Remove ads
From Wikipedia, the free encyclopedia
శ్రేయాస్ సంతోష్ అయ్యర్ (జననం 1994 డిసెంబరు 6) భారత క్రికెట్ జట్టులో ఆడుతున్న కుడిచేతి వాటం బ్యాటరు. అతను భారత జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో ఆడాడు. అయ్యర్ తన తొలి టెస్టు మ్యాచ్ 2021 నవంబరులో న్యూజిలాండ్‌తో ఆడాడు. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్సులో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించాడు. అలా చేసిన మొదటి భారతీయ ఆటగాడతడు.[1] [2] అయ్యర్ దేశవాళీ క్రికెట్లో ముంబై తరపున ఆడతాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2014 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత అండర్-19 క్రికెట్ జట్టు తరపున ఆడాడు. [3]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | శ్రేయాస్ సంతోష్ అయ్యర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ముంబై | 1994 డిసెంబరు 6|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11 అం. (1.80 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడీచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 303) | 2021 డిసెంబరు 3 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 9 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 219) | 2017 డిసెంబరు 10 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 జనవరి 15 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 41 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 70) | 2017 నవంబరు 1 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 నవంబరు 22 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 41 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013/14–present | ముంబై | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2021 | ఢిల్లీ క్యాపిటల్స్ (స్క్వాడ్ నం. 41) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 11 |
శ్రేయాస్ అయ్యర్ 1994 డిసెంబరు 6 న ముంబైలోని చెంబూర్‌లో తమిళుడైన తండ్రి సంతోష్ అయ్యర్, తుళువ తల్లి రోహిణి అయ్యర్ లకు జన్మించాడు. అతని పూర్వీకులు కేరళలోని త్రిస్సూర్‌కు చెందినవారు. [4] [5] [6] అతను మాతుంగ లోని డాన్ బాస్కో హై స్కూల్[7] రామ్‌నిరంజన్ ఆనందిలాల్ పోదార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లలో చదువుకున్నాడు.
18 సంవత్సరాల వయస్సులో అయ్యర్‌ను శివాజీ పార్క్ జింఖానాలో కోచ్ ప్రవీణ్ ఆమ్రే గుర్తించాడు. ఆమ్రే వద్ద ప్రారంభ క్రికెట్ శిక్షణ పొందాడు. [8] అయ్యర్‌ను అతని సహచరులు వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చేవారు. [9] ముంబయిలోని పోదార్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ అయ్యే సమయంలో అయ్యర్, తన కళాశాల జట్టుకు కొన్ని ట్రోఫీలను సాధించడంలో తోడ్పడ్డాడు. [10]
2014లో, అయ్యర్ ట్రెంట్ బ్రిడ్జ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. UK పర్యటనలో, అతను మూడు మ్యాచ్‌లు ఆడాడు, 99 సగటుతో 297 పరుగులు చేశాడు, అత్యధిక స్కోరు 171, ఇది కొత్త జట్టు రికార్డు. [11]
అయ్యర్ 2014-15 విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతూ 2014 నవంబరులో ముంబై తరపున తన లిస్ట్ A అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీలో అతను 54.60 సగటుతో 273 పరుగులు చేశాడు. అయ్యర్ 2014 డిసెంబరులో 2014-15 రంజీ ట్రోఫీలో తన తొలి ఫస్ట్-క్లాస్ ఆట ఆడాడు. తన తొలి రంజీ సీజన్లో 50.56 సగటుతో రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో మొత్తం 809 పరుగులు చేశాడు. 2014–15 రంజీ ట్రోఫీలో 7వ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. [12]
2015-16 రంజీ ట్రోఫీలో అయ్యర్, 73.39 సగటుతో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలతో సహా 1,321 పరుగులు చేశాడు. ఆ రంజీ సీజన్లో టాప్ స్కోరరుగా, ఒకే రంజీ ట్రోఫీ పోటీలో 1,300 పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. [13] 2016-17 రంజీ ట్రోఫీలో, అయ్యర్ 42.64 సగటుతో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలతో సహా 725 పరుగులు చేశాడు. అతను ముంబైలో 3-రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుపై 210 బంతుల్లో 202 పరుగులు చేశాడు. ఇది అతని అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు.
