From Wikipedia, the free encyclopedia
రోహింగ్యా ప్రజలు లేదా రోహింగ్యా శరణార్థులు లేదా రోహింగ్యా ముస్లింలు .(/ˈroʊɪndʒə/, /ˈroʊhɪndʒə/, /ˈroʊɪŋjə/, or /ˈroʊhɪŋjə/; లేదా అరకాన్ ఇండియన్స్ '[19] అనువారు మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన ప్రజలు. వీరికి ఏ దేశపు పౌరసత్వం లేదు.[20] కావున వీరిని శరణార్థులు గా పరిగణిస్తున్నారు.
Ruáingga ရိုဟင်ဂျာ ﺭُﺍَࣺﻳﻨڠَ | |
---|---|
Total population | |
1,547,778[1]–2,000,000+[2] | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
మయన్మార్ (రఖైన్ రాష్ట్రం), బంగ్లాదేశ్, భారతదేశం, ఇండోనేషియా, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, థాయిలాండ్ | |
Myanmar | 1.0[3]–1.3 million[4][5][6] |
Bangladesh | 500,000[7] [8] |
Pakistan | 200,000[9][10][11] |
Thailand | 100,000[12] |
Malaysia | 40,070[13] |
India | 40,000[14][15] |
USA | 12,000+[16] |
Indonesia | 11,941[17] |
Nepal | 200[18] |
భాషలు | |
రోహింగ్యా భాష | |
మతం | |
ఇస్లాం, హిందూ మతం |
ముస్లింలలో ప్రత్యేక తెగకు చెందిన సుమారు 10లక్షలమంది రోహింగ్యాలు తరతరాలుగా మయన్మార్‌లో నివసిస్తున్నారు. కానీ, 1982లో మయన్మార్ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలో 135 స్థానిక జాతులలో ఒకటిగా రోహింగ్యాలను గుర్తించలేదు.ఆ దేశం వారిని తమ పౌరులుగా గుర్తించలేదు. రోహింగ్యా బెంగాలీ పదమని, వారంతా బంగ్లాదేశ్ నుంచి తమ దేశానికి(అక్రమంగా) వచ్చారని మయన్మార్ వాదిస్తోంది. తమ దేశం నుంచి వెళ్లిపోయేలా ‘పొగ’ పెడుతోంది. హింసను భరించలేక రోహింగ్యాలు ప్రాణాలకు తెగించి మరీ వలస వెళుతున్నారు. సముద్రంలో నాటు పడవల్లో ప్రయాణిస్తూ బంగ్లాదేశ్‌తోపాటు థాయ్‌లాండ్, మలేసియా తదితర దేశాలకు చేరుకుంటున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ పార్టీ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినా వారి పరిస్థితి మారకపోగా కష్టాలు మరింత పెరిగాయి. రోహింగ్యాల అణచివేత వార్తలు మీడియాలో రాకుండా ‘సెన్సార్’ మొదలైంది. బీబీసీ బర్మా చానల్ దీనిపై బహిరంగంగా నిరసన ప్రకటించింది.[21][22].మయన్మార్‌లో రోహింగ్యా పదాన్ని నిషిద్ధంగా భావిస్తారు.
అరాకన్ రోహింగ్యాల విముక్తి సేన (అర్సా) పేరుతో 2016లో ఒక దళం ఏర్పడింది. రోహింగ్యాల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టింది. దీనిని తీవ్రవాద సంస్థగా పరిగణించిన మయన్మార్ ప్రభుత్వము రోహింగ్యాలపై అణచివేతను ముమ్మరం చేసింది. దాడులతో సైన్యం వారిపై విరుచుకుపడింది. ఈ క్రమంలో రఖైన్లో ఉండలేక బంగ్లాదేశ్‌లోకి, ఇతర దేశాలలోకి రోహింగ్యాల వలసలు భారీగా పెరిగిపోయాయి.
మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడిని జాతుల శుద్దీకరణగా ఐక్యరాజ్య సమితి 2017 సెప్టెంబరు 12 న జరిగిన సర్వసభ్య సమావేశంలో అభిప్రాయ పడింది. రోహింగ్యాలపై మయన్మార్‌లో జరుగుతును దాడులపై ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఒక జాతిపై కక్ష్యగట్టినట్టు జరుగుతున్న దాడులకు అందరూ సిగ్గుపడాలని సమితి మానవ హక్కుక ముఖ్య అధికారి జైదీ ఆల్ హసన్ అన్నారు. మయన్మార్‌లో యధేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన అన్నారు.[23] [24]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.