లేహ్
లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని / From Wikipedia, the free encyclopedia
లేహ్, భారతదేశం లోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతపు రాజధాని. ఈ ప్రాంతపు అతిపెద్ద పట్టణం కూడా. లేహ్ జిల్లాలో ఉన్న లేహ్, హిమాలయ రాజ్యమైన లడఖ్‌కు చారిత్రకంగా రాజధాని. ఈ సామ్రాజ్య పీఠం, లడఖ్ రాజకుటుంబపు పూర్వ నివాసమైన లేహ్ ప్యాలెస్‌లో ఉంది. టిబెట్‌లోని పొటాలా ప్యాలెస్ శైలి లోనే దాన్ని నిర్మించిన సమయంలోనే దీన్ని కూడా నిర్మించారు. లేహ్, సముద్రమట్టం నుండి 3,524 మీటర్ల (11,562 అడుగులు) ఎత్తున ఉంది. జాతీయ రహదారి 1, నైరుతిలో ఉన్న శ్రీనగర్‌తో కలుపుతుంది. లే-మనాలి హైవే ద్వారా దక్షిణాన ఉన్న మనాలి చేరుకోవచ్చు.
త్వరిత వాస్తవాలు లేహ్, దేశం ...
లేహ్ | ||||||
---|---|---|---|---|---|---|
పైనుండి సవ్యదిశలో: లేహ్ నగర విహంగ వీక్షణం, లేహ్ పాలెస్, శాంతిస్థూపం, శంకర మఠం | ||||||
Coordinates: 34.16°N 77.58°E / 34.16; 77.58 | ||||||
దేశం | ![]() | |||||
కేంద్రపాలిత ప్రాంతం | లడఖ్ | |||||
జిల్లా | లేహ్ | |||||
Government | ||||||
• Type | లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, లేహ్ | |||||
విస్తీర్ణం | ||||||
• Total | 9.15 కి.మీ2 (3.53 చ. మై) | |||||
Elevation | 3,500 మీ (11,500 అ.) | |||||
జనాభా (2011) | ||||||
• Total | 30,870 | |||||
• జనసాంద్రత | 3,400/కి.మీ2 (8,700/చ. మై.) | |||||
జనాభా వివరాలు | ||||||
• భాషలు | లడాఖీ, బల్టీ, హిందీ, ఇంగ్లీషు[1] | |||||
Time zone | UTC+5:30 | |||||
Vehicle registration | LA 01 |
మూసివేయి