| |||
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Butane[1] | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [106-97-8] | ||
పబ్ కెమ్ | 7843 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 203-448-7 | ||
కెగ్ | D03186 | ||
వైద్య విషయ శీర్షిక | butane | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:37808 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | EJ4200000 | ||
SMILES | CCCC | ||
బైల్ స్టెయిన్ సూచిక | 969129 | ||
జి.మెలిన్ సూచిక | 1148 | ||
ధర్మములు | |||
C4H10 | |||
మోలార్ ద్రవ్యరాశి | 58.12 g·mol−1 | ||
స్వరూపం | Colorless gas | ||
వాసన | Petrol-like | ||
సాంద్రత | 2.48 g dm−3 (at 15 °C) | ||
నీటిలో ద్రావణీయత |
61 mg L−1 (at 20 °C) | ||
log P | 2.745 | ||
బాష్ప పీడనం | ~25 PSI (at 50 °F) [2] | ||
kH | 11 nmol Pa−1 kg−1 | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−126.3–−124.9 kJ mol−1 | ||
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−2.8781–−2.8769 MJ mol−1 | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 98.49 J K−1 mol−1 | ||
ప్రమాదాలు | |||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H220 | ||
GHS precautionary statements | P210 | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R12 | ||
S-పదబంధాలు | (S2) S16 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
విస్ఫోటక పరిమితులు | 1.8–8.4% | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
బ్యుటేన్
బ్యుటేన్అనునది ఒక హైడ్రోకార్బను సమ్మేళనం.కర్బనరసాయన శాస్త్రంలో బ్యుటేన్ ఆల్కేను (alkane) సముహాంనకు చెందినది.బ్యుటేన్ సాధారణ వాతావరణ పీడనం, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇది వాయు రూపం వుండును. ఇది రంగు, వాసన లేని, సులభంగా మండే గుణము ఉన్న వాయువు[3].ఇది ఒక సంతృప్త ఉదజని-కర్బనపు సమ్మేళనం. కార్బను-ఉదజని గొలుసులో ద్విబంధాలు వుండవు.
ఉనికి-సౌష్టవ నిర్మాణ వివరాలు
బ్యుటేన్ వాయువు ముడి పెట్రోలియం బావులనుండి వెలువడు సహజ వాయువులోను ముడిపెట్రోలియంలో లభించును.బ్యుటేను వాయువును మొదటగా పిట్సుబర్గ్ (pittsburg) కు చెందిన డా.వాల్టరు స్నెల్లింగ్ పెట్రోలలో మిశ్రితమై వున్నట్లుగా గుర్తించాడు [4].బ్యుటేన్ తో పాటు ప్రొపేన్ వాయువును కూడా గుర్తించడం జరిగింది.
బ్యుటేన్ వాయువు నాలుగు కార్బనులను కలిగిన కర్బన-ఉదజని సమ్మేళనం.ఇది సంతృప్త కర్బన-ఉదజని సమ్మేళనం. అందుచే దీనిని ఆల్కేన్ సమూహంలో చేర్చారు. బ్యుటేన్ నాలుగుకార్బను పరమాణువులు, పది హైడ్రోజన్పరమాణువులు సంయోగం చెందటం వలన ఏర్పడిన సమ్మేళనం.దీని అణుఫార్ములా C4H10.బ్యుటెను రెండు రూపాలలో లభిస్తుంది.ఒకటి n-బ్యుటేను.n-బ్యుటేను లేదా సాధారణ బ్యుటేనుయొక్క ఉదజని-కర్బన సమ్మేళనంలో ఎటువంటి శాఖలు/కొమ్మలు (branches) ఉండవు. మరియొకటి దీని ఐసోమరు అయిన ఐసోబ్యుటేను (Isobutane). ఐసోబ్యుటేను అనునది శాఖాయుత సౌష్టవమున్న సమ్మేళన వాయు పదార్థం.n-బ్యుటేను యొక్క శాస్త్రీయ నామం (IUPAC) బ్యుటేను కాగా, బుటేన్ యొక్క సమాంగం అయిన ఐసోబ్యుటేన్ యొక్క శాస్త్రీయ నామం 2-మిథైల్ ప్రొపేన్ (2-methyl propane).
