From Wikipedia, the free encyclopedia
మలాయిక ఇస్లాంలో దేవదూతలను మలాయిక అంటారు. (అరబ్బీ : 'మలక్' ఏకవచనము, మలాయిక బహువచనము). పర్షియన్ భాషలో 'ఫరిష్తే'. అల్లాహ్ వీరిని 'రశ్మి' లేక 'కాంతి' చే సృష్టించాడు. ఇస్లాంలో నమ్మకం ఉంచవలసిన విషయాలు : అల్లాహ్, అతని దూతలు, అతని గ్రంథాలు, అతని ప్రవక్తలు, ప్రళయదినం, అతనిచే వ్రాయబడ్డ విధి (మంచి గాని చెడు గాని) అల్లాహ్ చే ప్రసాదింపబడును. : ఖురాన్, సూరా 17. అల్-ఇస్రా పంక్తి 95. (ఇస్రా అనగా 'రాత్రిప్రయాణం' (షబ్ ఎ మేరాజ్), బనీ ఇస్రాయీల్)
మలాయిక అల్లాహ్ యొక్క 'నూర్' చే సృష్టింపబడ్డారు. వీరికిగల శరీరాకృతి విశదీకరింపబడలేదు. వీరికి 'నఫ్స్' (ఇఛ్ఛ) లేదు. అల్లాహ్ సేవకొరకు మాత్రమే సృష్టింపబడ్డారు. వీరు కాంతి (నూర్) లేక 'ఫోటాన్' లచే నిర్మింపబడ్డారు గనుక ఎలాంటి ఆకృతినైనా పొందగలరు. వీరి గమనం కాంతికంటే వేగమయినది.
కాని ఖుర్హాన్ లో మాత్రం వీరికి రెక్కలు గలవు అని వ్రాసి ఉంది, కేవలం రెక్కలతో మనం అంతరిక్షంలో ప్రయాణం చేయలేము కనుక మనము వీరిని కాంతితో ప్రయాణించగలరు అని చెప్పుకోవడంలో తప్పు లేదు.
ఇబ్లీస్ అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరించాడు. దాంతో జన్నత్ నుండి తీసివేయబడ్డాడు. మానవజాతి విద్వేషి అయ్యాడు. ఇబ్లీస్ 'మలక్' గాదు, ఇతడు జిన్. ఇతడు అగ్ని, ధూమాలచే సృష్టింపబడ్డాడు. ప్రథమంగా అల్లాహ్ ఆజ్ఞలను శిరసా వహించినందువల్ల దూతలక్రమంలో స్థానం పొందాడు. ఈరకం సృష్టికి 'ఇఛ్ఛ' వుంటుంది, ఈకారణంగానే అల్లాహ్ ఆజ్ఞలను తిరస్కరించిన చరిత్రహీనుడయ్యాడు.
ఇస్లాంలో దూతలవిషయాలు అనవసరమైనవిగా భావింపబడతాయి. అయిననూ వీరి వ్యవస్థీకరణ విశ్వం, సకల ప్రాకృతిక నియమాల పాలన కొరకు చాలాఅవస్యం. సకలమానవాళికినీ, చరాచరజగత్తుకూ ధరణిపై జీవ ప్రయాసం కొరకు వీరు దైవాజ్ఞతో ప్రకృతిని నియంత్రిస్తారు. దూతలలో జిబ్రయీల్, మీకాయీల్ అల్లాహ్ సాన్నిహిత్యం వలన ముఖ్యులైనారు. ఖురాన్లో వీరి ప్రస్తావన స్పష్ఠంగా లేకపోయినప్పటికీ, వీరి ప్రాముఖ్యతలను త్రోయజాలము.
ప్రతిముస్లిం ఇస్లాం గురించి కొంత అవగాహన కలిగి వుండాలంటే కనీసం ఈ నలుగురు మలాయిక గురించి తెలుసుకోవాలి. యూదుల, క్రైస్తవుల గ్రంథాలు రెండింటిలోనూ వీరి పేర్లను గమనించవచ్చును.
సప్తనరకాలు వాటిలోగల దూతలగూర్చికూడా ఖురాన్ వివరిస్తుంది.
"ఓ విశ్వాసులారా! మీరూ మీకుటుంబాలనూ జహన్నమ్ యొక్క అగ్ని (నరకాగ్ని) నుండి కాపాడుకోండి. దీని (నరకం) ఇంధనం మానవులూ, రాళ్ళూనూ, దీనిపై మలాయిక నియుక్తులైయున్నారు, వీరు అల్లాహ్ ఆదేశాలను తిరుగులేకుండాఅమలుచేయువారు, వీరుఆదేశాలుఇవ్వబడ్డవారు." అత్-తహ్రీమ్ - 66:6
అదేవిధంగా ఖురాన్ దూతలవిశేషాలగురించి చెబుతుంది, వారికున్న రెక్కలగూర్చియూ చెబుతుంది. క్రింది ఆయత్ను చూడండి.
