హీరాకుడ్ ఆనకట్ట
From Wikipedia, the free encyclopedia
హీరాకుడ్ ఆనకట్ట (Hirakud Dam - హీరాకుడ్ డ్యామ్) అనేది మహానదికి అడ్డముగా నిర్మించబడిన ఒక ఆనకట్ట, ఇది భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో సంబల్పూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డ్యామ్ వెనుక ఒక సరస్సు విస్తరించి ఉంది, హీరాకుడ్ రిజర్వాయర్ 55 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది భారతదేశం యొక్క స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభమైన తొలి ప్రధాన బహుళార్ధసాధక నదీలోయ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇది భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట. మొత్తంగా దీని ప్రధాన ఆనకట్ట పొడవు 4.8 కిలోమీటర్లు, డైకెస్ లతో కలుపుకొని మొత్తం పొడవు 25.8 కిలోమీటర్లు.
త్వరిత వాస్తవాలు హీరాకుడ్ ఆనకట్ట, అధికార నామం ...
హీరాకుడ్ ఆనకట్ట | |
---|---|
![]() హీరాకుడ్ ఆనకట్ట యొక్క వరద గేట్లు | |
అధికార నామం | హీరాకుడ్ డ్యామ్ |
ప్రదేశం | సంబల్పూర్, ఒరిస్సా నుండి 15 కిలోమీటర్లు |
నిర్మాణం ప్రారంభం | 1948 |
ప్రారంభ తేదీ | 1957 |
నిర్మాణ వ్యయం | 1.01 billion Rs in 1957 |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | డ్యామ్, రిజర్వాయర్ |
నిర్మించిన జలవనరు | మహానది |
Height | 60.96 మీ. (200 అ.) |
పొడవు | 4.8 కి.మీ. (3 మై.) (main section) 25.8 కి.మీ. (16 మై.) (entire dam) |
Spillways | 64 sluice-gates, 34 crest-gates |
Spillway capacity | 42,450 cubic metres per second (1,499,000 cu ft/s) |
జలాశయం | |
మొత్తం సామర్థ్యం | 5,896,000,000 మీ3 (4,779,965 acre⋅ft) |
పరీవాహక ప్రాంతం | 83,400 కి.మీ2 (32,201 చ. మై.) |
విద్యుత్ కేంద్రం | |
టర్బైన్లు | Power House I (Burla): 2 x 49.5 MW , 3 x 37.5 MW, 2 x 32 MW Kaplan-type Power House II (Chiplima): 3 x 24 MW[1] |
Installed capacity | 347.5 MW[1] |
మూసివేయి