![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/40/Rajinikanth_Felicitates_Writer_Kalaignanam.jpg/640px-Rajinikanth_Felicitates_Writer_Kalaignanam.jpg&w=640&q=50)
రజినీకాంత్
సుప్రసిద్ధ సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడూ, నిర్మాతా, రచయితా. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు. అక్కడ ఆయన్ను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు. చిత్రాల్లో ఆయన పలికే సంభాషణలూ, ప్రత్యేకమైన శైలీ దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి 160 కి పైగా చిత్రాల్లో నటించాడు.
రజినీకాంత్ | |
---|---|
![]() 2019 లో రజినీకాంత్ | |
జననం | శివాజీరావు గైక్వాడ్ (1950-12-12) 1950 డిసెంబరు 12 (వయసు 73)[1] బెంగళూరు, మైసూరు రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక) |
ఇతర పేర్లు | రజనీ, రజినీ
|
వృత్తి | నటుడు, నిర్మాత
|
క్రియాశీల సంవత్సరాలు | 1975–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | |
పురస్కారాలు | దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం (2020)[2] పద్మ విభూషణ్ (2016)[3] ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2016) పద్మభూషణ్ (2000) కళైమామణి (1984) (పూర్తి జాబితా) |
1975 లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. కొన్నాళ్ళు ప్రతినాయక పాత్రలు పోషించాడు. 1995 లో సురేశ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన "బాషా" చిత్రం ఘన విజయం సాధించి రజినీకాంత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.[4] 2007 లో వచ్చిన శివాజీ చిత్రం వందకోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది. 2010 లో వచ్చిన రోబో, 2018 లో వచ్చిన 2.0 సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.
చలనచిత్ర రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది.[5][6] ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్‌ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు.