From Wikipedia, the free encyclopedia
సికందర్ ఖాన్ లోడీ (1458 జులై 17 – 1517 నవంబర్ 21) 1489 నుంచి 1517 వరకు రాజ్యపాలన చేసిన ఢిల్లీ సుల్తాను.[1] ఇతను తన తండ్రి బలూల్ ఖాన్ లోడీ 1489 జులైలో మరణించిన తర్వాత లోడీ వంశ వారసుడిగా రాజ్యాధికారం చేపట్టాడు. ఇతను ఢిల్లీ సుల్తానేట్ కి సంబంధించి లోడీ వంశంలో రెండవ వాడు, అత్యంత విజయవంతమైన పరిపాలకుడు. ఇతను పర్షియన్ భాషలో పండితుడు కూడా. 9000 పద్యాలు కలిగిన ఒక కావ్యం కూడా రాశాడు.[2] ఒకప్పుడు ఢిల్లీ సుల్తానుల పరిపాలనలో ఉండి, ప్రస్తుతం నియంత్రణ కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుని లోడీ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నించాడు.
సికందర్ ఖాన్ లోడీ | |||||
---|---|---|---|---|---|
ఢిల్లీ సుల్తాన్ Sultan of Hindustan Abu Al-Muzaffar Ghazi Sultan Sikandar Khan Lodi | |||||
30 వ ఢిల్లీ సుల్తాన్ | |||||
పరిపాలన | 1489 జులై 17 – 1517 నవంబర్ 21 | ||||
Coronation | 1489 జులై 17 | ||||
పూర్వాధికారి | బలూల్ ఖాన్ లోడీ | ||||
ఉత్తరాధికారి | ఇబ్రహీం లోడీ | ||||
జననం | నిజాం ఖాన్ 1458 జులై 17 ఢిల్లీ ఢిల్లీ సుల్తానేట్ | ||||
మరణం | 1517 నవంబరు 21 (59 సంవత్సరాలు) ఆగ్రా ఢిల్లీ సుల్తానేట్ | ||||
Burial | లోడీ గార్డెన్స్, ఢిల్లీ | ||||
వంశము | ఇబ్రహీం లోడీ
మహమూద్ ఖాన్ లోడీ ఇస్మాయిల్ ఖాన్ లోడీ హుస్సేన్ ఖాన్ లోడీ జలాల్ ఖాన్ లోడీ దౌలత్ ఖాన్ లోడీ | ||||
| |||||
రాజవంశం | లోడీ వంశం | ||||
తండ్రి | బలూల్ ఖాన్ లోడీ | ||||
తల్లి | బీబీ అంభా | ||||
మతం | సున్నీ ఇస్లాం |
సికందర్ సుల్తాను బహ్లూల్ ఖాన్ లోడి, బీబీ అంబా రెండో కుమారుడు. ఆమె హిందూ స్వర్ణకారుడు సిర్హిండు కుమార్తె. [ఆధారం చూపాలి] ఆయన తండ్రి ఆఫ్ఘన్ సంతతికి చెందినవాడు.[3]
సికందర్ తన పరిపాలనలో వాణిజ్యాన్ని ప్రోత్సహించి సమర్ధత కలిగిన పాలకుడుగా పేరుగడించాడు. అయినప్పటికీ హిందువులపట్ల వివక్ష చూపాడు. ఆయన లోడీ భూభాగాన్ని గ్వాలియరౌ, బీహారు ప్రాంతాలకు విస్తరించాడు. ఆయన అలూయిద్దిన్ హుస్సేన్ షాతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. 1503 లో ప్రస్తుత ఆగ్రాను స్థాపించాడు.[4]
కొత్తగా సింహాసనం అధిష్టించిన మానసింహ ఢిల్లీ నుంచి వచ్చిన దండయాత్రను ఎదుర్కొనడానికి సిద్ధం చేసుకోలేదు. బహ్లూల్ లోడికి 8,00,000 టంకాలు (నాణేలు) కప్పం ఇచ్చి యుద్ధాన్ని నివారించాలని నిర్ణయించాడు. [5] 1489 లో బహ్లూల్ లోడి వారసుడిగా సికందర్ లోడి ఢిల్లీ సుల్తాను అయ్యాడు. 1500 లో సికందర్ లోడిని పడగొట్టే కుట్రలో పాల్గొన్న ఢిల్లీకి చెందిన కొంతమంది తిరుగుబాటుదారులకు మానసింహ ఆశ్రయం కల్పించాడు. మానసింహాను శిక్షించడానికి తన భూభాగాన్ని విస్తరించడానికి సుల్తాను గ్వాలియరుకు వ్యతిరేకంగా దండయాత్రను ప్రారంభించాడు. 1501 లో అతను గ్వాలియరు లోని ధోలాపూరును స్వాధీనం చేసుకున్న తరువాత దాని పాలకుడు వినాయక-దేవా గ్వాలియరుకు పారిపోయాడు.[6]
