![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8a/Buddha_statue_11102016.jpg/640px-Buddha_statue_11102016.jpg&w=640&q=50)
హైదరాబాద్ బుద్ధ విగ్రహం
తెలంగాణ లోని ప్రాచీన స్థలం, ఇండియా / From Wikipedia, the free encyclopedia
హైదరాబాద్ బుద్ధ విగ్రహం భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉన్న ఒక ఏకశిలా విగ్రహం. ఇది గౌతమ బుద్ధుని యొక్క ఏకశిలా విగ్రహలలో ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం. టాంక్బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 మీటర్ల (58 అడుగులు) ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. హైదరాబాదుకు 60 కి.మీ. దూరంలో ఉన్న రాయగిరి గుట్టల్లోని రాతితో గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పాన్ని మలచారు. ఈ శిల్పం 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. డిసెంబరు 1992లో దీనిని ప్రతిష్ఠించారు. హైదరాబాదు నగర చిహ్నంగా చార్మినార్‌తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు.
త్వరిత వాస్తవాలు హైదరాబాదు బుద్ధ విగ్రహం, ప్రదేశం ...
హైదరాబాదు బుద్ధ విగ్రహం | |
---|---|
![]() అభయ ముద్రలో నిలబడి ఉన్న బుద్ధుడు | |
ప్రదేశం | హుస్సేన్ సాగర్, హైదరాబాదు, తెలంగాణ |
అక్షాంశ,రేఖాంశాలు | 17°24′56″N 78°28′30″E |
ఎత్తు | 58 అడుగులు (18 మీటర్లు) |
Dedicated | 1 డిసెంబరు 1992 |
శిల్పి | ఎస్.ఎం.గణపతి |
పరిపాలన సంస్థ | బుద్ద పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ, HMDA |
Material | తెల్లని గ్రానైట్ రాయి |
మూసివేయి