2018 సెప్టెంబరులో అయ్యర్, విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [14] ఏడు మ్యాచ్‌ల్లో 373 పరుగులతో టోర్నమెంట్లో ముంబై తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. [15] 2018 అక్టోబరులో అయ్యర్, దేవధర్ ట్రోఫీలో భారత B జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [16] అతను మూడు మ్యాచ్‌లలో 199 పరుగులతో దేవధర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చ్సిన బ్యాటరుగా నిలిచాడు. [17]
2019 ఫిబ్రవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభ రౌండ్లో అయ్యర్ 147 పరుగులు చేసి, టి20లో అత్యధిక స్కోరు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్ అయ్యాడు.[18]
2021 మార్చిలో, రాయల్ లండన్ వన్-డే కప్ 2021 సీజనులో అయ్యర్‌ను లాంకషైర్ తీసుకుంది. [19] [20]
2015 ఫిబ్రవరిలో 2015 ఐపిఎల్ ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ అయ్యర్‌ను 2.6 కోట్లకు కొనుక్కుంది. తద్వారా టోర్నమెంట్లో అత్యధికంగా సంపాదించిన కొత్త ఆటగాడుగా అయ్యర్ నిలిచాడు. అతను 14 మ్యాచ్‌లలో 33.76 సగటుతో, 128.36 స్ట్రైక్ రేట్‌తో 439 పరుగులు చేసాడు, అయ్యర్ 2015 ఐపిఎల్‌లో 9వ అత్యంత స్థిరమైన ఆటగాడుగా, ఎదిగివస్తున్న ఆటగాడుగా నిలిచాడు. [21]
2018 ఐపిఎల్ వేలంలో అయ్యర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ పాడుకుంది. 2018 ఏప్రిల్ 25న, అతను గౌతమ్ గంభీర్ స్థానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [22] [23] [24] 2018 ఏప్రిల్ 27న, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 సంవత్సరాల 142 రోజుల వయస్సులో ఐపిఎల్ చరిత్రలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ అయ్యాడు. ఐపిఎల్ చరిత్రలో కెప్టెన్సీ వహించిన పిన్న వయస్కులలో అతను నాల్గవ స్థానంలో ఉన్నాడు.[25] కెప్టెన్‌గా తన తొలి ఐపిఎల్ ఆటలో శ్రేయాస్ అయ్యర్, 40 బంతుల్లో 10 సిక్సర్లతో 93 పరుగులు చేసి అజేయంగా మ్యాచ్-విజేతగా నిలిచాడు. ఆ సీజన్లో అతను వరుసబెట్టి చేసిన మూడవ అర్ధ శతకం అది. అందులో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.[26] అతని కెప్టెన్సీలో, ఢిల్లీ డేర్‌డెవిల్స్ KKRని 55 పరుగుల తేడాతో ఓడించి టోర్నమెంట్లో వారి రెండవ విజయాన్ని మాత్రమే సాధించింది. [27] [28] ఐపిఎల్ 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అయ్యర్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. ఏడేళ్ల తర్వాత తొలిసారిగా జట్టును ప్లేఆఫ్‌లోకి నడిపించాడు.
2020 సీజన్లో, అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా కొనసాగాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి ఐపిఎల్ ఫైనల్‌కు జట్టును నడిపించాడు. [29] అయ్యర్ 50 బంతుల్లో అజేయంగా 65 పరుగులు చేసాడు. అయితే, ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
అదే సంవత్సరం ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారతదేశం తరపున ఆడుతున్నప్పుడు అతని ఎడమ భుజానికి గాయం కారణంగా అతను 2021 ఐపిఎల్ లో సగం సీజన్‌కు దూరమయ్యాడు. 6 నెలల వ్యవధి తర్వాత తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. 2022 ఐపిఎల్ వేలంలో, అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ₹ 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. [30] అతను జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. [31]
2017 మార్చిలో ఆస్ట్రేలియాతో నాల్గవ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీకి కవర్‌గా అయ్యర్‌ని భారత టెస్ట్ జట్టులో చేర్చారు. నాల్గవ టెస్ట్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఆడాడు. 8 పరుగుల వద్ద స్టీవ్ ఒకీఫ్‌ను రనౌట్ చేశాడు [32]
2017 అక్టోబరులో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి20) జట్టులో అయ్యర్‌ని చేర్చారు. [33] 2017 నవంబరు 1 న న్యూజిలాండ్‌పై భారతదేశం తరపున తన తొలి టి20 ఆడాడు గానీ బ్యాటింగ్ చేయలేదు. [34] [35]
2017 నవంబరులో, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) జట్టులో అయ్యర్ ఎంపికయ్యాడు. [36] 2017 డిసెంబరు 10 న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తన తొలి వన్డే ఆడాడు.[37] మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అతను 70 బంతుల్లో 88 పరుగులు చేశాడు. [38]
2019 డిసెంబరు 18 న, వెస్టిండీస్‌తో జరిగిన రెండవ వన్డేలో, అయ్యర్ ఒక ఓవర్లో 31 పరుగులు చేశాడు, వన్డేలలో ఒకే ఓవర్లో భారతదేశం తరపున అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్ అతను. [39]
2020 జనవరి 24 న, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టి20లో, అయ్యర్ 29 బంతుల్లో అజేయంగా 58 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు.[40] [41]
2020 జనవరి 26 న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20లో, అతను 33 బంతుల్లో 44 పరుగులు చేశాడు. [42] 2020 ఫిబ్రవరి 5 న, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో అయ్యర్, 107 బంతుల్లో 103 పరుగులు చేసి, వన్డే క్రికెట్లో తన తొలి సెంచరీ సాధించాడు. [43]
2021 సెప్టెంబరులో అయ్యర్, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్ళలో ఒకడిగా ఎంపికయ్యాడు. [44] 2021 నవంబరులో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు. [45] 2021 నవంబరు 25 న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తన తొలి టెస్టు ఆడాడు. [46]
2021 నవంబరు 25 న, అయ్యర్ తన టెస్ట్ క్యాప్‌ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నుండి పొందాడు. న్యూజిలాండ్ జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో శతకం సాధించాడు. తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా నిలిచాడు. [47]
2022 లో శ్రీలంకతో జరిగిన 3-మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో అయ్యర్, వరుసగా మూడు అజేయ అర్ధ సెంచరీలతో మొత్తం 204 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ రికార్డును బద్దలు కొట్టాడు, [48]
2022 మార్చిలో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో బంతి బాగా తిరుగుతున్న పిచ్ పైన [49]రెండు కీలక అర్ధశతకాలు సాధించి అయ్యర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [50] అయ్యర్ మంచి ఫామ్‌కు గుర్తింపుగా, అతను 2022 ఫిబ్రవరిలో ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు [51] 2022 అక్టోబరు 9 న, దక్షిణాఫ్రికాతో జరిగిన 3 వన్డే మ్యాచ్‌లలో 2వ మ్యాచ్‌లో, అతను 111 బంతుల్లో 113 పరుగులు చేసి తన 2వ వన్డే సెంచరీని సాధించి, నాటౌట్‌గా నిలిచాడు. [52]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.