విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం

విమానాశ్రయము From Wikipedia, the free encyclopedia

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంmap

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (IATA: VGA, ICAO: VOBZ) విజయవాడ నగరం నుండి జాతీయ రహదారి 16 కు సమీపంలో 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణా జిల్లాలో గన్నవరం, కేసరపల్లి గ్రామాల మధ్య ఉంది. ఈ విమానాశ్రయమును రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలములో బ్రిటీషు ప్రభుత్యము ఏర్పాటు చేసింది. దీని సుదీర్ఘ రన్‌వే (విమాన రహదారి) సముద్రమట్టం కంటే 82 అడుగుల ఎత్తులో, 11 వేల అడుగులు పొడవు కలిగినది కావున, అతి పెద్దవి, వెడల్పు కలిగిన భారీ విమానాలు దిగుటకు అనుకూలమయిన విమానాశ్రయం.[2] ఈ ప్రాంతం నుండి ఎయిర్ ట్రాఫిక్‌ పెరుగుదల కారణంగా, భారతదేశం విమానాశ్రయాల అథారిటీ వారు విమానాశ్రయానికి అభివృద్ధి, మౌలిక వసతులలో మార్పులు చేపట్టారు.

త్వరిత వాస్తవాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, సంగ్రహం ...
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం
Thumb
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజాసేవ
యజమానిAAI (ఆంగ్లం)
కార్యనిర్వాహకత్వంఎయిర్ పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా
సేవలుఅమరావతి
ప్రదేశంగన్నవరం,ఆంధ్రప్రదేశ్,
ఎత్తు AMSL82 ft / 25 m
అక్షాంశరేఖాంశాలు16°31′44″N 80°47′45″E
వెబ్‌సైటుhttps://www.aai.aero/en/airports/vijayawada
పటం
Thumb
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం
Thumb
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
08/26 11,000 3,360 తారు
గణాంకాలు (ఏప్రిల్ 2017 – మార్చి 2018)
ప్రయాణీకుల చలనాలు7,46,392 (Increase19.9%)
విమానాల చలనాలు11,998 (Increase16.1%)
మూసివేయి

2017, ఆగస్టులో ఈ విమానాశ్రయమును అంతర్జాతీయముగా ప్రకటింపబడింది. సింగపూర్ కు మొదటి అంతర్జాతీయ విమాన సేవ 2018 డిసెంబరు 4 నుండి ప్రారంభించబడింది. జూలై 2019లో రాష్ట్రప్రభుత్వం రాయితీ తొలగించడంతో రద్దయినది.[3] కార్గో సేవలు ఆగస్టు, 2018 నుండి అందుబాటులోకి వచ్చాయి. హజ్ యాత్రకు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళే సదుపాయం భారత ప్రభుత్వం 2020 నుండి అందిచనుంది.

చరిత్ర

విజయవాడ సమీపాన గన్నవరం లో విమానాశ్రయం రెండవ ప్రపంచ యుధ్ధ కాలం నుంచి ఉన్నది. మొదట్లో డకోటా విమానాలు ఇక్కడ దిగేవి. విజయవవాడ హైదరాబాదు, విజయవాడ తిరుపతి విమానాలు 1970లలో కూడా ఉండేవి. 1980ల మధ్య కాలంలో విమాన రాకపోకలు తగ్గిపోయాయి. మళ్ళీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత విమానాశ్రయ అభివృధ్ధి జరగటం మొదలయ్యింది.


గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌ ఎయిర్ లైన్స్ సంస్థ హైదరాబాదు, బెంగుళూరుకు సేవలందించేది.[4] జెట్ ఎయిర్‌వేస్ ఒక 62 సీట్లు ఎటిఆర్ 72-500 (ATR 72-500) రకం విమానం వారానికి ఆరు రోజులు నేరుగా హైదరాబాదుకు సేవలందించింది.[5][2] ఎయిర్ కోస్తా విజయవాడ తన కార్యాచరణ కేంద్రంగా, చెన్నై నిర్వహణ కేంద్రంగా 14వ తారీఖు, అక్టోబరు, 2013-2017 కాలంలో విమాన ప్రయాణ సేవలు అందించింది.


విమానయాన సంస్థలు , గమ్యస్థానాలు

Thumb
విజయవాడ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం

ఎయిర్ ఇండియా సంస్థ అక్టోబర్ 30, 2011 రోజున హైదరాబాదు మీదుగా ఢిల్లీకి 122 సీట్లు సామర్థ్యం కలిగిన A-319 ఎయిర్ బస్ సర్వీసు ప్రారంభించారు.[6] విజయవాడ నుండి చికాగో, న్యూయార్క్, టొరంటో ప్రదేశములకు, వెళ్ళే ప్రయాణీకులు హైదరాబాదు మీదుగా న్యూ ఢిల్లీ చేరి అక్కడ విమానం మారవలసి ఉంది ఒకే సరాసరి టికెట్ విజయవాడ నుండి గమ్యస్థానము వరకు జారీ చేయబడుతుంది.[7][8] ప్రైవేట్ విమానయాన సంస్థలు అయిన స్పైస్‌జెట్ వారు హైదరాబాదు నుండి విజయవాడకు సరాసరి, మధ్యన, నేరు విమాన ప్రయాణ సేవలు ప్రారంభించారు. స్పైస్‌జెట్ సంస్థ 2011 సెప్టెంబరు 28 రోజున హైదరాబాదుకు 78 సీట్లు గల క్యూ 400 (Q-400) రకం విమానం రోజువారీగా ప్రారంభించారు. ఇప్పడు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, స్పైస్ జెట్, ఇండిగో, ట్రూజెట్ విజయవాడకు సేవలందిస్తున్నాయి.

ప్రయాణీకుల రద్దీ , విమాన సర్వీసులు

మరింత సమాచారం Year, Passenger traffic ...
విజయవాడ విమానాశ్రయం యొక్క వార్షిక ప్రయాణీకుల రద్దీ, విమాన సర్వీసులు
Year Passenger traffic Aircraft movement
Passengers Percent
change
Aircraft
movements
Percent
change
2017–18 746,392[1] +19.9% 11,999 +16.1%
2016–17 622,354[9] +56.1% 10,333[10] +54.8%
2015–16 398,643[11] +71.9% 6,676[12] +43.9%
2014–15 231,931[11] NA 4,639[12] NA
మూసివేయి
మరింత సమాచారం విమానయాన సంస్థలు, గమ్యస్థానాలు
 ...
మూసివేయి

ప్రమాదాలు , ఘటనలు

  • 1980 ఆగస్టు 28 నాడు, వికెర్స్ విస్కౌంట్ యొక్క హన్స్ ఎయిర్ VT- DJC విమానం లాండింగ్ సమయములో మూడు సార్లు బౌన్స్ తర్వాత నోస్‌వీల్ బాగు చేసేందుకు కూడా పనికి రానంతగా దెబ్బతిని కుప్పకూలింది.[17]

గ్యాలరీ

మూలాలు

సూచనలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.