సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న క్రికెట్ స్టేడియం. జైపూర్ రాష్ట్ర మాజీ మహారాజా సవాయి మాన్ సింగ్ II పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. స్టేడియం సామర్థ్యం 30,000. 2017 ఆగస్టు 19 నాటికి ఇక్కడ ఒక టెస్టు, 19 వన్‌డేలు జరిగాయి.

త్వరిత వాస్తవాలు Location, Owner ...
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం
SMS
Thumb
IPL 2013 ఐపిఎల్‌లో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం
Locationజైపూర్, రాజస్థాన్
Ownerరాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్
Operatorరాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్
Capacity30,000
Surfaceపచ్చిక
మైదాన సమాచారం
స్థాపితం1969
వాడుతున్నవారుభారత క్రికెట్ జట్టు
రాజస్థాన్ క్రికెట్ జట్టు
రాజస్థాన్ రాయల్స్ (2008-15 & 2018–present)
ఎండ్‌ల పేర్లు
వన విహార్ కాలనీ ఎండ్
గఢ్ గణేష్ టెంపుల్ ఎండ్
అంతర్జాతీయ సమాచారం
ఏకైక టెస్టు1987 ఫిబ్రవరి 21:
 India v  పాకిస్తాన్
మొదటి ODI1983 అక్టోబరు 2:
 India v  పాకిస్తాన్
చివరి ODI2013అక్టోబరు 16:
 India v  ఆస్ట్రేలియా
మొదటి T20I2021 నవంబరు 17:
 India v  న్యూజీలాండ్
మొదటి WODI1984 జనవరి 25:
 India v  ఆస్ట్రేలియా
చివరి WODI2006 డిసెంబరు 21:
 India v  శ్రీలంక
2021 నవంబరు 17 నాటికి
Source: ESPNcricinfo
మూసివేయి

చరిత్ర

భారత, పాకిస్తాన్‌ల మధ్య 1987 లో జరిగిన టెస్టు, సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌. 1987 ఫిబ్రవరిలో పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియా-ఉల్-హక్ తన "క్రికెట్ ఫర్ పీస్" దౌత్యంలో భాగంగా ఆ మ్యాచ్‌ రెండవ రోజు ఆటను స్టేడియంలో కూచుని చూసాడు.

ఆ టెస్టులో 17 ఏళ్ల తర్వాత యూనిస్ అహ్మద్ టెస్ట్ మ్యాచ్‌కి తిరిగి వచ్చాడు. సునీల్ గవాస్కర్ ఆ మ్యాచ్‌లో మొదటి బంతికే అవుటయ్యాడు. అతని కెరీర్‌లో అలా ఔటవడం అది మూడోసారి.


ఆస్ట్రేలియాపై భారత్ 359 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి భారత్‌ తరఫున అత్యంత వేగంగా శతకం చేసిన వేదిక కూడా ఇదే. [1]

అభివృద్ధి

2006 లో స్టేడియంను రూ.400 కోట్ల వ్యయంతో నవీకరించారు.[2] రూ.7 కోట్లతో ప్రపంచ స్థాయి క్రికెట్ అకాడమీ నిర్మించారు. స్టేడియంలో 28 గదులు, ఒక వ్యాయామశాల, ఒక రెస్టారెంటు, 2 సమావేశ మందిరాలు, ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.[3]

మ్యాచ్‌లు

సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఆడిన మొదటి వన్‌డే 1983లో భారత పాకిస్తాన్‌ల మధ్య పోటీతో ప్రారంభమైంది, ఇందులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 1983 ప్రపంచ కప్ ఫైనల్‌ను గెలుచుకున్న జట్టు లోని ఆటగాళ్ళే ఈ మ్యాచ్‌లో కూడా ఆడారు.

