత్తి1:1 /
మూసివేయి

చరిత్ర

Thumb
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తాండ్ర పాపారాయుడు విగ్రహం

బొబ్బిలికి, పొరుగున ఉన్న విజయనగరానికి మధ్య నిరంతర శతృత్వం ఉండేది. విజయనగర రాజు బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలిపై దాడి చేసాడు. బొబ్బిలి వెలమ, తెలగ, బొందిలి వీరులు మరణించగా, స్త్రీలు ఆత్మ త్యాగం చేసారు. యుద్ధం ముగిసాక, విజయరామరాజు తన గుడారంలో నిదుర పోతుండగా, బొబ్బిలి రాజు బావమరిది యైన తాండ్ర పాపారాయుడు అతడిని హతమార్చాడు.

బొబ్బిలి రాజు రంగారాయుని కుమారుడు, పసి బాలుడు చిన్న రంగారావు బుస్సీకి చిక్కాడు. ఆ బాలుడినే బొబ్బిలి రాజుగా బుస్సీ పట్టాభిషేకం చేసాడు. అయితే అతని పసితనాన్ని అవకాశంగా తీసుకుని బంధువులు రాజ్య పీఠాన్ని ఆక్రమించుకున్నారు. విజయనగరం రాజుతో సంధి కుదిరినా అది తాత్కాలికమే అయింది. ఇద్దరి మధ్యా మళ్ళీ ఘర్షణలు మొదలవటంతో బొబ్బిలి రాజు పారిపోయి నిజాము రాజ్యంలో తలదాచుకున్నాడు. 1794లో బ్రిటిషు వారు మరల చిన్న రంగారావును మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టారు. 1801 లో అతని కుమారుడితో బ్రిటిషువారు శాశ్వత సంధి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజా అనే బిరుదును వంశపారంపర్య చిహ్నంగా గుర్తించారు. మహారాజ బిరుదును చిన్న రంగారావు ముని మనుమడైన సర్ వేంకటాచలపతి రంగారావుకు వ్యక్తిగత హోదాగా సమర్పించారు.

1901 గణాంకాలు

బ్రిటిషు వారి ఇంపీరియల్ గెజెట్ ప్రకారం బొబ్బిలి వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి అప్పటి విశాఖపట్నం జిల్లాలో ఉండేది. 1901లో దీని జానాభా 17,387. బొబ్బిలి రాజా సంస్థానం 227 చ.మై. విస్తీర్ణంలో ఉండేది. ఆదాయం - రూ 40,000. అందులో భూమి శిస్తు: రూ 9,000.

జనగణన గణాంకాలు

2011 భారత జనన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,22,964 - పురుషులు 61,092 - స్త్రీలు 61,872

పరిపాలన

బొబ్బిలి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యాసంస్థలు

  • సంస్థానం ఉన్నత పాఠశాల (1864).
  • రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాల: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా సా.శ. 1962 సంవత్సరంలో ఈ కళాశాలను స్దాపించడం జరిగింది.
  • రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాల, ఎమ్.సి.ఏ. సెంటర్ (1999)
  • గోకుల్ ఇంజనీరింగ్ కళాశాల
  • తాండ్రపాపారాయ ఇంజనీరింగ్ కళాశాల

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.