From Wikipedia, the free encyclopedia
2007 ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ వెస్ట్ ఇండీస్ లో 13 మార్చి నుండి 2007 ఏప్రిల్ 28, వరకు జరిగింది. అది తొమ్మిదవ ప్రపంచ క్రికెట్ కప్, ఇందులో ఆటలన్నీ మామూలు వన్డే ఇంటర్నేషనల్ లాగే జరిగాయి.మొత్తం 51 మ్యాచ్ లు ఆడారు, 2003 ప్రపంచ క్రికెట్ కప్ కన్నా మూడు మ్యాచ్ లు ఎక్కువ ఆడారు. (2003 కన్నా రెండు జట్లు పెరిగాయి).
2007 ఐసిసి ప్రపంచకప్ | |
---|---|
నిర్వాహకులు | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్ & నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | వెస్టిండీస్ |
ఛాంపియన్లు | ఆస్ట్రేలియా (4th title) |
పాల్గొన్నవారు | 16 (97 ఎంట్రీల్లో) |
ఆడిన మ్యాచ్‌లు | 51 |
ప్రేక్షకుల సంఖ్య | 4,39,028 (8,608 ఒక్కో మ్యాచ్‌కు) |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | గ్లెన్ మెక్ గ్రాత్ |
అత్యధిక పరుగులు | మాథ్యూ హేడెన్ (659) |
అత్యధిక వికెట్లు | గ్లెన్ మెక్ గ్రాత్ (26) |
← 2003 2011 → |
మొత్తం 16 జట్లు నాలుగు విభాగాలుగా పోటీ పడ్డాయి. ఒక్కొక్క విభాగంలో బాగా ఆడే జట్లు రెండు చొప్పున నాలుగు విభాగాల నుండి ఎనిమిది జట్లు సూపర్ 8 కి చేరుకున్నాయి.వీటిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూ జీలాండ్ , దక్షిణ ఆఫ్రికా సెమీ-ఫైనల్స్ వరకు చేరాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక పై ఫైనల్లో విజయం సాధించి వరుసగా మూడవ ప్రపంచ క్రికెట్ కప్ ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీనితో ఆస్ట్రేలియా వరుసగా 29 మ్యాచ్ లు గెలిచింది. 1999 వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా ఇదే విధంగా అన్ని మ్యాచ్ లూ గెలిచింది.
ఈ టోర్నమెంట్ ముగిసాక వచ్చిన అధిక రాబడిలో 239 మిలియన్ డాలర్లు సభ్య దేశాలకు ఐసీసీ పంచింది.[1]
ప్రపంచ క్రికెట్ కప్ వెస్ట్ ఇండీస్ లో జరగల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రోటేషనల్ పాలసీ ద్వారా నిర్ధారించింది. ప్రపంచకప్ లు గెలవడంలో రెండవ విజయవంతమైన జట్టుగా వెస్ట్ ఇండీస్ నిలిచినా, ప్రపంచ క్రికెట్ కప్ కరీబియన్ దేశాల్లో జరగటం అదే మొదటిసారి.
అమెరికాలో అప్పటికి కొత్తగా నిర్మించిన లుదర్ హిల్, ఫ్లోరిడా,స్టేడియంలలో మ్యాచ్ లు జరగాలని పలు రకాలుగా ప్రయత్నించినా ఐసీసీ మాత్రం అన్ని మ్యాచ్ లను కెరిబియన్ దేశాలలో మాత్రమే నిర్వహించాలి అని నిర్ణయించింది. అలాగే బెర్ముడా, సెయింట్ విన్సెంట్ , గ్రెనడిన్స్ , జమైకా నుంచి వచ్చిన రెండు ప్రతిపాదనలను కూడా ఐసీసీ తిరస్కరించింది.
వెస్ట్ ఇండీస్ లో ఎనిమిది క్రీడా స్థలాలను ప్రపంచ కప్ ఫైనల్ టోర్నమెంట్ కోసం ఎన్నుకున్నారు. వెస్ట్ ఇండీస్ దేశాలన్నీ ఆరు మ్యాచ్ లకు ఆతిథ్యాన్ని ఇచ్చాయి. వీటిలో సెయింట్. లూసియా, జమైకా , బార్బడోస్ (ఇవి ఫైనల్ కోసం ఆతిధ్యాన్ని ఇచ్చాయి) ఏడు మ్యాచ్‌లకు ఆతిథ్యాన్ని ఇచ్చాయి.
దేశం | పట్టణం | స్టేడియం | కెపాసిటీ (ఎందరు కూర్చోగలరు) | మ్యాచ్చులు | ఖరీదు |
---|---|---|---|---|---|
ఆంటీగువా , బార్బుడా | సెయింట్ జాన్స్ | సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం | 20,000 | సూపర్ 8 | యుయస్$54 మిలియన్ [2] |
బార్బడోస్ | బ్రిడ్జి టౌన్ | కెన్సింగ్టన్ ఓవల్ | 28,000 | సూపర్ 8 & ఫైనల్ | యుయస్$69.1 మిలియన్ [3] |
గ్రెనడా | సెయింట్ జార్జి'స్ | క్వీన్స్ పార్క్ | 20,000 | సూపర్ 8 | |
గుయానా | జార్జి టౌన్ | ప్రొవిడెన్స్ స్టేడియం | 20,000 | సూపర్ 8 | యుయస్$26 మిలియన్/యుయస్$46 మిలియన్ [4] |
జమైకా | కింగ్స్టన్ | సబిన పార్క్ | 20,000 | విభాగం డి & సెమీ-ఫైనల్ | యుయస్$26 మిలియన్ [5] |
సెయింట్ కిట్ట్స్ , నెవిస్ | బస్సేట్టేర్రె | వార్నర్ పార్క్ స్టేడియం | 10,000 | విభాగం ఎ | యుయస్$12 మిలియన్ |
సెయింట్ లూసియా | గ్రోస్ ఇస్లేట్ | బెయుసేజౌర్ స్టేడియం | 20,000 | విభాగం సీ & సెమీ -ఫైనల్ | యుయస్$13 మిలియన్ [6] |
ట్రినిడాడ్ , టొబాగో | పోర్ట్ అఫ్ స్పెయిన్ | క్వీన్'స్ పార్క్ ఓవల్ | 25,000 | విభాగం బి |
వీటితో పాటు నాలుగు ఆతిథ్య స్థలాల్లో ప్రాక్టీసు మ్యాచ్ లు నిర్వహించారు.
దేశం | పట్టణం | స్టేడియం | పట్టే శక్తి | ఖరీదు |
---|---|---|---|---|
బార్బడోస్ | బ్రిడ్జి టౌన్ | 3 డబల్యు యస్ ఓవల్ | 8,500 | |
జమైకా | ట్రిలవ్నీ | గ్రీన్ ఫీల్డ్ స్టేడియం | 25,000 | యుయస్$35 మిలియన్ [7] |
సెయింట్ విన్సెంట్ , ది గ్రెనడిన్స్ | కింగ్స్ టౌన్ | ఆర్నోస్ వలె స్టేడియం | 12,000 | |
ట్రినిడాడ్ , టొబాగో | సెయింట్. ఆగాస్టిన్ | సర్ ఫ్రాంక్ వర్రేల్ మెమోరియల్ గ్రౌండ్ | 22,000 |
జమైకన్ ప్రభుత్వం పిచ్ తయారీ కోసం 81 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని సబినా పార్క్ మరమ్మత్తులకు, ట్రిలానిలో ఒక బహుళ అంతస్తుల కట్టడాన్ని నిర్మించడానికి ఉపయోగించారు. పిచ్ కాకుండా మిగతా ఖర్చుల కోసం ఇంకొక 20 మిలియన్ అమెరికన్ డాలర్లు వెచ్చించారు. దీనితో కలిపి మొత్తం ఖర్చు 100 మిలియన్ అమెరికన్ డాలర్లు అయింది (అనగా 7 బిలియన్ జమైకాన్ డాలర్లు).
