కోల్‌కతా హత్యాచార ఘటన 2024 From Wikipedia, the free encyclopedia
2024 ఆగస్టు 9న, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో కోల్‌కతా ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య చేయబడింది. అదే క్యాంపస్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన భారతదేశంలో మహిళలు, వైద్యుల భద్రత గురించి చర్చను విస్తృతం చేసింది. ఇది గణనీయమైన ఆగ్రహాన్ని, దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. సమగ్ర దర్యాప్తు కోసం డిమాండ్లను రేకెత్తించింది.[3][4]
తేదీ | 9 ఆగస్టు 2024 |
---|---|
ప్రదేశం | ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, బెల్గాచియా, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
ఇలా కూడా అంటారు | కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార కేసు ఆర్జీకార్ మెడికల్ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం, హత్య |
మరణాలు | ఒక వైద్య విద్యార్థిని[1] |
అరెస్టులు | 1[2] (ప్రాథమిక నివేదికల మేరకు) |
దేశం నలుమూలల లోనే కాక ఈ సంఘటనపై అంతర్జాతీయంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్,[5][6][7] యునైటెడ్ స్టేట్స్‌లలో ఆందోళనలు జరిగాయి.[8][6][9]
2024 ఆగస్టు 9న, సదరు ట్రైనీ డాక్టర్ తప్పిపోయినట్లు సహోద్యోగులు నివేదించారు. సుమారు ఉదయం 11:30 గంటలకు,[10] ఆమె మృతదేహం కళాశాల సెమినార్ రూమ్‌లో కళ్లు, నోరు, జననాంగాలు రక్తస్రావంతో పాక్షిక నగ్న స్థితిలో కనుగొనబడింది. ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.
శవపరీక్షలో ఆమెపై అత్యాచారం చేసి, గొంతుకోసి చంపే ముందు లైంగికంగా వేధించాడని తేలింది. నాలుగు పేజీల నివేదికలో ఆమె జననేంద్రియ మార్గము, పెదవులు, ఎడమ కాలు, కుడి చేయి, ఉంగరపు వేలు, మెడ, ముఖంపై బలమైన గాయాలను సైతం గుర్తించారు. నిందితుడి చేతిగోళ్ల వల్ల మహిళ ముఖంపై గీతలు పడి ఉండవచ్చని నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఆమె నోరు, గొంతుపై ఒత్తిడి విధించబడింది. ఆమె గొంతు కోసి చంపబడింది, ఫలితంగా థైరాయిడ్ మృదులాస్థి పగుళ్లు ఏర్పడింది. ఆమె కన్నులు, నోరు, ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం జరిగినట్లు నివేదిక పేర్కొంది, ఆమె జననేంద్రియ ప్రాంతంలో గాయాలు "వికృతమైన లైంగికత", "జననేంద్రియ హింసకు" కారణమయ్యాయి. ఆమె కళ్లకు గాయాలు కావడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.[11][12]
జననాంగాలలో సుమారు 150 మిల్లీ గ్రాముల వీర్యం కనుగొనబడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.[13][14] దీంతో, శవపరీక్ష చేసిన వైద్యులు, బాధితురాలి తల్లిదండ్రులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తపరిచారు.[12] [13] కోల్‌కతా పోలీసులు అటువంటి వాదనలను పుకార్లుగా తోసిపుచ్చారు.[15]
విచారణ తరువాత, కోల్‌కతా పోలీసు విపత్తు నిర్వహణ దళానికి చెందిన పౌర వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు, అతను మెడికల్ కాలేజీ సమీపంలోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో నియమించబడ్డాడు.అతను స్త్రీవాద, గృహహింసకుడిగా అభివర్ణించబడ్డాడు.కోల్‌కతా పోలీసుల కథనం ప్రకారం,అతను నేరం అంగీకరించాడు.[16][17][18]
2024 ఆగష్టు 13న, కలకత్తా హైకోర్టు, పోలీసుల దర్యాప్తు తీరుతో సంతృప్తి చెందలేదు, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించింది.[19] రాష్ట్ర పోలీసులు తమ విచారణను కొనసాగిస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని వారు ధ్వజమెత్తారు.[20] ఆగస్టు 18న సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.[21][22][23]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.