2007 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు

భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు From Wikipedia, the free encyclopedia

2007 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు

2007 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 2007 భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఆగస్టు పదిన జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ నుంచి మహమ్మద్ హమీద్ అన్సారీ ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యాడు.[1] అప్పటి ఉప రాష్ట్రపతి, భైరాన్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బదులుగా భైరాన్ సింగ్ షెకావత్ 2007 ఎన్నికలలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి, ప్రతిభా పాటిల్ చేతిలో ఓడిపోయారు.

నేపథ్యం

భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు, భైరోన్ సింగ్ షెకావత్ పదవీకాలం 2007 ఆగస్టు 18 ముగిసింది.[1]

ఎలక్టోరల్ కళాశాల

ఎలక్టోరల్ కాలేజీలో 245 మంది రాజ్యసభ సభ్యులు 545 మంది లోక్‌సభ సభ్యులు, మొత్తం 790 మంది ఓటర్లు ఉన్నారు.

అధికారులు

రిటర్నింగ్ అధికారి : డాక్టర్ యోగేంద్ర నారాయణ్, సెక్రటరీ జనరల్, రాజ్యసభ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు : NC జోషి & రవి కాంత్ చోప్రాను ఎన్నికల సంఘం నియమించింది.

ఫలితాలు

ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ హమీద్ అన్సారీకి 455 ఓట్లు వచ్చాయి.భారతీయ జనతా పార్టీ పార్టీ అభ్యర్థి అయిన నజ్మా హెప్తుల్లాకు 222 ఓట్లు వచ్చాయి.సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అయిన రషీద్ మసూద్కు 75 ఓట్లు వచ్చాయి. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మహమ్మద్ హామీద్ అన్సారి గెలుపొందాడు.

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.