రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్యమం From Wikipedia, the free encyclopedia
2022 ఫిబ్రవరి 24న, రష్యా ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభించింది. ఇది 2014 నుండి కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన తీవ్రతను సూచిస్తుంది.[1] NATO(ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంఘము)లో చేరకుండా ఉక్రెయిన్ను చట్టబద్ధంగా నిషేధించాలని రష్యా డిమాండ్ చేసింది. రష్యా డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, అనే రెండు స్వయం ప్రకటిత ఉక్రెయిన్ రాష్ట్రాలను గుర్తించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21న తూర్పు ఉక్రెయిన్ లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యన్ సాయుధ దళాల చొరబాటు జరిగింది.[2][3]
ఫిబ్రవరి 24న సుమారు 03:00 UTC సమయంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించాడు; కొన్ని నిమిషాల తర్వాత, ఉత్తరాన రాజధాని కైవ్‌తో సహా ఉక్రెయిన్ అంతటా ఉన్న ప్రదేశాలలో క్షిపణి దాడులు ప్రారంభమయ్యాయి. ఉక్రేయిన్ బోర్డర్ సర్వీస్ రష్యా, బెలారస్‌తో ఉన్న సరిహద్దు పోస్టులపై దాడి చేసినట్లు పేర్కొంది. రెండు గంటల తర్వాత, దాదాపు 05:00 UTC సమయంలో, రష్యా భూ బలగాలు ఉక్రెయిన్ దేశంలోకి ప్రవేశించాయి. ఉక్రేయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు, రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించాడు.[4][5]
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షల్ని విధించాయి. దీంతో ఆ దేశ కరెన్సీ రూబుల్ విలువ పతనమవుతోంది. దీంతో తమ ఉత్పత్తుల విక్రయాలను, సర్వీసులను రష్యాకు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యాపిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ తదితర సంస్థలు ప్రకటించాయి.[6] రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 120కి పైగా కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాల్ని నిలిపివేశాయి.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.