విడివిడిగా సబిన పార్క్ మరమ్మత్తులకు 46 మిలియన్ అమెరికన్ డాలర్లు , ట్రిలానిలో స్టేడియం కోసం 35 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చయింది.[8][9] క్రీడా స్థలాల మీద వెచ్చించిన మొత్తం 301 మిలియన్ యుయస్ డాలర్లు
2006 సెప్టెంబరు 21 న ట్రినిడాడ్ లో ఉన్న బ్రియన్ లారా స్టేడియం టోర్నమెంట్ కు ముందు జరిగే వార్మ్-అప్ మ్యాచ్ లకు ఆతిధ్యానిచ్చే అర్హతను కోల్పోయింది.
ప్రపంచ క్రికెట్ కప్ లోనే ఎప్పుడూ లేనంత ఎక్కువగా పదహారు జట్లు పాల్గొన్నాయి. ఈ పదహారు జట్లకి వన్డే ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. దీనిలో పది ఐసీసీ సభ్య దేశాలు కూడా కలవు (టెస్ట్ , వన్ డే అర్హత కలిగినవి):
|
|
|
|
|
మిగతా ఆరు ఓడిన దేశాలు కెన్యా (2009 వరకు ఓడిఐ అర్హత కలిగి ఉంది), మిగతా ఇదు జట్లు 2005 ఐసీసీ ట్రోఫీ ద్వారా అర్హత సాధించాయి. (2009 వరకు ఓడిఐ అర్హతను కలిగున్నాయి):
|
|
|
|
|
|
ప్రపంచ క్రికెట్ కప్ లో జరిగిన ప్రతి టోర్నమేంట్ మీడియాకు ఒక ఈవెంట్‌లా మారిపొయాయి. 2003 , 2007 ప్రపంచ క్రికెట్ కప్ ను టీవీ ద్వారా ప్రదర్శించే హక్కులను 550 మిల్లియన్ యుయస్ డాలర్లకు[10] అమ్మేశారు. 2007 ప్రపంచ క్రికెట్ కప్ 200 దేశాల్లో టివి ద్వారా ప్రసారం చేశారు. దీనిని చూసిన వారు సుమారు రెండు బిలియన్ల కన్నా ఎక్కువ మంది ఉంటారని అంచనా, ప్రత్యక్షంగా వెస్ట్ ఇండీస్ స్టేడియంలలో చూడటానికి లక్ష కన్నా ఎక్కువ మంది ప్రయాణించి వచ్చారని అంచనా.[11][12]
కాషాయ రంగులో రక్కూన్ అనే అమెరికన్ జంతువును పోలివుండే "మేల్లో" (మస్కట్ పేరు)ని 2007 క్రికెట్ ప్రపంచ క్రికెట్ కప్ మస్కట్ (చిహ్నం)గా ఎంపికచేశారు. "మేల్లో"కి వయసు ఉండదు, ఆడ, మగ తేడా లేదు , అది ఏ జంతు జాతికి సంబంధించినది కాదని, కేవలం ఊహాత్మకంగా తయారుచేసినదని మ్యాచ్ జరిగేటప్పుడు వివరించారు. అది వెస్టిండీస్ యువత వైఖరికి ప్రతీకగా భావించారు. ప్రపంచ కప్ అధికారిక గీతంగా "ది గేమ్ అఫ్ లవ్ అండ్ యూనిటీ" ఎంపిక అయింది. జమైకాకు చెందిన షాగి, బార్బడైస్ కు చెందిన సంగీతకారుడు రూపీ, ట్రినిటాడ్ కి చెందిన ఫాయే జమైకాలో జన్మించిన షాగి, బాజన్ ఎంటర్టైనేర్ రూపీ, ట్రినిటాడ్ కి చెందిన ఫాయే-అన్ ల్యోన్స్ ఈ పాటని స్వరపరిచారు.
2007 ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమేంట్ అత్యధిక మొత్తాన్ని వసూలు చేసింది, 672,000[13] పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. 2007 వరల్డ్ కప్ సెమీ-ఫైనల్స్ కి వచ్చినవారు 403,000; మ్యాచ్ కి[14] సుమారు 8,500 మందికి పెరిగారు.
టెస్ట్ మ్యాచ్ లు ఆడే ప్రధాన దేశాలన్నిటికీ వరల్డ్ కప్ కు ముందు చాలా వన్ డే మ్యాచ్ లు ఆడే విధంగా ఖరారు చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ , ఇంగ్లాండ్ దేశాలు కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ లో ఆడాయి. అందులో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాని ఓడించింది. ఆస్ట్రేలియా తరువాత న్యూజిల్యాండ్ వెళ్లి చాప్పెల్-హాడ్లీ ట్రోఫీలో తలపడి 3-0 తో ఓడిపోయింది. దక్షిణ ఆఫ్రికా ఇండియాతో అయిదు మ్యాచ్ లు (4-0 తో దక్షిణ ఆఫ్రికా గెలిచింది) , పాకిస్తాన్ తో అయిదు మ్యాచ్ లు (3-1 తో దక్షిణ ఆఫ్రికా గెలిచింది) ఆడింది. ఇండియా కూడా వెస్ట్ ఇండీస్ తో నాలుగు ( ఇండియా 3-1 తో గెలిచింది) శ్రీలంకతో నాలుగు (ఇండియా 2-1 తో గెలిచింది) మ్యాచ్ లు ఆడింది. బంగ్లాదేశ్ జింబాబ్వే పై నాలుగు మ్యాచ్ లు ఆడి (బంగ్లాదేశ్ 3-1 పాయింట్లతో నెగ్గింది) కెనడా బెర్ముడా పై ముక్కోణపు సిరీస్ గెలిచింది.అసోసియెట్ దేశాలు ఆడిన ప్రపంచ క్రికెట్ లీగ్ లో కెన్యా గెలిచింది. ఈ దేశాలు ఇంకొన్ని సిరీస్ లో కూడా ఆడాయి.
ప్రపంచ క్రికెట్ కప్ ముందు జట్ల యొక్క ర్యాంకులు ఈ క్రింది విధంగా ఉండేవి:
స్థానం | జట్టు | పాయింట్లు | స్థానం | జట్టు | పాయింట్లు | |
---|---|---|---|---|---|---|
1 | దక్షిణ ఆఫ్రికా | 128 | 9 | బంగ్లాదేశ్ | 42 | |
2 | ఆస్ట్రేలియా | 125 | 10 | జింబాబ్వే | 22 | |
3 | న్యూజిలాండ్ | 113 | 11 | కెన్యా | 0 | |
4 | పాకిస్తాన్ | 111 | 12 | స్కాట్లాండ్ | 0% / 69% | |
5 | భారతదేశం | 109 | 13 | neదర్లాండ్స్ | 0% / 50% | |
6 | శ్రీలంక | 108 | 14 | ఐర్లాండ్ | 0% / 44% | |
7 | ఇంగ్లాండ్ | 106 | 15 | కెనడా | 0% / 33% | |
8 | వెస్ట్ ఇండీస్ | 101 | 16 | బెర్ముడా | 0% / 28% |
గమనిక: 12-16 జట్లకు అధికారికంగాగా ర్యాంక్ లు లేవు. ఆ దేశాల్ని అసోసియెట్ దేశాలపై గెలుపు , ప్రధాన దేశాల మీద వాటి గెలుపు శాతాన్ని బట్టి ప్రపంచ క్రికెట్ కప్ కి ముందు ర్యాంకులను నిర్ణయిస్తారు.
16 దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళు అందరు ప్రాక్టీసు కోసం వార్మ్-అప్ మ్యాచ్ లు ఆడారు, అవి వాళ్ళు కొత్త ట్రిక్కులు నేర్చుకోవడానికి, బాగా ప్రిపేర్ అవడానికి , వెస్ట్ ఇండీస్ వాతావరణానికి అలవాటు పడటానికి ఆడేవారు. ఈ వార్మ్-అప్ మ్యాచ్ లు వన్డేలుగా.[15] పరిగణనలోకి రావు. ఈ మ్యాచ్ లు 2007 మార్చి 5 సోమవారం నుంచి 2007 మార్చి 9 శుక్రవారం వరకు ఆడారు.ఈ మ్యాచ్ లలో బంగ్లాదేశ్ న్యూజీలాండ్ పై ఆశ్చర్యకరంగా గెలిచి సంచలనం నమోదుచేసింది.
