From Wikipedia, the free encyclopedia
సిటీ లైట్స్ 1931, జనవరి 30న విడుదలైన అమెరికా మూకీ హాస్య చలనచిత్రం. చార్లీ చాప్లిన్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో చార్లీ చాప్లిన్, వర్జీనియా చెర్రిల్, హ్యారీ మైయర్స్ తదితరులు నటించారు.[1] ఈ చిత్రంలోని ఒక షాట్ (చాప్లిన్ కు హీరోయిన్ పువ్వును అమ్ముతూ ఫ్లవర్ సార్ అనే డైలాగ్) ప్రపంచంలోనే అత్యధికంగా టేక్స్ (342 టేక్స్) తీసుకున్న షాట్ గా చరిత్రలో నిలిచింది.[2]
సిటీ లైట్స్ | |
---|---|
దర్శకత్వం | చార్లీ చాప్లిన్ |
రచన | చార్లీ చాప్లిన్ |
నిర్మాత | చార్లీ చాప్లిన్ |
తారాగణం | చార్లీ చాప్లిన్, వర్జీనియా చెర్రిల్, హ్యారీ మైయర్స్ |
ఛాయాగ్రహణం | రోలీ టోరెరో, గోర్డెన్ పొల్లాక్, మార్క్ మార్కెలాట్ |
కూర్పు | చార్లీ చాప్లిన్, విల్లార్డ్ నికో |
సంగీతం | చార్లీ చాప్లిన్, జోస్ పాడిల్లా, ఆర్థర్ జాన్స్టన్, అల్ఫ్రెడ్ న్యూమాన్ |
పంపిణీదార్లు | యునైటెడ్ ఆర్టిస్ట్స్ |
విడుదల తేదీ | 30 జనవరి 1931 |
సినిమా నిడివి | 87 నిముషాలు |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $1.5 మిలియన్ |
బాక్సాఫీసు | $5 మిలియన్ |
తనని ఆటపట్టిస్తున్న ఆకతాయిల నుండి తప్పించుకోవడం కోసం ట్రాంప్ (చార్లీ చాప్లిన్), అంధురాలైన పూలు అమ్మే అమ్మాయి (వర్జీనియా చెర్రిల్) దగ్గరకి వస్తాడు. పూలు తీసుకుంటున్న సమయంలో చేతి స్పర్శని బట్టి అతడే తన కంటి ఆపరేషన్ ను డబ్బులిచ్చిన వ్యక్తి అని గుర్తిస్తుంది. ట్రాంప్ కూడా ఆమెను గుర్తిస్తాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటలు జరుగుతాయి. ఇది చిత్ర కథ.[3]
1928 డిసెంబరులో ఈ చిత్రం యొక్క చిత్రీకరణ మొదలై 1930, సెప్టెంబరులో పూర్తయింది. దీనిని 1.5 మిలియన్లు డాలర్లు ఖర్చు అయింది. 1931, జనవరి 30న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డుతో 5 మిలియన్లు డాలర్లు వసూళ్లు చేయడమేకాకుండా విమర్శకుల ప్రసంశలు అందుకుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.