![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b2/Rann_of_Kutch_-_White_Desert.jpg/640px-Rann_of_Kutch_-_White_Desert.jpg&w=640&q=50)
రాన్ ఆఫ్ కచ్
రాన్ ఆఫ్ కచ్ (కచ్ భాష: కచ్ జో రాన్) భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. / From Wikipedia, the free encyclopedia
రాన్ ఆఫ్ కచ్ (కచ్చి భాష: కచ్ జో రాన్) భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పు ఎడారులలో ఒకటి.[1] రాన్ అంటే ఎడారి, కచ్ అంటే తాబేలు. రాన్ ఆఫ్ కచ్ మ్యాప్ తాబేలు తిరగబడినట్లు కనిపిస్తుంది. అందుకే దీనికి రాన్ ఆఫ్ కచ్ అనే పేరు వచ్చింది. ఇది ఎక్కువగా భాగం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది, కొంత భాగం పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో విస్తరించి ఉంది. ఇది గ్రేట్ రాన్, లిటిల్ రాన్గా విభజించబడింది. ఇది మొత్తం 26,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. దీనికి తూర్పు, పడమర అంతటా ఉప్పు నేల ఉంటుంది. ఉత్తరాన థార్ ఎడారి, దక్షిణాన పర్వతాలుంటాయి. పశ్చిమాన సింధు నది డెల్టా కూడా ఉంటుంది.[2] రాన్ ఆఫ్ కచ్‌లో బన్ని అని పిలువబడే గడ్డి భూములు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు కచ్ ఎడారి కచ్ జో ఎడారి, దేశం ...
కచ్ ఎడారి
కచ్ జో ఎడారి | |
---|---|
సహజ ప్రాంతం | |
![]() రాన్ ఆఫ్ కచ్ | |
![]() రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం | |
దేశం | భారతదేశం, పాకిస్తాన్ |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/62/Kachch.png/640px-Kachch.png)