ప్రపంచ క్రికెట్ కప్ 2007 ప్రారంభ వేడుక 2007 మార్చి 11, ఆదివారం జమైకాలో [16] ఉన్న ట్రేలానీ స్టేడియంలో జరిగింది.
ప్రారంభ వేడుకలో సుమారు 2000 మంది నృత్య, , ఇతర కళాకారులు పాల్గొన్నారు. వీరు వెస్ట్ ఇండీస్ కు సంబంధించిన కాల్య్ప్సో, రగ్గా , సోక ప్రాంతాలకు చెందిన వారు. కొంతమంది కళాకారుల పేర్లు సీన్ పాల్, బైరాన్ లీ, కెవిన్ లిత్త్లె, బెర్స్ హంమొండ్, లక్కీ దుబే, బుజు బంటన్, హాఫ్ పింట్, ఆరో, మచెల్ మోన్టనో, అలిసన్ హిండ్స్, టోనీ రెబల్, థర్డ్ వరల్డ్, గ్రెగొరీ ఇసాక్స్, డేవిడ్ రుద్దర్, శాగ్గి, జిమ్మి క్లిఫ్ఫ్.
ప్రారంభ దినోత్సవానికి జమైకా గవర్నర్ జెనరల్ తో పాటు వివిధ రాష్ట్రాల పెద్దలు హాజరయ్యారు.సర్ సర్ గార్ఫీల్డ్ సోబెర్స్; మొదట ప్రసంగించారు.జమైకా , గ్రెనడా ప్రధాన మంత్రులు మూడు సందేశాలు ఇచ్చారు.
అన్ని మ్యాచ్ లు 09:30 నుంచి 17:15 మధ్య సమయంలో జరిగాయి. మొదటి ఇన్నింగ్స్ 09:30 నుంచి 13:00 మధ్యలో , రెండవ ఇన్నింగ్స్ 13:45 నుంచి 17:15 మధ్యలో జరిగాయి. జమైకా తప్ప మిగతా అన్ని క్రీడ స్థలాలలో సమయం యుటిసీ-4 ఉంది, కానీ జమైకా క్రీడ స్థలంలో మాత్రం సమయం యుటిసీ-5 ఉంది.
మ్యాచ్ లన్ని వన్ డే ఇంటర్నషనల్స్, అవి మామూలు ఓడిఐ నియమాలకు అనుగుణంగా సాగాయి. నియమానుసారం అన్ని మ్యాచ్ లలో ఇన్నింగ్స్ కి 50 ఓవర్లు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంపైర్లు కాని మ్యాచ్ రిఫరీలు కాని ఓవర్లు తగ్గించమంటే అప్పుడు తగ్గిస్తారు. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయచ్చు.
వాతావరణం బాగోని పరిస్థితుల్లో ఫలితం తెలియడానికి, ఇద్దరి జట్లూ 20 ఓవర్లు ఆడాలి (ఒకవేళ మ్యాచ్ గెలవకపోతే, ఉదాహరణకి రెండవసారి బ్యాటింగ్ చేసే జట్టు 20 ఓవర్లు ముగియకుండా ముందుగ అందరు అవుట్ అయితే). వాతావరణం బాగోనప్పుడు, డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. ఒకవేళ ఫలితం కనక ఆ రోజు తెలియక పోతే, రెండు జట్లు తర్వాత రోజు ఆటని పూర్తి చేయడానికి ముందు రోజు వదిలేసిన స్కోరు నుంచి మళ్లీ ఆడటం మొదలు పెడతాయి.
క్యాచ్ అవుట్ సందర్భంలో సరిగా పట్టారో లేదో తేల్చడానికి కొత్త పద్ధతి అమల్లోకి తెచ్చారు, దాని ప్రకారం మూడవ ఎంపైర్ రీప్లే చూసి నిర్ధారిస్తారు: ఒకవేళ గ్రౌండ్లో నించున్న అంపైర్ క్యాచ్ సరిగా పట్టాడో లేదో, లేదా ఆ బంతి "బంప్ బాల్" అయిందో అన్న సందేహం ఉంటే మూడవ అంపైర్‌ను సంప్రదిస్తారు. టీవీ రేప్లే ద్వారా మూడవ అంపైర్ చూసి బ్యాట్స్ మాన్ బ్యాటుకు బంతి తగల్లేదనో, మరే విధంగానో దాన్ని క్యాచ్ గా పరిగణించలేమనో చెప్తే దాన్ని నాటౌట్ గా ప్రకటిస్తారు.
గ్రూప్ స్టేజిలో , సూపర్ 8 స్టేజీలో పాయింట్లను ఈ క్రింది విధంగా నిర్దేశిస్తారు:
ఫలితము | పాయింట్లు |
---|---|
నెగ్గినవి | 2 పాయింట్లు |
సమానమైనవి/ఫలితం తేలనివి | 1 పాయింట్ |
ఓడినవి | 0 పాయింట్ |
ప్రతి గ్రూపు నుండి బాగా ఆడిన రెండు జట్లు సూపర్ 8 కి చేరుకుంటాయి, , అవే గ్రూపులో ఉన్న జట్ల వద్ద గెలిచిన పాయింట్లు కూడా సూపర్ 8 లో తీసుకుంటారు.అదే గ్రూపులో అర్హత పొందని జట్ల వద్ద పాయింట్లు సంపాదిస్తే అవి ఉపయోగపడవు.సూపర్ 8 లో, ప్రతి జట్టు వేరే గ్రూపు నుంచి వచ్చిన మిగతా ఆరు జట్లతో ఆడి, గెలిచిన నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ కు చేరుకుంటాయి.జట్ల యొక్క స్థాయిని పాయింట్ల ద్వారా నిర్దేశిస్తాయి.ఒకవేళ రెండు లేదా మూడు జట్లు సమానం అయితే, ఈ క్రింది పద్ధతులను పాయింట్ల విభజన కోసం వాడతారు.
టోర్నమేంట్ లీగ్ స్టేజీలో మొదలై ఒక్కొక్క విభాగంలో నలుగురు చొప్పున నాలుగు విభాగాలుగా విభజించారు.అదే విభాగంలో ఉన్న జట్లతో ఒక్కసారైనా ఒకరితో ఒకరు ఆడాలి. ఆస్ట్రేలియా,ఇండియా,ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ టీంలను వేరే వేరే విభాగాల్లో నియమించారు, ఈ నాలుగు టీంలకు అభిమానులు ఎక్కువ వస్తారని అంచనా అందుకు కారణం, పైగా వెస్ట్ ఇండీస్‌లో ప్రయాణ సౌకర్యాలు, ఆతిధ్య వసతులు ఎక్కువ లేవు.
వివిధ విభాగాలను కింది పట్టికలో చూపించిన విధంగా విభజించారు. (ఏప్రిల్ 2005 ర్యాంకులు) ప్రతి విభాగం అన్ని మ్యాచ్ లను ఒకే క్రీడా స్థలంలో ఆడాయి.
విభాగం ఏ | విభాగం బి | విభాగం సీ | విభాగం డి |
---|---|---|---|
ఆస్ట్రేలియా (1) దక్షిణాఫ్రికా (5) స్కాట్లాండ్ (12) నెదర్లాండ్స్ (16) |
శ్రీలంక (2) భారతదేశం (6) బంగ్లాదేశ్ (11) బెర్ముడా (15) |
న్యూజీలాండ్ (3) ఇంగ్లాండు (7) కెన్యా (10) కెనడా (14) |
పాకిస్తాన్ (4) వెస్ట్ ఇండీస్ (8) జింబాబ్వే (9) Ireland (13) |
ఆటగాళ్లను ఉత్తేజపరచడానికి టోర్నమేంట్లో చాల వార్మ్-అప్ మ్యాచ్ లు జరిగాయి. గ్రూపులగా ఆడిన మ్యాచ్ లు 13 మార్చి మంగళవారం మొదలైయ్యి 25 మార్చి ఆదివారం ముగుస్తాయి. గ్రూపులుగా మొత్తం 24 మ్యాచ్ లు ఆడారు.
