రోమ్
ఇటలీ రాజధాని మరియు అతిపెద్ద నగరం From Wikipedia, the free encyclopedia
ఇటలీ రాజధాని మరియు అతిపెద్ద నగరం From Wikipedia, the free encyclopedia
రోమ్(English: Rome; Italian: Roma రోమా) ఇటలీ దేశపు రాజధాని, ప్రాంతీయనామం లాజియో, [2] ఇది ఇటలీలోనే పెద్ద నగరం, జనాభా 27,05,317, [3] అర్బన్ ప్రాంత విస్తీర్ణంలోని జనాభా 34,57,690 [4] మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 40 లక్షలు. దీని విస్తీర్ణం 5,352 చ.కి.మీ.[5] ఈ నగరం ఇటలీ ద్వీపకల్పము నకు పశ్చిమ-దక్షిణ భాగాన, on the టైబర్ నది ఒడ్డున గలదు.
రోమ్ | |||
|
|||
ముద్దు పేరు: అనంత నగరం | |||
నినాదం: Senātus Populusque Rōmānus (SPQR) (Latin) | |||
Location of Rome | |||
అక్షాంశరేఖాంశాలు: 41°54′N 12°30′E | |||
---|---|---|---|
దేశము | ఇటలీ | ||
ప్రాంతం | లాజియో | ||
రాష్ట్రం | రోమ్ (RM) | ||
స్థాపితం | 21 ఏప్రిల్, 753 క్రీ.పూ. (సాంప్రదాయిక) | ||
ప్రభుత్వం | |||
- Type | {{{government_type}}} | ||
- మేయర్ | గియోవన్ని అలెమన్నో | ||
వైశాల్యము | |||
- మొత్తం | 1,285 km² (496.1 sq mi) | ||
ఎత్తు | 20 m (66 ft) | ||
జనాభా (31st December 2008)[1] | |||
- మొత్తం | 2,724,347 | ||
- సాంద్రత | 2,119.6/km2 (5,491.5/sq mi) | ||
కాలాంశం | CET (UTC+1) | ||
- Summer (DST) | CEST (UTC+2) | ||
పోస్టల్ కోడ్లు | 00121 to 00199 | ||
Area code(s) | 06 | ||
పేట్రన్ సెయింట్స్ | సెయింట్ పీటర్ , సెయింట్ పాల్ | ||
వెబ్సైటు: comune.roma.it |
రోమ్‌లో 14,000 సంవత్సరాలకు ముందే మానవులు నివాసాలు ఏర్పరచుకుని నివసించినట్లు పురాతత్వ ఆధారాల వలన తెలుస్తుంది అయినా దట్టమైన పైపొరలు శిథిలమై అస్పష్టంగా మాత్రం ప్రస్తుతం పాలియోలిథిక్, నియోలిథిక్ ప్రదేశాలలో కనిపిస్తుంది. సక్ష్యాలుగా కనిపిస్తున్న రాతి పనిముట్లు, మట్టి పాత్రలు, రాతి ఆయుధాలు కనీసం 10,000 సంవత్సరాలకు ముందే మానవులు ఉన్నట్లు ఋజువు చేస్తున్నాయి. కాని ప్రజాదరణ పొందిన రోమ్ పురాణాలు మాత్రం రోమ్ పురాతన చరిత్రను పూర్వీకుల చరిత్రను కొంత తెలియకుండా పక్కదరులు పట్టిస్తుంది.
రోమ్ స్థాపన పురాతతత్వ శాస్త్రజ్ఞుల చేత పరిశోధించబడినా రోమన్లు వారి పురతన చరిత్రను వారి పురాణ కథనం మీద అధారపడి విశ్వసిస్తారు. అందరికి పరిచయమున్న విశ్వాసం రోమన్లందరిలో ప్రఖ్యాతి చెందినది తోడేలు వద్ద పాలు త్రాగి పెరిగిన కవలలైన రోములస్, రిమస్. రోమ్‌లో ప్రాచీనంగా నివసిస్తున్న వారు, ట్రోజన్ నుండి ఇటలీకి తప్పించుకు వచ్చిన ఆశ్రితుడు ఏనియస్ తనకుమారుడైన యూలస్ చేత జూలియో-క్లౌడియన్ సామ్రాజ్య స్థాపన చేసి స్థానికులతో వారి పురాణ కథనంతో రాజీపడి రోమ్ అన్న పేరును నిర్ణయించబడింది.
