![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/db/Tunga.jpg/640px-Tunga.jpg&w=640&q=50)
మత్తూరు
From Wikipedia, the free encyclopedia
[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in మాడ్యూల్:Arguments at line 260: table index is nil.]]
మత్తూరు | |
---|---|
గ్రామం | |
![]() మత్తూరు వద్ద తుంగ నది | |
Nickname: సంస్కృత గ్రామం | |
Coordinates: 13°52′26″N 75°33′32″E | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | శివమొగ్గ జిల్లా |
Government | |
• Body | గ్రామ పంచాయితీ |
భాషలు | |
• అధికార | సంస్కృతం, కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
దగ్గర్లోని పట్టణం | శివమొగ్గ |
మత్తూరు, కర్ణాటక, షిమోగా జిల్లా లోని గ్రామం. శివమొగ్గ పట్టణానికి 8 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ఊరి జనాభా 5,000 మందిలో అత్యధికులు సంస్కృత భాషను ఎక్కువ ఉపయోగిస్తుండటం వలన ఈ గ్రామం సంస్కృత గ్రామంగా గుర్తింపు పొందింది.[1] ఈ ఊరి వారికి ఇతర భాషలు వచ్చినా సంస్కృతంలో మాట్లాడటానికే మొగ్గు చూపిస్తారు. ఇక్కడి స్కూళ్లలో ప్రతి పాఠ్యాంశమూ సంస్కృతంలోనే బోధిస్తారు. అలాగని అక్కడి వాళ్లందరికీ సంస్కృతం తప్ప మరొక భాష రాదేమో, వారికి నాగరికత తెలియదేమో అనుకోటానికి వీల్లేదు, ఎందుకంటే అనేక మంది యువకులు ఈ గ్రామంలో సంస్కృతంలో పాఠాలు చదివి, ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇక్కడి ముస్లిములు కూడా సంస్కృతమే మాట్లాడతారు. దాదాపు 500 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇదే పరంపర కొనసాగుతుంది..[2][3]
మత్తూరులో రామాలయం, శివాలయం, సోమేశ్వరాలయం, లక్ష్మీకేశవాలయం ఉన్నాయి.
మత్తూరుకు కవల గ్రామం లాంటి హొసహళ్ళికి కూడా మత్తూరు లక్షణాలు ఉన్నాయి. హొసహళ్ళి తుంగ నదికి ఆవలి ఒడ్డున ఉంది.ఈ రెండు గ్రామాలనూ జంటగా ప్రస్తావిస్తూంటారు.[4]
మత్తూరు, హొసహళ్ళి రెండు గ్రామాల ప్రజలు గమక కళా ప్రక్రియను అనుసరిస్తారు. ఈ రెండు గ్రామాలూ రోజువారీ వ్యవహారంలో సంస్కృతం మాట్లాడే అరుదైన గ్రామాలు.[5]