ప్రతి గ్రూపులో బాగా ఆడిన రెండు జట్లు లీగ్ పద్ధతి ద్వారా "సూపర్ 8" స్టేజికి వెళ్తాయి. ప్రతి జట్టు ముందు ఆటల నుంచి గెలిచిన వాళ్ళ స్కోరును సూపర్ 8 స్టేజికి తీసుకు వెళ్తారు. అక్కడ మిగతా గ్రూపుల నుంచి గెలిచిన ఆరు జట్లతో మళ్లీ ఆడతారు.లీగ్ లో ఉన్న మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ కు చేరుకుంటాయి.ఈ పద్ధతిని ఇంతక ముందు ప్రపంచ కప్ లాగా సూపర్ 6 కాకుండా సూపర్ 8 గా మార్చారు. ఈ సూపర్ 8 మ్యాచ్ లు 27 మార్చి, మంగళవారం నుంచి 21 ఏప్రిల్, శనివారం వరకు జరిగాయి. ఈ సూపర్ 8 స్టేజిలో మొత్తం 24 మ్యాచ్ లు ఆడారు.
"సూపర్ 8"లో బాగా ఆడిన నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ కు చేరుకుంటాయి. టోర్నమెంట్ లో #1 జట్టు #4 జట్టుతో ఇంకా #2 జట్టు #3 జట్టుతో తలపడతాయి. ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. సెమీ-ఫైనల్లో గెలిచిన రెండు జట్లు ఫైనల్స్ లో తలపడతాయి.
ఒకవేళ వాతావరణం బాగుండకపోతే ఆడటానికి వీలుగా ప్రతి టోర్నమేంట్ మ్యాచ్ లో ఒక రోజు మిగిలి ఉండేలా చూసుకున్నారు.
అన్ని మ్యాచ్ లు 1330 యు.టి.సి. వద్ద మొదలవుతాయి.
జట్టు | పాయింట్లు | ఆడినవి | గెలిచినవి | టై | ఓడినవి | ఫలితం తేలనివి | నెట్ రన్ రేట్ |
---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 6 | 3 | 3 | 0 | 0 | 0 | +3.433 |
దక్షిణాఫ్రికా | 4 | 3 | 2 | 0 | 1 | 0 | +2.403 |
నెదర్లాండ్స్ | 2 | 3 | 1 | 0 | 2 | 0 | -2.527 |
స్కాట్లాండ్ | 0 | 3 | 0 | 0 | 3 | 0 | -3.793 |
14 మార్చి 2007 |
ఆస్ట్రేలియా 334/6 (50 ఓవర్లు) |
v |
స్కాట్లాండ్ 131/9 (40.1 ఓవర్లు) |
రికీ పాంటింగ్ 113 (93) మజిద్ హక్2/49 (7 ఓవర్లు) |
కాలిన్ స్మిత్ 51 (76) గ్లెన్ మెక్ గ్రాత్ 3/14 (6 ఓవర్లు) |
16 మార్చి 2007 |
దక్షిణాఫ్రికా 353/3 (40 ఓవర్లు) |
v |
నెదర్లాండ్స్ 132/9 (40 ఓవర్లు) |
జాక్వస్ కలిస్ 128* (109) బిల్లీ స్టెల్లింగ్ 1/43 (8 ఓవర్లు) |
ఆర్.టెన్ డొస్చటె 57 (75) జస్టిన్ కెంప్ 2/18 (4 ఓవర్లు) |
18 మార్చి 2007 |
ఆస్ట్రేలియా 358/5 (50 ఓవర్లు) |
v |
నెదర్లాండ్స్ 129 ఆలౌట్ (26.5 ఓవర్లు) |
బ్రాడ్ హోడ్జ్ 123 (89) టిమ్ డె లీడె2/40 (10 ఓవర్లు) |
డాన్ వాన్ బంగ్ 33 (33) బ్రాడ్ హాగ్ 4/27 (4.5 ఓవర్లు) |
20 మార్చి 2007 |
స్కాట్లాండ్ 186/8 (50 ఓవర్లు) |
v |
దక్షిణాఫ్రికా 188/3 (23.2 ఓవర్లు) |
డోగీ బ్రౌన్ 45* (64) ఆండ్రూ హాల్ 3/48 (10 ఓవర్లు) |
గ్రేమ్ స్మిత్ 91 (65) మజిద్ హక్2/43 (6 ఓవర్లు) |
22 మార్చి 2007 |
స్కాట్లాండ్ 136 ఆలౌట్ (34.1 ఓవర్లు) |
v |
నెదర్లాండ్స్ 140/2 (23.5 ఓవర్లు) |
గ్లెన్ రోజర్స్ 26 (30) బిల్లీ స్టెల్లింగ్ 3/12 (8 ఓవర్లు) |
ఆర్.టెన్ డొస్చటె 70* (68) జాన్ బ్లైన్ 2/29 (5 ఓవర్లు) |
24 మార్చి 2007 |
ఆస్ట్రేలియా 377/6 (50 ఓవర్లు) |
v |
దక్షిణాఫ్రికా 294 ఆలౌట్ (48 ఓవర్లు) |
మాథ్యూ హెడెన్ 101 (68) ఆండ్రూ హాల్ 2/60 (10 ఓవర్లు) |
ఎబె డి విలియర్స్92 (70) బ్రాడ్ హాగ్ 3/61 (10 ఓవర్లు) |
అన్ని మ్యాచ్ లు 1330 యు.టి.సి. వద్ద మొదలవుతాయి.
జట్టు | పాయింట్లు | ఆడినవి | గెలిచినవి | టై | ఓడినవి | ఫలితం తేలనివి | నెట్ రన్ రేట్ |
---|---|---|---|---|---|---|---|
శ్రీలంక | 6 | 3 | 3 | 0 | 0 | 0 | +3.493 |
బంగ్లాదేశ్ | 4 | 3 | 2 | 0 | 1 | 0 | -1.523 |
భారతదేశం | 2 | 3 | 1 | 0 | 2 | 0 | +1.206 |
బెర్ముడా | 0 | 3 | 0 | 0 | 3 | 0 | -4.345 |
15 మార్చి 2007 |
శ్రీలంక 321/6 (50 ఓవర్లు) |
v |
బెర్ముడా 78 ఆలౌట్ (24.4 ఓవర్లు) |
మహేళా జయవర్ధనే 85 (90) సలీం ముకుద్దం 2/50 (10 ఓవర్లు) |
లియొనెల్ కాన్ 28 (32) ఫర్వీజ్ మహరూఫ్ 4/23 (7 ఓవర్లు) |
17 మార్చి 2007 |
భారతదేశం 191 ఆలౌట్ (49.3 ఓవర్లు) |
v |
బంగ్లాదేశ్ 192/5 (48.3 ఓవర్లు) |
సౌరవ్ గంగూలీ 66 (129) మష్రాఫ్ మొర్తెజా 4/38 (9.3 ఓవర్లు) |
ముష్ఫికర్ రహీం 56* (107) వీరేంద్ర సెహ్వాగ్ 2/17 (5 ఓవర్లు) |
19 మార్చి 2007 |
భారతదేశం 413/5 (50 ఓవర్లు) |
v |
బెర్ముడా 156 ఆలౌట్ (43.1 ఓవర్లు) |
వీరేంద్ర సెహ్వాగ్ 114 (87) డెల్యోన్ బార్డెన్ 2/30 (5 ఓవర్లు) |
డేవిడ్ హెంప్ 76* (105) అజిత్ అగార్కర్ 3/38 (10 ఓవర్లు) |
21 మార్చి 2007 |
శ్రీలంక 318/4 (50 ఓవర్లు) |
v |
బంగ్లాదేశ్ 112 ఆలౌట్ (37 of 46 ఓవర్లు) |
సనత్ జయసూర్య 109 (87) మహమ్మద్ రఫీక్ 1/48 (10 ఓవర్లు) |
మహమ్మద్ అష్రాఫుల్ 45* (63) లసిత్ మలింగ 3/27 (6 ఓవర్లు) |
23 మార్చి 2007 |
శ్రీలంక 254/6 (50 ఓవర్లు) |
v |
భారతదేశం 185 ఆలౌట్ (43.3 ఓవర్లు) |
ఉపుల్ తరంగ 64 (90) జహీర్ ఖాన్ 2/49 (10 ఓవర్లు) |
రాహుల్ ద్రవిడ్ 60 (82) ముత్తయ్య మురళీధరన్ 3/41 (10 ఓవర్లు) |
25 మార్చి 2007 |
బెర్ముడా 94/9 (21 ఓవర్లు) |
v |
బంగ్లాదేశ్ 96/3 (17.3 of 21 ఓవర్లు) |
డేన్ మైనర్స్ 23 (25) అబ్దుర్ రజాక్ 3/20 (4 ఓవర్లు) |
మహమ్మద్ అష్రాఫుల్ 29* (32) సలీం ముకుద్దం3/19 (5 ఓవర్లు) |
అన్ని మ్యాచ్ లు 1330 యు.టి.సి. వద్ద మొదలవుతాయి.