2008లో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సోహైల్ తన్వీర్, రాజస్థాన్ రాయల్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతూ ఐపీఎల్ చరిత్రలో 6 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. [4]

గ్రౌండ్ రికార్డులు

ప్రధాన టోర్నమెంట్లు

శతకాల జాబితా

టెస్ట్ సెంచరీలు

మరింత సమాచారం నం., స్కోర్ ...
నం. స్కోర్ ఆటగాడు జట్టు బంతులు సత్రాలు. ప్రత్యర్థి జట్టు తేదీ ఫలితం
1 110 మహ్మద్ అజారుద్దీన్  భారతదేశం 211 1  పాకిస్తాన్ 21 ఫిబ్రవరి 1987 డ్రా [5]
2 125 రవిశాస్త్రి  భారతదేశం - 1  పాకిస్తాన్ 21 ఫిబ్రవరి 1987 డ్రా [5]
3 114 రమీజ్ రాజా  పాకిస్తాన్ 279 2  భారతదేశం 21 ఫిబ్రవరి 1987 డ్రా [5]
మూసివేయి

వన్ డే ఇంటర్నేషనల్స్

మరింత సమాచారం సం, స్కోరు ...
సం స్కోరు ఆటగాడు జట్టు బంతులు ఇన్నింగ్సులు ప్రత్యర్థి తేదీ ఫలితం
1 104 జియోఫ్ మార్ష్  ఆస్ట్రేలియా 139 1  భారతదేశం 7 సెప్టెంబరు 1986 ఓటమి[6]
2 111 డేవిడ్ బూన్  ఆస్ట్రేలియా 118 1  భారతదేశం 7 సెప్టెంబరు 1986 ఓటమి[6]
3 102 కృష్ణమాచారి శ్రీకాంత్  భారతదేశం 104 2  ఆస్ట్రేలియా 7 సెప్టెంబరు 1986 గెలుపు[6]
4 100* వినోద్ కాంబ్లీ  భారతదేశం 149 1  ఇంగ్లాండు 18 జనవరి 1993 ఓటమి[7]
5 105 సచిన్ టెండూల్కర్  భారతదేశం 134 1  వెస్ట్ ఇండీస్ 11 నవంబరు 1994 గెలుపు[8]
6 102 రికీ పాంటింగ్  ఆస్ట్రేలియా 112 1  వెస్ట్ ఇండీస్ 4 మార్చి 1996 ఓటమి[9]
7 106 డారిల్ కల్లినన్  దక్షిణాఫ్రికా 130 1  భారతదేశం 23 అక్టోబరు 1996 గెలుపు[10]
8 138* కుమార్ సంగక్కర  శ్రీలంక 147 1  భారతదేశం 31 అక్టోబరు 2005 ఓటమి[11]
9 183* ఎంఎస్ ధోని  భారతదేశం 145 2  శ్రీలంక 31 అక్టోబరు 2005 గెలుపు[11]
10 104* క్రిస్ గేల్  వెస్ట్ ఇండీస్ 118 2  బంగ్లాదేశ్ 11 అక్టోబరు 2006 గెలుపు[12]
11 123* షహరియార్ నఫీస్  బంగ్లాదేశ్ 161 1  జింబాబ్వే 13 అక్టోబరు 2006 గెలుపు[13]
12 133* క్రిస్ గేల్  వెస్ట్ ఇండీస్ 135 2  దక్షిణాఫ్రికా 2 నవంబరు 2006 గెలుపు[14]
13 138* గౌతమ్ గంభీర్  భారతదేశం 116 2  న్యూజీలాండ్ 1 December 2010 గెలుపు[15]
14 141* రోహిత్ శర్మ  భారతదేశం 123 2  ఆస్ట్రేలియా 16 అక్టోబరు 2013 గెలుపు[16]
15 100* విరాట్ కోహ్లీ  భారతదేశం 52 2  ఆస్ట్రేలియా 16 అక్టోబరు 2013 గెలుపు[16]
మూసివేయి

ఇవి కూడా చూడండి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.