సముద్రమట్టం (ఆంగ్లం Sea level) భూమి మీద ఎత్తైన లేదా లోతైన ప్రదేశాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం.సముద్రమట్టం అనగా "నిశ్చలమైన నీటి ఉపరితలం" - అనగా సముద్రం మీద గాలి ప్రభావం లేకుండా, అలల యొక్క సగటు ఎత్తుల్ని కొంతకాలం కొలిచి నిర్ణయిస్తారు. ఇది ఆ ప్రదేశంలోని భూమి ఎత్తును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే అలల ఆటుపోట్లు, మారుతున్న భూతల స్వరూపం వంటి అనేక అంశాలు కారణంగా సముద్ర మట్టం కొలత చాలా క్లిష్టం అవుతుంది.సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల ఎత్తు (ఎలివేషన్) సముద్రమట్టం రిఫరెన్సుగా చెబుతారు. అయితే నిజానికి వివిధ ప్రదేశాలలో సముద్రమట్టం ఒకటిగా ఉండదు. కనుక సాపేక్షంగా చెప్పడానికి ఒక "level" reference surface కావాలి. దానిని datum లేదా geoid అంటారు. వేరే విధమైన external forces లేకుండా ఉంటే గనుక mean sea level ఈ geoid surface కు సమతలంలో ఉంటుంది. ఇది భూమియొక్క గురుత్వాకర్షణ శక్తికి ఇది ఒక సమస్థితి తలం (equipotential surface) అవుతుంది. కాని వాస్తవ పరిస్థితిలో ఇది జరుగదు. సముద్ర ప్రవాహాలు, గాలి వీచడం, వాతావరణంలో ఒత్తిడి తేడాలు, ఉష్ణోగ్రతలో తేడాలు, ఉప్పదనంలో తేడాలు వంటి అనేక కారణాలవలన సముద్రమట్టం అన్నిచోట్లా ఒకవిధంగా ఉండదు. దీర్ఘకాలిక కొలతలలో కూడా ఈ అంతరాలను సమం చేయడం కుదరదు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా సముద్రతలంలో ± 2 మీటర్ల తేడా ఉంటుంది. ఉదాహరణకు పనామా కాలువకు ఒక ప్రక్క అట్లాంటిక్ మహాసముద్రం వైపు కంటే రెండవ ప్రక్క పసిఫిక్ మహాసముద్రం వయపు సముద్రతలం ఎత్తు 20 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటుంది.సగటు సముద్రమట్టంను (Mean Sea Level) ఆధారంగా చేసుకొని భూగోళం మీద నిమ్నోన్నతాలను అంటే వివిధ ఖండ, సముద్ర భాగాల యొక్క స్థలాకృతులను సూచించే రేఖాచిత్రాన్ని హిప్సోగ్రాఫిక్ వక్రం అంటారు.

23 long tide gauge రికార్డులలో తీసుకొన్న సముద్ర మట్టం కొలతల ప్రకారం 20వ శతాబ్దంలో సముద్రమట్టం 20 సెంటీమీటర్లు (8 అంగుళాలు) పెరిగినట్లు తెలుస్తుంది..అంటే సంవత్సరానికి 2 మిల్లీమీటర్లచొప్పున.పెరుగుతుంది

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.