జట్టు | పాయింట్లు | ఆడినవి | గెలిచినవి | టై | ఓడినవి | ఫలితం తేలనివి | నెట్ రన్ రేట్ |
---|---|---|---|---|---|---|---|
న్యూజిలాండ్ | 6 | 3 | 3 | 0 | 0 | 0 | +2.138 |
ఇంగ్లాండ్ | 4 | 3 | 2 | 0 | 1 | 0 | +0.418 |
కెన్యా | 2 | 3 | 1 | 0 | 2 | 0 | -1.194 |
కెనడా | 0 | 3 | 0 | 0 | 3 | 0 | -1.389 |
14 మార్చి 2007 |
కెనడా 199 ఆలౌట్ (50 ఓవర్లు) |
v |
కెన్యా 203/3 (43.2 ఓవర్లు) |
జి.బర్నెట్ 41 (50) జిమ్మీ కమాండె 2/25 (10 ఓవర్లు) |
స్టీవ్ టికొలో 72* (76) సునీల్ ధనిరాం 1/34 (9 ఓవర్లు) |
16 మార్చి 2007 |
ఇంగ్లాండ్ 209/7 (50 ఓవర్లు) |
v |
న్యూజిలాండ్ 210/4 (41 ఓవర్లు) |
కెవిన్ పీటర్సన్ 60 (92) షేన్ బాండ్ 2/19 (10 ఓవర్లు) |
స్కాట్ స్టైరిస్ 87 (113) జేమ్స్, ఎర్సన్ 2/39 (8 ఓవర్లు) |
18 మార్చి 2007 |
ఇంగ్లాండ్ 279/6 (50 ఓవర్లు) |
v |
కెనడా 228/7 (50 ఓవర్లు) |
ఎడ్ జోయ్స్ 66 (103) సునీల్ ధనిరాం 3/41 (10 ఓవర్లు) |
ఆసిఫ్ ముల్లా 58 (60) రవీంద్ర బోపార 2/43 (9 ఓవర్లు) |
20 మార్చి 2007 |
న్యూజిలాండ్ 331/7 (50 ఓవర్లు) |
v |
కెన్యా 183 ఆలౌట్ (49.2 ఓవర్లు) |
రాస్ టేలర్85 (107) థామస్ ఓడొయో 2/55 (10 ఓవర్లు) |
రవీందు షా 81 (89) జేమ్స్ ఫ్రాంక్లిన్ 2/20 (7.2 ఓవర్లు) |
22 మార్చి 2007 |
న్యూజిలాండ్ 363/5 (50 ఓవర్లు) |
v |
కెనడా 249/9 (49.2 ఓవర్లు) |
లోవ్ విన్సెంట్ 101 (107) కెవిన సంధర్ 2/58 (10 ఓవర్లు) |
జాన్ డేవిడ్ సన్ 53 (31) జీతన్ పటేల్ 3/25 (9.2 ఓవర్లు) |
24 మార్చి 2007 (scorecard) |
కెన్యా 177 ఆలౌట్ (43 ఓవర్లు) |
v |
ఇంగ్లాండ్ 178/3 (33 of 43 ఓవర్లు) |
స్టీవ్ టికొలో 76 (97) జేమ్స్, ఎర్సన్ 2/27 (9 ఓవర్లు) |
ఎడ్ జోయ్స్ 75 (90) థామస్ ఓడొయో 1/27 (6 ఓవర్లు) |
అన్ని మ్యాచ్ లు 1430 యూటీసీ వద్ద మొదలయ్యాయి.
జట్టు | పాయింట్లు | ఆడినవి | గెలిచినవి | టై | ఓడినవి | ఫలితం తేలనివి | నెట్ రన్ రేట్ |
---|---|---|---|---|---|---|---|
వెస్టిండీస్ | 6 | 3 | 3 | 0 | 0 | 0 | +0.764 |
ఐర్లాండ్ | 3 | 3 | 1 | 1 | 1 | 0 | -0.092 |
పాకిస్తాన్ | 2 | 3 | 1 | 0 | 2 | 0 | +0.089 |
జింబాబ్వే | 1 | 3 | 0 | 1 | 2 | 0 | -0.886 |
13 మార్చి 2007 |
వెస్టిండీస్ 241/9 (50 ఓవర్లు) |
v |
పాకిస్తాన్ 187 ఆలౌట్ (47.2 ఓవర్లు) |
మర్లోన్ శామ్యూల్స్ 63 (70) ఇఫ్తిఖర్ అంజుమ్ 3/44 (10 ఓవర్లు) |
షోయిబ్ మాలిక్ 62 (54) డి.స్మిత్ 3/36 (10 ఓవర్లు) |
15 మార్చి 2007 |
ఐర్లాండ్ 221/9 (50 ఓవర్లు) |
v |
జింబాబ్వే 221 ఆలౌట్ (50 ఓవర్లు) |
జెరెమె బ్రే 115* (139) ఎల్టాన్ చిగుంబరా 2/21 (6 ఓవర్లు) |
స్టూవర్ట్ మత్సికెన్యెరి 73* (77) కైలె మెక్ కలన్ 2/56 (9 ఓవర్లు) |
17 మార్చి 2007 |
పాకిస్తాన్ 132 ఆలౌట్ (45.4 ఓవర్లు) |
v |
ఐర్లాండ్ 133/7 (41.4 ఓవర్లు) |
కమ్రాన్ అక్మల్ 27 (53) బోయ్డ్ రాంకిన్ 3/32 (9 ఓవర్లు) |
నియాల్ ఓ'బ్రియాన్ 72 (106) మహమ్మద్ సమి 3/29 (10 ఓవర్లు) |
19 మార్చి 2007 |
జింబాబ్వే 202/5 (50 ఓవర్లు) |
v |
వెస్టిండీస్ 204/4 (47.5 ఓవర్లు) |
సీన్ విలియమ్స్ 70* (88) జెరోమ్ టైలర్ 2/42 (10 ఓవర్లు) |
బ్రియాన్ లారా 44* (68) క్రిస్టోఫర్ మ్ఫోహు 1/34 (9 ఓవర్లు) |
21 మార్చి 2007 |
పాకిస్తాన్ 349 ఆలౌట్ (49.5 ఓవర్లు) |
v |
జింబాబ్వే 99 ఆలౌట్ (19.1 of 20 ఓవర్లు) |
ఇమ్రాన్ నాజిర్ 160 (121) గ్యారీ బెంట్ 3/68 (10 ఓవర్లు) |
ఎల్టాన్ జిగుంబరా 27 (11) షాహిద్ అఫ్రిదీ 3/20 (4 ఓవర్లు) |
23 మార్చి 2007 |
ఐర్లాండ్ 183/8 (48 ఓవర్లు) |
v |
వెస్టిండీస్ 190/2 (38.1 of 48 ఓవర్లు) |
జెరెమె బ్రే 41 (71) క్రిస్ గేల్ 2/23 (10 ఓవర్లు) |
శివ్ నారినె చందర్ పాల్ 102* (113) కైలె మెక్ కలన్1/35 (10 ఓవర్లు) |
ప్రతి తొలి రౌండ్ గ్రూపు నుంచి టాప్ రెండు జట్లు సూపర్ ఎయిట్ స్టేజి పొందారు. అయితే ఎనిమిది జట్లూ ఒక్కొక్కటి ఏడు కాకుండా ఆరు మ్యాచులే ఆడాయి, ప్రతి జట్టు తమ ప్రతినిధియైన వారి ఫలితాన్ని కూడా లెక్కించారు. తద్వారా కింది పట్టికలో, ఒక్కొక్క జట్టుకు ఏడు మ్యాచులు కనిపిస్తాయి.