రోమ్ ప్రాచీన చరిత్ర రోమ్ పురాణముతో మరుగున పడింది. రోమన్ల సంప్రదాయాన్ని అనుసరించి రోమ్ నగరం క్రీ.పూ 753 ఏప్రిల్ 21న రోములస్ చేత స్థాపించబడినదని విశ్వసించబడింది. పురాణ కథనంగా రోములస్, రిమస్ రోమ్ నగర స్థాపకులుగా విశ్వసిస్తున్నారు. రోమన్ కవి వర్జిల్ ఈ కథనాన్ని బలపరుస్తూ ట్రాయ్ పతనం తరువాత పారిపోయి ఇటలీ చేరుకున్న ఏనియస్ సంతతి అయిన రోములస్ రోమ్ నగర ప్రథమ పాలకుడని వర్ణించాడు. పురాతతత్వ పరిశోధనలు దీనిని బలపరుస్తున్నాయి. పాలాటైన్ కొండల వద్ద జరిగిన ప్రాచీన ఒప్పందదారుల చేత నిర్మితమైన ప్రదేశం భవిష్యత్తులో రోమ్ నగరంగా మారిందని విశ్వసిస్తున్నారు. కొందరు పురాతతత్వ శస్త్రజ్ఞులు మాత్రం రోమ్ క్రీ.పూ 8వ శతాబ్దం మధ్యలో కచ్చితంగా నిర్మించబడినదని విశ్వసిస్తున్నారు. కచ్చితమైన తారీఖు మాత్రం విమర్శిలకు లోనౌతూనే ఉంది. అసలైన ఒప్పందం ర్రోమన్ సామ్రాజ్యం రాజధానిలో అభివృద్ధిచెందినది. తరువాత సంప్రదాయానుసారంగా ఏడుగురు రాజులచేత పాలించబడింది. తరువాత గణతంత్ర రాజ్యం అయింది. రోమ్ క్రీ.పూ 510 నుండి సెనేట్ చేత పాలించబడింది. తరువాత చివరికి చక్రవర్తి చేత పాలించబడింది. క్రీ.పూ 27 నుండి చక్రవర్తి చేత పాలించబడింది. ఈ చక్రవర్తి పాలన సైనిక విజయం, వాణిజ్యపరంగా ముందే ఆధిక్యత సాధించడం, పొరుగు సంప్రదాయాల సమీకరణ వలన సాధ్యపడింది. ప్రధానంగా య్ట్రూస్కాన్స్, గ్రీకులు ఇందులో పాత్ర వహించారు. రోమ్ రూపుదిద్దుకున్నప్పటి నుండి అనేక యుద్ధాలు వచ్చినా క్రీ.పూ 360 వరకు ఓటమి చవిచూడ లేదు. స్వల్పకాలంగా గౌలస్ చేత ఆక్రమించబడిన రోమ్ తిరిగి రోమ్ ప్రజలకు వెయ్యి బంగారు పౌండ్స్‌కు బదులుగా తిరిగి ఇవ్వడానికి సమ్మతించాడు. అయినా రోమన్లు తమ ఓటమిని అంగీకరింక రోమ్ నగరాన్ని తమ బలంతోనే తిరిగి తీసుకోవలని నిశ్చయించుకుని ఆ సంవత్సరమే దానిని తిరిగి స్వంతం చేసుకున్నారు.
|
|
|
రోమ్ నగరపు చిహ్నాలలో కొలోసియం ఒకటి, ఇది ఒక పెద్ద ఆంపి థియేటర్, రోమన్ సామ్రాజ్యం లో నిర్మింపబడింది. దీనిలో 60,000 మంది ప్రేక్షకులు కూర్చునేందుకు వ్యవస్థ ఉంది. ఈ థియేటర్ ను గ్లేడియేటర్ ల మధ్య జరిగే యుద్ధాలను వీక్షించుటకొరకు ఉపయోగించేవారు.
రోమ్ చారిత్రక కేంద్రం | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | సాంస్కృతిక |
ఎంపిక ప్రమాణం | i, ii, iii, iv, vi |
మూలం | 91 |
యునెస్కో ప్రాంతం | యూరప్ , ఉత్తర అమెరికా |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1980 (4th సమావేశం) |
పొడిగింపులు | 1990 |
రోమ్ నగరం 1960 వేసవి ఒలంపిక్ క్రీడలను ఆతిధ్యమిచ్చింది,, 2020 వేసవి ఒలంపిక్ క్రీడలకు ఆతిధ్యమిచ్చుటకు అధికారిక అభ్యర్థి.
రోమ్ నగరానికి ఒక సోదరనగరం,, అనేక సహ నగరాలు గలవు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.