![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/12/Melena_Bleeding_DU.jpg/640px-Melena_Bleeding_DU.jpg&w=640&q=50)
మెలెనా
మెలెనా (Melena) లేదా మెలీనా అనేది జీర్ణాశయాంతర వ్యాధి / From Wikipedia, the free encyclopedia
మెలెనా (Melena) లేదా మెలీనా అనేది జీర్ణాశయాంతర వ్యాధి. ఈ వ్యాధి లక్షణం - మలం ముదురు నలుపు, తారు రంగులో ఉంటుంది. కారణం దీనిలో ఎగువ జీర్ణశయాంతర రక్తస్రావం కలిగి ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ జీర్ణ ఎంజైమ్లు, ప్రేగు బాక్టీరియా సూక్ష్మజీవుల ద్వారా మార్పు చెందుతున్న కారణంగా మలం నలుపు రంగు, అధిక వాసన కలిగి ఉంటుంది.[1]
త్వరిత వాస్తవాలు మెలెనా, ఇతర పేర్లు ...
మెలెనా | |
---|---|
ఇతర పేర్లు | మెలెనా, మలీనా |
![]() | |
ఉచ్చారణ | |
ప్రత్యేకత | శస్త్ర చికిత్స, జీర్ణాశయ వ్యాధులు |
లక్షణాలు | మలంలో ముదురు రక్తం |
కారణాలు | మొలలు, గ్యాస్ట్రిటిస్, జీర్ణశయాంతర రక్తస్రావం, కడుపు క్యాన్సర్ |
మూసివేయి
బిస్మత్ సబ్సాలిసైలేట్ ( పెప్టో-బిస్మోల్లో క్రియాశీల పదార్ధం), ఇనుము మాత్రలు (ఐరన్ సప్లిమెంట్లు) వంటి అనేక ఔషధాల వలన లేదా బీట్రూట్, బ్లాక్ లైకోరైస్ లేదా బ్లూబెర్రీస్ [2] వంటి ఆహారపదార్థాలు తీసుకోవడము వలన కూడా మలానికి నలుపు రంగు కలుగుతుంది, కానీ ఈ నలుపు రంగు లక్షణం వేరు, మెలీనా లక్షణము వేరు.
మెలెనా పదం 19వ శతాబ్దం ప్రారంభం నాటిది. దీనికి మూలం ఆధునిక లాటిన్, గ్రీకు నుంచి తీసుకోబడింది. మెలెనా అంటే నలుపు. .