పచ్చరంగు నేపథ్యంతో చూపించిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హతసాధించాయి.
Team | ఆడినవి | గెలిచినవి | టై అయినవి | ఓడినవి | ఫలితం తేలనివి | నెట్ రన్ రేట్ | పాయింట్లు |
---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 7 | 7 | 0 | 0 | 0 | +2.400 | 14 |
శ్రీలంక | 7 | 5 | 0 | 2 | 0 | +1.483 | 10 |
న్యూజిలాండ్ | 7 | 5 | 0 | 2 | 0 | +0.253 | 10 |
దక్షిణాఫ్రికా | 7 | 4 | 0 | 3 | 0 | +0.313 | 8 |
ఇంగ్లాండ్ | 7 | 3 | 0 | 4 | 0 | −0.394 | 6 |
వెస్టిండీస్ | 7 | 2 | 0 | 5 | 0 | −0.566 | 4 |
బంగ్లాదేశ్ | 7 | 1 | 0 | 6 | 0 | −1.514 | 2 |
ఐర్లాండ్ | 7 | 1 | 0 | 6 | 0 | −1.730 | 2 |
27 మార్చి2007 స్కోర్ కార్డ్ |
ఆస్ట్రేలియా 322/6 (50 ఓవర్లు) |
v | వెస్టిండీస్ 219 (45.3 ఓవర్లు) |
ఆస్ట్రేలియా 103 పరుగులతో గెలిచింది. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా |
28 మార్చి2007 స్కోర్ కార్డ్ |
శ్రీలంక 209 (49.3 ఓవర్లు) |
v | దక్షిణాఫ్రికా 212/9 (48.2 ఓవర్లు) |
దక్షిణాఫ్రికా 1 వికెట్ తేడాతో గెలిచింది ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా |
29 మార్చి2007 స్కోర్ కార్డ్ |
వెస్టిండీస్ 177 (44.4 ఓవర్లు) |
v | న్యూజిలాండ్ 179/3 (39.2 ఓవర్లు) |
న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా |
30 మార్చి2007 స్కోర్ కార్డ్ |
ఇంగ్లాండ్ 266/7 (50 ఓవర్లు) |
v | ఐర్లాండ్ 218 (48.1 ఓవర్లు) |
ఇంగ్లాండ్ 48 పరుగుల తేడాతో గెలిచింది ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా |
31 మార్చి2007 స్కోర్ కార్డ్ |
బంగ్లాదేశ్ 104/6 (22 ఓవర్లు) |
v | ఆస్ట్రేలియా 106/0 (13.5 ఓవర్లు) |
ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచింది సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా |
1 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
శ్రీలంక 303/5 (50 ఓవర్లు) |
v | వెస్టిండీస్ 190 (44.3 ఓవర్లు) |
శ్రీలంక 113 పరుగుల తేడాతో గెలిచింది ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా |
2 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
బంగ్లాదేశ్ 174 (48.3 ఓవర్లు) |
v | న్యూజిలాండ్ 178/1 (29.2 ఓవర్లు) |
న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలిచింది సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా |
3 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
ఐర్లాండ్ 152/8 (35 ఓవర్లు) |
v | దక్షిణాఫ్రికా 165/3 (31.3 ఓవర్లు) |
దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది (డక్‌వర్త్-లూయీస్ పద్ధతి) ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా |
4 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
శ్రీలంక 235 (50 ఓవర్లు) |
v | ఇంగ్లాండ్ 233/8 (50 ఓవర్లు) |
శ్రీలంక 2 పరుగుల తేడాతో గెలిచింది సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా |
7 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
బంగ్లాదేశ్ 251/8 (50 ఓవర్లు) |
v | దక్షిణాఫ్రికా 184 (48.4 ఓవర్లు) |
బంగ్లాదేశ్ 67 పరుగుల తేడాతో గెలిచింది ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా |
8 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
ఇంగ్లాండ్ 247 (49.5 ఓవర్లు) |
v | ఆస్ట్రేలియా 248/3 (47.2 ఓవర్లు) |
ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా |
9 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
న్యూజిలాండ్ 263/8 (50 ఓవర్లు) |
v | ఐర్లాండ్ 134 (37.4 ఓవర్లు) |
న్యూజిలాండ్ 129 పరుగుల తేడాతో గెలిచింది ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా |
10 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
దక్షిణాఫ్రికా 356/4 (50 ఓవర్లు) |
v | వెస్టిండీస్ 289/9 (50 ఓవర్లు) |
దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో గెలిచింది క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా |
11 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
బంగ్లాదేశ్ 143 (37.2 ఓవర్లు) |
v | ఇంగ్లాండ్ 147/6 (44.5 ఓవర్లు) |
ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలచింది కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్ |
12 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
న్యూజిలాండ్ 219/7 (50 ఓవర్లు) |
v | శ్రీలంక 222/4 (45.1 ఓవర్లు) |
శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా |
13 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
ఐర్లాండ్ 91 (30 ఓవర్లు) |
v | ఆస్ట్రేలియా 92/1 (12.2 ఓవర్లు) |
ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలిచింది కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్ |
14 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
దక్షిణాఫ్రికా 193/7 (50 ఓవర్లు) |
v | న్యూజిలాండ్ 196/5 (48.2 ఓవర్లు) |
న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా |
15 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
ఐర్లాండ్ 243/7 (50 ఓవర్లు) |
v | బంగ్లాదేశ్ 169 (41.2 ఓవర్లు) |
ఐర్లాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్ |
16 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
శ్రీలంక 226 (49.4 ఓవర్లు) |
v | ఆస్ట్రేలియా 232/3 (42.4 ఓవర్లు) |
ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా |
17 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
ఇంగ్లాండ్ 154 (48 ఓవర్లు) |
v | దక్షిణాఫ్రికా 157/1 (19.2 ఓవర్లు) |
దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో గెలిచింది కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్ |
18 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
ఐర్లాండ్ 77 (27.4 ఓవర్లు) |
v | శ్రీలంక 81/2 (10 ఓవర్లు) |
శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా |
19 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
వెస్టిండీస్ 230/5 (50 ఓవర్లు) |
v | బంగ్లాదేశ్ 131 (43.5 ఓవర్లు) |
వెస్టిండీస్ 99 పరుగుల తేడాతో గెలిచింది కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్ |
20 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
ఆస్ట్రేలియా 348/6 (50 ఓవర్లు) |
v | న్యూజిలాండ్ 133 (25.5 ఓవర్లు) |
ఆస్ట్రేలియా 215 పరుగుల తేడాతో గెలిచింది క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా |
21 ఏప్రిల్ 2007 స్కోర్ కార్డ్ |
వెస్టిండీస్ 300 (49.5 ఓవర్లు) |
v | ఇంగ్లాండ్ 301/9 (49.5 ఓవర్లు) |
ఇంగ్లాండ్ 1 వికెట్ తేడాతో గెలిచింది కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్ |
Semi-finals | Final | ||||||
24 April - సబీనా పార్క్, కింగ్ స్టన్, జమైకా | |||||||
2 శ్రీలంక | 289/5 | ||||||
3 న్యూజిలాండ్ | 208 | ||||||
28 April - కింగ్స్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్ | |||||||
శ్రీలంక | 215/8 | ||||||
ఆస్ట్రేలియా | 281/4 | ||||||
25 April - బీసెజర్ స్టేడియం, గ్రోస్ ఐస్ లెట్, సెయింట్ లూసియా | |||||||
1 ఆస్ట్రేలియా | 153/3 | ||||||
4 దక్షిణాఫ్రికా | 149 |
24 ఏప్రిల్ 2007 1430 యూటీసీ |
శ్రీలంక 289/5 (50 ఓవర్లు) |
v |
న్యూజిలాండ్ 208 all out (41.4 ఓవర్లు) |
మహేలా జయవర్థనే 115* (109) జేమ్స్ ఫ్రాంక్లిన్ 2/46 (9 overs) |
పీటర్ ఫల్టన్ 46 (77) ముత్తయ్య మురళీధరన్ 4/31 (8 overs) |
25 April 2007 1330 యూటీసీ |
దక్షిణాఫ్రికా 149 ఆలౌట్ (43.5 ఓవర్స్) |
v |
ఆస్ట్రేలియా 153/3 (31.3 ఓవర్స్) |
జస్టిన్ కెంప్ 49* (91) షాన్ 4/39 (10 ఓవర్స్) |
మైకేల్ క్లార్క్ 60* (86) షాన్ పొలాక్ 1/16 (5 overs) |
28 ఏప్రిల్ 2007 1330 యూటీసీ |
ఆస్ట్రేలియా 281/4 (38 ఓవర్స్) |
v |
శ్రీలంక 215/8 (36 ఓవర్స్) |
ఆడమ్ గిల్ క్రిస్ట్ 149 (104) లసిత్ మలింగా 2/49 (8 ఓవర్లు) |
సనత్ జయసూర్య 63 (67) మైకేల్ క్లార్క్ 2/30 (4 ఓవర్స్) |
ఈ ప్రపంచ కప్ లో ఇంతకుముందు 1996 లో ఆడిన శ్రీ లంక , ఆస్ట్రేలియాలు మళ్లీ ఆడారు. ఇలా ఇంతకు ముందు ఆడిన జట్లు మళ్లీ ఆడటం ఇదే మొదటి సారి. 1996 లో శ్రీ లంక గెలిచింది.ఆ మ్యాచ్ లో తప్ప శ్రీ లంకతో జరిగిన ప్రతి ప్రపంచ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియానే నెగ్గింది. 2007 ప్రపంచ కప్ లో శ్రీ లంక ఫైనల్స్ కు రావటం రెండవ సారి, , ఆస్ట్రేలియా ఆరవ సారి.
