రాహుల్ బోస్
నటుడు, సామాజిక కార్యకర్త, రగ్బీ క్రీడాకారుడు / From Wikipedia, the free encyclopedia
రాహుల్ బోస్ (జననం 1967 జూలై 27) భారతీయ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, సామాజిక కార్యకర్త. క్రీడాకారుడు కూడా అయిన ఆయన ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్(Rugby India) అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నాడు.
రాహుల్ బోస్ | |
---|---|
జననం | (1967-07-27) 1967 జూలై 27 (వయసు 56) కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1989–ప్రస్తుతం |
ఆయన మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ (2002), కాల్ పురుష్ (2005), అనురానన్ (2006), అంతహీన్ (2009), ది జపనీస్ వైఫ్ (2010), ల్యాప్టాప్ (2012) వంటి బెంగాలీ చిత్రాలలో నటించాడు. అలాగే ఆయన ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ (2006), మాన్ గయే ముఘల్-ఏ-ఆజం (2008), ఝంకార్ బీట్స్ (2003), కుచ్ లవ్ జైసా (2011), దిల్ ధడక్నే దో (2015), చమేలీ (2004), శౌర్య (2008) వంటి హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆయన తమిళ థ్రిల్లర్ విశ్వరూపం (2013), దాని సీక్వెల్లో కూడా ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు.[1]
ఆయన 2004లో సునామీ సమయంలో సహాయక చర్యలలో పాల్గొని తన సామాజిక క్రియాశీలతకు కూడా ప్రసిద్ది చెందాడు. ప్రభుత్వేతర సంస్థను కూడా స్థాపించాడు.[2][3]