"సమస్త స్తోత్తములు అల్లాహ్ కొరకే, ఇతనే స్వర్గాన్ని, భూమినీ శూన్యంనుండి సృష్టించాడు, ఇతనే రెక్కలుగల వార్తాహరదూతలను సృష్టించాడు, రెండు లేక మూడు లేక నాలుగు (జతలు) లేక మరింకనూ, తన ఇష్టానుసారం: అల్లాహ్ కు సమస్తముపై సంపూర్ణాధికారాలు గలవు." ఫాతిర్ - 35:1
పై ఆయత్ అర్థం మలాయికాలందరికీ రెండు నుండి నాలుగుజతల రెక్కలుంటాయని కాదు. ప్రముఖ మలాయికాలైన జిబ్రయీల్, మీకాయీల్కు వేలకొలదీ రెక్కలుంటాయని చెప్పబడింది. హదీసుల ప్రకారం కొందరు దూతలు కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే సృష్టింపబడ్డారని విదితమవుతుంది. వీరికి 70వేల తలలుంటాయి, 70వేల నోర్లుంటాయి, 70వేల భాషలు మాట్లాడగలరు, కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే. ఇలాంటి పేరులేని దూతలే మహమ్మదు ప్రవక్తతో జన్నత్ లోవిహరించారు. అల్లాహ్ ఆజ్ఞతో ఇస్రాకు ప్రయాణించినపుడు మలాయికాపై స్వారీ చేయకుండా మహమ్మదు ప్రవక్త బుర్రాఖ్ పై (గుర్రంలాంటి జంతువు) కూర్చొని ప్రయాణించారు. ఈ బుర్రాఖ్ విశ్వాంఛులకు సునాయాసంగా ప్రయాణించగలదు.
జిబ్రయీల్, మీకాయీల్ ల గురించి ఖురాన్లో రెండవ సూరాలో గలదు.
"ప్రకటించండి: ఎవరైతే జిబ్రయీల్ ను ద్వేషిస్తాడో అతనికి తెలియాలి - అల్లాహ్ ఇచ్ఛతోనే ఖురాన్ ఇతనిచే మీహృదయానికి తీసుకురాబడింది, (ఖురాన్) గతంలో అవతరింపబడ్డగ్రంధాల తాలూకు సాక్ష్యంచెబుతోంది, (ఖురాన్) విశ్వాసులకు ఆదేశంగానూ, విజయాలుపొందేశుభవార్తగానూ అవతరింపబడింది. (దీనికొరకే జిబ్రయీల్ తోద్వేషముంటే) - ప్రకటించండి, ఎవరైతే అల్లాహ్, అతని మలాయిక, అతని ప్రవక్తలు, జిబ్రయీల్, మీకాయీల్ ల ద్వేషులో, అల్లాహ్ అలాంటి అవిశ్వాసుల ద్వేషి." (అల్-బఖరా - 2:97-98)
ఇంకో మలక్, మాలిక్ సప్తనరకాల అధిపతి. ఇతను చెడ్డ మలక్ కాడు. కాని ఇతనికి అల్లాహ్ చే ఇవ్వబడిన పని అలాంటిది, నరకవాసులకు శిక్షించుట.
"వారు (నరకవాసులు) గావుకేకలు పెడతారు : ‘ఓ మాలిక్! మీప్రభువు మాకు అంతంచేసుంటే బాగుండేది! (నరకంలో అంతముండదు)" (అజ్-జుఖ్రుఫ్ - 43:77).
ఇద్దరు మలాయికా హారూత్, మారూత్ ల గురించి ఖురాన్ లో నేరుగాచెప్పబడింది.
". . . అలాంటివి హారూత్, మారూత్ లపై (బాబుల్ / బాబిలోనియాలో) అవతరింపబడినవి . . ." (అల్-బఖరా - 2:102)
మరెన్నో దూతలు, మరణాల దూత (ఇజ్రాయీల్), ఇస్రాఫీల్, మున్కర్ నకీర్ లు ఖురాన్ లో ప్రస్తావింపబడలేదు. కానీ హదీసులలోనూ, సాంప్రదాయక గ్రంథాలలోనూ ప్రస్తావింపబడ్డారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.