రికీ పాంటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వర్షం కారణంగా ఆట ఆలస్యం అవటంతో ఇద్దరికీ 38 ఓవర్లకు కుదించారు.ఆ మ్యాచ్ లో ఆడం గిల్చ్రిస్ట్ 149 పరుగుల అత్యధిక స్కోరు సాధించి ప్రపంచ కప్ ఫైనల్స్ లోనే ఎక్కువ స్కోరు సాధించిన వ్యక్తిగా పేరు సంపాదించాడు. శ్రీ లంక, ఆస్ట్రేలియా వాళ్ళ స్కోరును అందుకోలేని విధంగా అతను ఆడాడు.శ్రీ లంక ఆటగాళ్లైన కుమార్ సంగక్కార , సనత్ జయసురియ రెండవ వికెట్ కి 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కాని వారిద్దరి భాగస్వామ్యం ఉన్నంత వరకు గెలుస్తారనే నమ్మకం ఉండేది, వాళ్ళు అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పై నమ్మకం నిమ్మదిగా సన్నగిల్లింది.వర్షం ఎక్కువవటం వల్ల శ్రీ లంక ఇన్నింగ్స్ ని 36 ఓవర్లకు, లక్ష్యాన్ని 269 పరుగులకు కుదించారు. డక్ వర్త్-లూయిస్ లక్ష్యం ప్రకారం 33 వ ఓవర్ వద్ద 37 పరుగుల తర్వాత అంపైర్లు వెలుగు సరిగా లేనందుకు మ్యాచ్ ను నిలిపివేశారు.ఆస్ట్రేలియా ఆటగాళ్ళు నేగ్గుతామని సంబరాలు జరుపుకుంటున్నారు (20 ఓవర్లు అయిపొయాయి), మ్యాచ్ వెలుగు సరిగా లేనందు వల్ల ఆపారని వర్షం వల్ల కాదని అంపైర్లు తప్పుగా చెప్పారు, కాబట్టి ఆఖరి మూడు ఓవర్లు ఆ తర్వాత రోజు ఆడాల్సి వచ్చింది.శ్రీలంక 18 బంతులలో 61 పరుగులు చేయాల్సి ఉంది. మహేలా జయవర్దేనే తర్వాత రోజు కాకుండా అదే రోజు ఆడటానికి అంగీకరించి, తన జట్టుని బ్యాటింగ్‌కి రమ్మని పిలుపునిచ్చి, రికీ పాంటింగ్ తో స్పిన్నర్లు మాత్రమే బౌల్ చెయాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంపైర్లు తరువాత వాళ్ళ తప్పుకు క్షమాపణ చెప్పారు, మ్యాచ్ ఆస్ట్రేలియా 37 పరుగుల తేడాతో గెలిచింది.ఆఖరి మూడు ఓవర్లు శ్రీ లంక ఆటగాళ్ళు చీకట్లో ఆడినట్లు ఆడారు, శ్రీ లంక తొమ్మిది పరుగులు జోడించింది, ఆస్ట్రేలియా డియల్ పద్ధతి ప్రకారం 53-పరుగుల తేడాతో గెలిచింది. శ్రీ లంక ఆస్ట్రేలియా కన్నా రెండు ఓవర్లు తక్కువ ఆడింది.
ఆస్ట్రేలియా ఎక్కడా ఓడిపోకుండా టోర్నమేంట్ గెలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటికి 29 ప్రపంచ కప్ మ్యాచ్ లు ఓడిపోకుండా గెలిచింది. ఆస్ట్రేలియా బౌలర్ గ్లేన్న్ మక్ గ్రాత్ ను 'ప్లేయర్ అఫ్ ది సిరీస్'[17] ఇచ్చి సత్కరించారు.
రికార్డు | ఆడిన విధానం | ఆటగాడు | దేశం | |||
---|---|---|---|---|---|---|
ఎక్కువ పరుగులు | ||||||
659 | మాథ్యు హేడెన్ | ఆస్ట్రేలియా | ||||
548 | మహేలా జయవర్థనే | శ్రీలంక | ||||
539 | రికి పాంటింగ్ | ఆస్ట్రేలియా | ||||
ఎక్కువ వికెట్స్ | ||||||
26 | గ్లెన్ మెక్ గ్రాత్ | ఆస్ట్రేలియా | ||||
23 | ముత్తయ్య మురళీథరన్ | శ్రీ లంక | ||||
షాన్ టైట్ | ఆస్ట్రేలియా | |||||
ఎక్కువ సార్లు అవుట్ చెయ్యటం (వికెట్ కీపర్) | ||||||
17 | ఆడం గిల్ క్రిస్ట్ | ఆస్ట్రేలియా | ||||
15 | కుమార్ సంగక్కర | శ్రీ లంక | ||||
14 | బ్రెండన్ మెక్కల్లం | న్యూజిలాండ్ | ||||
ఎక్కువ క్యాచెస్ (ఫీల్డర్) | ||||||
8 | పోల్ కాలింగ్‌వుడ్ | ఇంగ్లాండ్ | ||||
గ్రేం స్మిత్ | దక్షిణ ఆఫ్రికా | |||||
7 | హెర్షల్ గిబ్స్ | దక్షిణ ఆఫ్రికా | ||||
ఇయాన్ మోర్గాన్ | ఐర్లాండ్ | |||||
మాథ్యూ హేడెన్ | ఆస్ట్రేలియా | |||||
రికీ పాంటింగ్ | ఆస్ట్రేలియా | |||||
Source: Cricinfo.com |
పాకిస్తాన్ కోచ్ బాబ్ వూల్మర్ 2007 మార్చి 18 లో మృతి చెందాడు. ఐర్లాండ్ మీద పాకిస్తాన్ ఓడిన మర్నాడు అతను మరణించాడు. ఈ ఓటమి వల్ల పాకిస్తాన్ వాళ్ళు ప్రపంచ కప్ నుండి నిష్క్రమించారు.జమైకా పోలిసులు ఆటోప్సి చేసినా ఏ నిర్ణయానికి రాలేకపోయారు.అదే రోజు పోలిసులు అతని మృతి సాధారణమైనది కాదు, అందువల్ల పూర్తిస్థాయి విచారణ చేయాలని నిర్ధారించారు.[19] విచారణలో వూల్మర్ ని ఎవరో ఊపిరి ఆడకుండా నొక్కి పెట్టటంతో[20] మృతి చెందాడని, అందువల్ల అది ఒక హత్య [21] కేసుగా విచారణ చేస్తామని చెప్పారు.చాలా విచారణ తరువాత జమైకా పోలిసులు వూల్మర్ ది సాధారణమైన మృతి[22] అని, ఎవరూ చంపలేదని తేల్చారు. పోలీసులు వూల్మర్ ని ఎవరో చంపారని చెప్పిన వ్యాఖ్యలని కూడా వెనక్కి తీసుకున్నారు.
