From Wikipedia, the free encyclopedia
హేమంత్ సోరెన్ (జననం: 1975 ఆగస్టు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దీనికి ముందు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఇతను జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు.[1][2][3]
హేమంత్ సోరెన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జులై 4 | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | చంపై సోరెన్ | ||
పదవీ కాలం 2019 డిసెంబరు 29 – 2024 ఫిబ్రవరి 2 | |||
ముందు | ద్రౌపది ముర్ము | ||
తరువాత | చంపై సోరెన్ | ||
పదవీ కాలం 2013 జులై 13 – 2014 డిసెంబరు 28 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రఘుబర్ దాస్ | ||
జార్ఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు | |||
పదవీ కాలం 2015 జనవరి 7 – 2019 డిసెంబరు 28 | |||
గవర్నరు | సయ్యద్ అహ్మద్ ద్రౌపది ముర్ము | ||
ముందు | అర్జున్ ముండా | ||
తరువాత | అమర్ కుమార్ బౌరి | ||
జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 2010 సెప్టెంబరు 11 – 18 జనవరి 2013 | |||
గవర్నరు | ఎం.ఓ.హెచ్. ఫరూక్ సయ్యద్ అహ్మద్ | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
జార్ఖండ్ శాసనసభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 డిసెంబరు 23 | |||
ముందు | హేమలాల్ ముర్ము | ||
నియోజకవర్గం | బర్హైత్ | ||
పదవీ కాలం 2019 డిసెంబరు 23 – 2020 జనవరి 6 | |||
ముందు | లూయిస్ మరాండి | ||
తరువాత | బసంత్ సోరెన్ | ||
నియోజకవర్గం | దుమ్కా | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | స్టీఫెన్ మరాండి | ||
తరువాత | లూయిస్ మరాండి | ||
నియోజకవర్గం | దుమ్కా | ||
రాజ్యసభ సభ్యుడు | |||
పదవీ కాలం 2009 జూన్ 24 – 2010 జులై 7 | |||
Constituency | జార్ఖండ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | నెమారా, బీహార్, భారతదేశం (ప్రస్తుత జార్ఖండ్ ) | 1975 ఆగస్టు 10||
జాతీయత | రాజకీయ నాయకుడు | ||
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
తల్లిదండ్రులు | శిబు సోరెన్, రూపి సోరెన్ | ||
జీవిత భాగస్వామి | |||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హేమంత్ సోరెన్‌ను జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి 2013 జులై 13 నుండి 2014 డిసెంబరు 28 వరకు పనిచేసారు. రెండవసారి ముఖ్యమంత్రిగా 2019 డిసెంబరు 29 నుండి పనిచేసే కాలంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు [4][5][6][7] అరెస్టు చేసిన తర్వాత 2024 జనవరి 31న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. తిరిగి హేమంత్ సోరెన్ 2024 జూన్ 28న బెయిలుపై బయటికి వచ్చి తిరిగి 2024 జులై 4న మూడవసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం అధికారంలో కొనసాగుచున్నారు.[8]
సోరెన్ బీహార్ రంగర్హ్ జిల్లాలోని నెమారా గ్రామంలో రూపీ, శిబు సోరెన్ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి శిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతనికి ఇద్దరు సోదరులు దుర్గా సోరెన్, బసంత్ సోరెన్ ఒక సోదరి అంజలి సోరెన్ ఉన్నారు. సోరెన్బీ హార్‌లోని పాట్నా హై స్కూల్ నుండి ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసాడు. ఎన్నికలు కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సోరెన్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువు అసంపూర్ణంగా వదిలేసాడు.[9][10]
2009 జూన్ 4 నుండి 2010 జనవరి వరకు సోరెన్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. ఆ తరువాత 2013లో జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[11]
హేమంత్‌సోరెన్‌ను జార్ఖండ్‌లో భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు 2024 జనవరి 20న విచారించారు. ఈ క్రమంలోనే అతను తన ముఖ్యమంత్రి పదవికి 2024 జనవరి 31న రాజీనామా చేశాడు.[15] 2024 జూన్ 28న ఝార్ఖండ్ హై కోర్టు ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.[16][17]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.