మేవార్
పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రదేశం. / From Wikipedia, the free encyclopedia
మేవాడ్ లేదా మేవార్ అనేది పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రదేశం. రాజ్ పుత్ ల రాజ్యం ఇది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇప్పటి భిల్వారా, చిత్తోర్ గఢ్, రాజ్ సమంద్, ఉదయపూర్ ప్రాంతాలు కలిపి అప్పటి మేవాడ్ రాజ్యం. కొన్ని శతాబ్దాల కాలం పాటు మేవాడ్ సామ్రాజ్యం లేదా ఉదయపూర్ సామ్రాజ్యంగా రాజ్ పుత్ రాజుల పాలనలో ఉంది. ఆ తరువాత బ్రిటిష్ పరిపాలనలో ఒక రాచరిజ రాజ్యంగా ఉంది. దీని అసలు పేరు మేధ్ పాత్. శివుని పేరైన మేధాపతేశ్వర్ అనే పేరు నుంచి వచ్చింది. కాల క్రమంలో మేవార్ అనీ మేవాడ్ అని పిలవడం మొదలైంది. ఈ రాజ్యం ఆరావళీ పర్వతాలలో ఉంది. ఆ పర్వతాలు మేవాడ్ కు వాయువ్యాన ఉన్నాయి. ఉత్తరంలో అజ్మేర్ ఉండగా, గుజరాత్, రాజస్థాన్ లోని వగద్ ప్రదేశాలు దక్షిణంలోనూ, మధ్యప్రదేశ్ లోని మాళ్వా ప్రాంతం ఆగ్నేయ దిశలోనూ, రాజస్థాన్ లోని హడోటీ ప్రదేశం తూర్పులోనూ ఉన్నాయి.