ప్రపంచ కప్ నిర్వాహకులు క్రికెట్ ని ఒక వ్యాపారం లా మార్చేశారని విమర్శించారు.మ్యాచ్ లకు ఐసీసీ భద్రతా నియమాల వల్ల, బయట తిను బండారాలు, సంగీత వాద్యాలు అనుమతించకపోవటం వల్ల తక్కువ జనాలు వచ్చారని ఆరోపించారు. కెరిబియన్ వారి క్రికెట్ ఆచారాలకు[23] వ్యతిరేకంగా అధికారులు ఆటని జనాలకి దూరంగా తీసుకుపోతున్నారని, అందువల్ల ఆట ఉనికిని[24] కోల్పోతుందని నిందించారు. సర్ వివ్ రిచర్డ్స్ కూడా ఇదే విధంగా అభిప్రాయపడ్డారు.[25] టికెట్ల ఖరీదు ఎక్కువ అని, చాల ప్రాంతాలలో[26] జనాలకు అంత ఖరీదు పెట్టి కొనే స్తోమత లేదని కూడా ఐసీసీని తప్పు పట్టారు. ఈ విషయాన్నీ ముందే ఐసీసీ గమనించిందని, కాని ఆ ప్రాంతంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఐసీసీ సీఈఓ, మల్కాం స్పీడ్ వివరించారు.టోర్నమేంట్ గడిచే కొద్ది జనాలు రావటం పెరిగింది. అధికారులు కూడా నియమాలను తగ్గించారు.[27] ముందుగ అనుకొన్న లక్ష్యం ప్రకారం 42 మిలియన్ యుయస్ డాలర్లు ఆదాయం రాకపోయినా టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం క్రిందటి ప్రపంచ కప్ తో పోలిస్తే రెండింతలు అయింది. ఇది అన్ని ప్రపంచ కప్ లతో పోలిస్తే టికెట్ల ద్వారా అత్యధికంగా 32 మిలియన్ యుయస్ డాలర్ల ఆదాయం [13][14][28] వచ్చింది.
ఇండియా , పాకిస్తాన్ రెండేసి మ్యాచ్ లు ఓడిపోయిన వెంటనే ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించటంతో ఈ విధానాన్ని విమర్శించారు.దీని వల్ల ఐర్లాండ్ , బంగ్లాదేశ్జట్లు సూపర్ 8 దశకు చేరుకుని అన్ని మ్యచుల్లోని ఓడిపోయాయి. (బంగ్లాదేశ్సౌత్ ఆఫ్రికా మీద గెలిచిన ఒక్క మ్యాచ్ తప్ప)ఇండియా , పాకిస్తాన్ నిష్క్రమించడంతో చాల మంది అభిమానులు వెనక్కి వెళ్లి పోయారు. దీనితో వాళ్లకు చాల నష్టాలు వచ్చాయి. ఈ మ్యాచ్ బాగా లాభాలు తెచ్చే మ్యాచ్[29]గా భావిస్తారు.2011 క్రికెట్ ప్రపంచ కప్.[29] నాటికి ఐసీసీ ప్రపంచ కప్ విధానాన్ని మారుస్తుందని బిసీసీఐ అభిప్రాయపడింది.
టోర్నమేంట్ చాల రోజులు జరగడాన్ని కూడా విమర్శించారు. ఆరు వారాలు జరిగిన ఈ ప్రపంచ కప్ 2003 ప్రపంచ కప్ జరిగినట్టే జరిగింది. అయిదు వారాలు జరిగిన 1999 ప్రపంచ కప్ , నాలుగు వారాలు జరిగిన 1996 ప్రపంచ కప్ కన్నా 2007 ప్రపంచ కప్ పెద్దది.ప్రఖ్యాత వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మైఖేల్ హోల్డింగ్ కూడా 2007 ప్రపంచ కప్ క్వాలిఫై మ్యాచ్ లు బాగోలేదని పేర్కొన్నారు.చిన్న జట్లు పెద్ద జట్లతో ఆడటం వల్ల ఎక్కువ పరుగుల తేడాతో ఓడిపోతున్నారని,[30] దీనివల్ల లాభం ఏమిటని హోల్డింగ్ ప్రశ్నించారు. పెద్ద జట్లతో స్కాట్లాండ్ లాంటి చిన్న జట్లు ఆడటం వల్ల ఎటువంటి లాభం ఉండదని స్కాట్లాండ్ కెప్టెన్ అయిన జార్జి సల్మొండ్ అభిప్రాయపడ్డాడు, , హోల్డింగ్[31] అన్నట్లు ఎన్నాళ్ళు ఇలా ఉంటుందని ప్రశ్నించాడు.టోర్నమేంట్ లో పాల్గొన్న పెద్ద జట్ల ఆటగాళ్ళు చిన్న జట్లను ప్రపంచ కప్[32] నుండి నిష్క్రమించేలా చేశారు.ఐర్లాండ్ , బంగ్లాదేశ్బాగా ఆడి సూపర్ 8 దశకు చేరుకుని పోటిపడుతూ టోర్నమేంట్[33] అంతా ఆడారు.
అంపైర్లు ఆటను వెలుతురు లేనందు వల్ల ఆపారు, కాని స్కోరు బోర్డు , ఆట గురించి ప్రకటించే వారు ఆస్ట్రేలియా గెలిచిందని ప్రకటించారు. దీనివల్ల ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచామని సంబరాలు చేసుకోవటం మొదలు పెట్టారు, అప్పుడు అంపైర్లు ఆట ఇంకా అవ్వలేదని ఇంకా మూడు ఓవర్లు ఆడాలని తప్పుగా ప్రకటించారు. దీని వల్ల ఫైనల్ మ్యాచ్ చివరిలో కలకలం చెలరేగింది.వెలుతురు సరిగా లేని సమయంలో ఆఖరి మూడు ఓవర్లు శ్రీ లంక వాళ్ళు బ్యాటింగ్ చేసారు. రెండు జట్ల సారధుల మాటకు గౌరవమిచ్చి ఆటను కొనసాగించారు.[34] ఆ పరిస్థితి ఒత్తిడి వల్ల అలా జరిగిందని అంపైర్లు , ఐసీసీ ఆ అనవసరమైన విషయం కోసం క్షమించమని అడిగారు.ఆన్ ఫీల్డ్ అంపైర్లైన స్టీవ్ బక్నర్ , అలీం డర్,ఇంకా మ్యాచ్ లో ఉండాల్సిన మిగతా అంపైర్లైన రూడి కోఎర్ట్జెన్ , బిల్లీ బౌడెన్ , మ్యాచ్ రెఫరీ ఐన జేఫ్ఫ్ క్రౌవ్ లను తర్వాత జరిగే 2007 ట్వంటీ20 వరల్డ్ ఛాంపియన్షిప్ నుంచి బహిష్కరిస్తునట్లు జూన్‌లో ఐసీసీ ప్రకటించింది.[35]
ప్రపంచ కప్ మొదలవుతున్నప్పుడు చాల సమస్యలు ఎదురయ్యాయి.2007 మార్చి 11. ప్రారంభ దినోత్సవం నాటికి కొన్ని క్రీడ స్థలాలు పూర్తి కాలేదు. కొన్ని భద్రత కారణాల వల్ల సబిన పార్క్ వద్ద కొత్తగా కట్టిన నార్త్-స్టాండ్‌లో నిర్మించబడిన కొన్ని సీట్లు నిర్ములించాల్సి వచ్చింది. జమైకాలో త్రేలవ్నీ స్టేడియం లో గ్రౌండ్ ఉద్యోగులకి కొన్ని అనివార్య కారణాల వల్ల వార్మ్-అప్ మ్యాచ్ రావడానికి అనుమతి లభించలేదు.దీనికి తోడు, సౌత్ ఆఫ్రికా , ఆస్ట్రేలియా జట్లు ప్రాక్టీసు సౌకర్యాలపై [36] శ్రద్ధ చూపించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.