సికందర్ లోడి తరువాత సైన్యాలను గ్వాలియరు వైపు నడిపించాడు. కాని చంబల్ నదిని దాటిన తరువాత అతని శిబిరంలో ఒక అంటువ్యాధి వ్యాప్తి చెందిన కారణంగా బలవంతంగా దండయాత్రను ఆపవలసిన అగత్యం ఏర్పడింది. లోడితో రాజీ పడటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న మనుసింహ, తన కుమారుడు విక్రమాదిత్యను బహుమతులతో లోడి శిబిరానికి పంపాడు. కుమారుడితో పపంపిన వర్తమానంలో " డిల్లీ నుండి తిరుగుబాటుదారులను పంపివేస్తానని. బదులుగా ధొల్పూరును తిరిగి వినాయక-దేవాకు చేయాలని " షరతు విధించాడు. సికందర్ లోడి ఈ నిబంధనలకు అంగీకరించి ధోల్పూరును వదిలిపెట్టాడు. చరిత్రకారుడు కిషోరి శరన్ లాల్ " వినయ దేవ ధోల్పూర్ను కోల్పోలేదని వెల్లడించాడు: ఈ వ్యాఖ్యానం ఢిల్లీ చరిత్రకారులచే సుల్తాన్ ప్రశంసించటానికి సృష్టించబడిందని " అభిప్రాయపడ్డాడు.[7]
1504 లో సికందర్ లోడి తోమరాలకు వ్యతిరేకంగా యుద్ధం కొనసాగించాడు. ముందుగా ఆయన గ్వాలియరు తూర్పున ఉన్న మాండ్రేయల్ కోటను స్వాధీనం చేసుకున్నాడు.[7] ఆయన మాండ్రేయల్ పరిసరప్రాంతాలను ప్రాంతాలను దోచుకొన్న తరువాత ఆయన సైనికులు అంటువ్యాధి వ్యాప్తి చెందడం కారణంగా ప్రాణాలను కోల్పోయారు. ఫలితంగా ఆయన బలవంగంగా తిరిగి ఢిల్లీకి వెళ్ళవలసిన అగత్యం ఏర్పడింది.[8]కొద్దికాలానికే లోడీ పాలానా కేంద్రాన్ని కొత్తగా ఏర్పడిన ఆగ్రా నగరానికి మార్చాడు. ఇది గ్వాలియరుకు దగ్గరగా ఉంది. తరువాత లోడీ ధోల్పూరును స్వాధీనం చేసుకుని తరువాత గ్వాలియరును దాడిచేయడానికి వెళ్లాడు. ఈ సాహసయాత్రను ఆయన జిహాదుగా వర్ణించాడు. 1505 సెప్టెంబరు నుండి 1506 మే వరకు గ్వాలియరు చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలను దోచుకున్నాడు. కానీ మానసింహా అవలంబించిన మాటు వేసి దాడి చేసి తప్పించుకునే వ్యూహాల కారణంగా గ్వాలియరు కోటను స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యాడు. లోడి పంటలను నాశనం చేసినందున అతడి సైన్యాలకు ఏర్పడిన ఆహారపు కొరత వలన లోడి ముట్టడిని ఆపి బలవంతంగా వెనుతిరిగాల్సి వచ్చింది. ఆగ్రాకు తిరిగి వెళ్ళే దారిలో జట్వార్ సమీపంలో, మానసింహ మాటు వేసి దాడి చేసి లోడి సైన్యాలకు భారీ నష్టం కలిగించాడు.[9]
గ్వాలియర్ కోటను ఆక్రమించడంలో విఫలమవడంతో గ్వాలియరు చుట్టుపక్కల చిన్న కోటలను పట్టుకోవాలని లోడి నిర్ణయించుకున్నాడు. ఈ సమయానికి ధోల్పూరు, మాండ్రేయలు అతని నియంత్రణలో ఉన్నాయి. ఫిబ్రవరి 1507 లో ఆయన నార్వారు-గ్వాలియరు మార్గంలో ఉన్న ఉదిత్నగర్ (ఉత్గిర్ లేదా అవంత్ఘర్) కోటను స్వాధీనం చేసుకున్నాడు.[10] 1507 సెప్టెంబరులో ఆయన నార్వారు మీద దాడి చేశాడు. దీని పాలకుడు (తోమరా వంశం సభ్యుడు) గ్వాలియరు తోమరాలు, మాల్వా సుల్తానేటుతో మార్చి, మార్చి సంకీర్ణం ఏర్పరచుకున్నాడు. లోడి ఒక సంవత్సర కాలం ముట్టడి చేసిన తరువాత ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. [11] 1508 డిసెంబరులో లోడి నార్వారు బాధ్యతను రాజ్ సింగ్ కచ్చావహాకు అప్పగించి గ్వాలియరుకు ఆగ్నేయ దిశగా ఉన్న లాహార్ (లాహేర్) కు సేనలను తరలించాడు. ఆయన కొన్ని నెలల పాటు లాహార్లో నివసించి తిరుగుబాటుదారులను అణిచివేసాడు. [11]తరువాత కొన్ని సంవత్సరాలలో లోడి ఇతర వివాదాలలో బిజీగా ఉన్నాడు. 1516 లో అతను గ్వాలియర్ని పట్టుకోవటానికి ఒక ప్రణాళికను రూపొందించినప్పటికీ అనారోగ్యం కారణంగా దడి చేయలేక పోయాడు. మానసింహ 1516 లో మరణించాడు. సికందర్ లోడి అనారోగ్యం కారణంగా నవంబరు 1517 నవంబరులో మరణించాడు.[12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.