భోపాల్ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా. భోపాల్ నగరం దాని ముఖ్యపట్టణం. ఈ జిల్లా భోపాల్ డివిజన్‌లో భాగం.

త్వరిత వాస్తవాలు భోపాల్ జిల్లా, దేసం ...
భోపాల్ జిల్లా
Thumb
అప్పర్ లేక్, భోపాల్
Thumb
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
దేసంభారతదేసం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజన్భోపాల్
ముఖ్యపట్టణంభోపాల్
Government
విస్తీర్ణం
  మొత్తం2,772 కి.మీ2 (1,070 చ. మై)
జనాభా
 (2011)
  మొత్తం23,71,061[1]
జనాభా వివరాలు
  అక్షరాస్యత82.3%[2]
Time zoneUTC+05:30 (IST)
Websitehttp://bhopal.nic.in
మూసివేయి

చరిత్ర

భోపాల్ జిల్లా భోపాల్ డివిజన్ లోని మాజీ సెహోర్ జిల్లా నుండి విడదీసి 1972 సెప్టెంబరు 13 న ఏర్పాటు చేసారు. మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. భోపాల్ అనే పదం యొక్క శబ్దవ్యుత్పత్తి శాస్త్రం దాని పూర్వపు పేరు భూపాల్ నుండి వచ్చింది. [3]

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం, భోపాల్ జిల్లా జనాభా 23,71,061, లాట్వియా దేశానికి [4] లేదా అమెరికా లోని న్యూ మెక్సికో రాష్ట్ర జనాభాతో సమానం. [5] ఇది భారతదేశపు 640 జిల్లాల్లో 189 వ స్థానంలో ఉంది.

జిల్లా జనసాంద్రత 855/చ.కి.మీ. 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 28.46%. భోపాల్ జిల్లాలో లింగ నిష్పత్తి 918. అక్షరాస్యత రేటు 80.37%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 85.54% మంది హిందీ, 6.76% ఉర్దూ, 2.61% మరాఠీ, 2.23% సింధీ, 0.60% మలయాళం, 0.54% పంజాబీ, 0.52% బెంగాలీ మొదటి భాషగా మాట్లాడేవారు ఉన్నారు. [6]

మరింత సమాచారం సంవత్సరం, జనాభా ...
సంవత్సరంజనాభా±%
19011,43,958    
19111,56,354+8.6%
19211,40,300−10.3%
19311,63,747+16.7%
19411,88,608+15.2%
19512,35,665+24.9%
19613,71,715+57.7%
19715,72,169+53.9%
19818,94,739+56.4%
199113,51,479+51.0%
200118,43,510+36.4%
201123,71,061+28.6%
మూసివేయి

భౌగోళికం

జిల్లా విస్తీర్ణం 2,772 కిమీ 2 .

భోపాల్ జిల్లా సరిహద్దులుగా ఉత్తరాన గునా, ఈశాన్యాన విదిశ, తూర్పున, ఆగ్నేయంలో రాయ్సేన్, నైరుతి, పశ్చిమాల్లో సీహోర్, వాయవ్యంలో రాజ్‌గఢ్ జిల్లాలు ఉన్నాయి.

భోపాల్ నగరం, జిల్లాకు దక్షిణ భాగంలో ఉంది. జిల్లా జనాభాలో ఎక్కువ భాగం భోపాల్ నగరంలొనే నివసిస్తున్నారు. బెరాసియా పట్టణం జిల్లాకు ఉత్తర భాగంలో ఉంది.


మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.