![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/07/India_new_2000_INR%252C_MG_series%252C_2016%252C_obverse.jpg/640px-India_new_2000_INR%252C_MG_series%252C_2016%252C_obverse.jpg&w=640&q=50)
భారతీయ 2000 రూపాయల నోటు
From Wikipedia, the free encyclopedia
భారతీయ 2000-రూపాయల నోటు (₹ 2000) భారత రూపాయి జాబితాలోని ఒక కొత్త విలువ. 2016 నవంబరు 8 న 500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) విడుదల చేసింది. 2016 నవంబరు 10 నుండి ఇది చెలామణిలో ఉంది. ఇది పూర్తిగా కొత్త రూపకల్పనతో మహాత్మా గాంధీ కొత్త క్రమం లోని ఒక బ్యాంకు నోటు.
(ఇండియా) | |
---|---|
విలువ | ₹2000 |
ఎత్తు | 66 mm |
ముద్రణా సంవత్సరాలు | 2016 – 2019 |
ముఖభాగం | |
![]() | |
రూపకల్పన | మహాత్మా గాంధీ |
నమూనా రూపకర్త | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
డిజైన్ తేదీ | 2016 |
వెనుకభాగం | |
![]() | |
రూపకల్పన | మార్స్ ఆర్బిటర్ మిషన్ |
నమూనా రూపకర్త | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
డిజైన్ తేదీ | 2016 |
ఆర్బిఐ ముద్రించిన అత్యధిక కరెన్సీ నోట్ ఇది. నవంబర్ 2016 లో 1,000 రూపాయల నోటును రద్దు చేసినప్పటి నుండి, ఇది చెలామణిలో ఉంది.[1][2][3] ఆర్బిఐ అధికారిక ప్రకటనకు ముందు, 2016 అక్టోబరు చివరి నాటికి మైసూరులోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ నుండి 2000 నోట్లను ముద్రించినట్లు మీడియా నివేదించింది.[4] 2016 లో జరిగిన 500, 1000 రూపాయల బ్యాంకు నోట్ల రద్దు తర్వాత, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఐదు కొత్త కరెన్సీ నోట్లను ప్రకటించింది. ఆ ఐదు నోట్లు - ₹ 2,000, ₹500, ₹200, ₹50, ₹10.
ఆర్బిఐ డేటా ప్రకారం, 2017 మార్చి చివరి నాటికి 3,285 మిలియన్ల రెండు నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఒక సంవత్సరం తరువాత (మార్చి 31, 2018 న) ఈ సంఖ్యలో స్వల్పంగ 3,363 మిలియన్లకు పెరిగింది. మార్చి 2018 చివరినాటికి ₹18,037 బిలియన్లు చెలామణిలో ఉంది. ఇందులో 2000 నోట్లు 37.3 శాతం. మార్చి 2017 చివరిలో 50.2 శాతంగా నమోదు అయ్యింది. 2017 తో పోలిస్తే 2018 లో 2000 నోట్ల శాతం తగ్గింది.[5]