![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/4/43/Sathya_Sai_baba.jpg/640px-Sathya_Sai_baba.jpg&w=640&q=50)
సత్య సాయి బాబా
భారతీయ ఆధ్యాత్మిక గురువు. / From Wikipedia, the free encyclopedia
సంబంధిత పేరుగల మరికొన్ని వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ సాయిబాబా చూడండి.
త్వరిత వాస్తవాలు దక్షిణ భారతదేశం ఆధునిక యుగం, పేరు: ...
దక్షిణ భారతదేశం ఆధునిక యుగం | |
---|---|
![]() తన సంతకముతో సత్య సాయిబాబా చిత్రం | |
పేరు: | సత్య సాయిబాబా |
జననం: | నవంబరు 23, 1926 పుట్టపర్తి అనంతపురం జిల్లా ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా |
మరణం: | 2011 ఏప్రిల్ 24(2011-04-24) (వయసు 84) |
సిద్ధాంతం / సంప్రదాయం: | అద్వైతం |
ముఖ్య వ్యాపకాలు: | మతం, ధర్మం, సమాజం, ఆధ్యాత్మికం, నీతిబోధ |
ప్రముఖ తత్వం: | మత సామరస్యం, సకల ప్రాణుల పట్ల ప్రేమ, religious syncretism, ఆహింస |
ప్రభావితమైనవారు: | ఐసాక్ టిగ్రెట్ట్, నారాయణ కస్తూరి, అబ్దుల్ కలామ్, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, టి.ఎన్.శేషన్, సుషీల్ కుమార్ షిండే, దానా గిల్లెస్పీ, ఆర్నాల్డ్ షుల్మాన్, బిల్ ఐట్కిన్, వ్లాడిమిర్ ఆంటొనోవ్, జొవాన్ బ్రౌన్, ఆలిస్ కోల్ట్రేన్, బెంజమిన్ క్రీమె, మేనార్డ్ ఫెర్గూసన్, పీటర్ ప్రుజాన్, గిరిజా ప్రసాద్ కొయిరాలా,సచిన్ టెండుల్కర్,సునీల్ గవాస్కర్ |
మూసివేయి
సత్య సాయి బాబా (నవంబరు 23, 1926 - ఏప్రిల్ 24, 2011) భారతీయ ఆధ్యాత్మికవేత్త. ఇతనిని 'గురువు' అని, 'వేదాంతి' అని, 'భగవంతుని అవతారం' అని, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడని పలువురు విశ్వసిస్తారు.[1][2] ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.[3]
సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి.[4] ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించేవారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు.[5]