సాధారణ పేరు | సాధారణ బ్యుటేన్ శాఖారహిత బ్యుటేన్ n-బ్యుటేన్ |
ఐసోబ్యుటేన్ i-బ్యుటేన్ |
శాస్త్రీయ (IUPAC) పేరు | బ్యుటేన్ | 2-మిథైల్ ప్రొపేన్ |
అణుసౌష్టవ చిత్రం |
||
రేఖా (Skeletal) చిత్రం |
దస్త్రం:I-Butane simple.svg |
రసాయనిక భౌతిక ధర్మాలు
భౌతిక ధర్మాల పట్టిక [5]
గుణము | విలువల మితి |
అణుభారం | 58.122 గ్రాం/మోల్ |
ఘన స్థితిలో ద్రవీభవన ఉష్ణోగ్రత | -138.29 °C |
ఘన స్థిథతిలో గుప్తోష్ణం (కరుగుటకు) (.013 బార్‌వద్ద | కేజి |
ద్రవస్థితిలో సాంద్రత (1.013బార్ వద్ద | 601.26 కే.జీ/మీ3 |
ద్రవస్థితిలో బాష్పీకరణ ఉష్ణోగ్రత 1.013 బార్ వద్ద | -.049 °C |
ద్రవస్థితిలో బాష్పీకరణ గుప్తోష్ణణం 1.013బార్ వద్ద | 385.71కిలో జౌల్/కే.జి. |
వాయు స్థితిలో | |
సాంద్రత 1.013 బార్, మరుగు ఉష్ణోగ్రత వద్ద | 2.7093 కే.జి./మీ3 |
సాంద్రత 1.013బార్,15°Cవద్ద | 2.5436 కే.జీ/మీ3 |
విశిష్ట గుర్వుత్వం | 2.08 |
విశిష్టఘనపరిమాణం 1.013 బార్/250C | 0.4084 మీ3/కే.జి |
ఉష్ణవాహకతత్వం 1.013బార్/O°Cవద్ద | 14.189 mW/m.K) |
నీటిలో ద్రావీయత | 0.0325 |
రసాయనిక చర్యలు
- బ్యుటెను వాయువును గాలి లేదా ఆక్సిజనుతో కలిపి మండించినప్పుడు బొగ్గుపులుసు వాయువు, నీరు ఎర్పడి, అధిక ప్రమాణంలో ఉష్ణం విడుదల అగును.
- బ్యుటెను నుండి డ్యుపాంట్ ఉత్ప్రేరక పద్ధతిలో మాలిక్ ఆన్‌హైడ్రైడ్ ( maleic anhydride) ను ఆక్సిజనుతో చర్య జరిపించడం ద్వారా ఉత్పత్తి చెయ్యబడును.
ఉపయోగం
- బ్యుటేన్ వాయువునుప్రొపేను, కొన్ని ఉదజని, కర్బన సమ్మేళనాలను కలిపి ద్రవరూపంలోకి మార్చి, లోహ సిలెండరులలో నింపి వంట ఇంధనంగా, వాహన ఇంధనంగా వినియోగిస్తున్నారు[6] .ఈ విధంగా ద్రవరూపానికి మార్చిన వాయువు సమ్మేళానాన్ని ఎల్.పి.జి (ద్రవికరించిన పెట్రోలియం వాయువు) అని ఆంటారు.
- సిగరెట్ లైటరులలో, క్యాంపింగ్ స్టవులలో (camping stove) ఇంధనంగాను, ఇళ్లలో వాడు శీతలీకరణ పరికరం (fridge) శీతలీకరణ ద్రవంగాను ఉపయోగిస్తారు.[7]
- బ్యుటేన్ వాయువును ఉష్ణమాపకాలలో (thermometer, వత్తిడి మాపకాలలో (pressure Guages, ఇతర మాపకాలలో వినియోగిస్తున్నారు[8]
- ప్రయోగశాలలలో ఉపయోగిస్తారు.
బ్యుటేన్ వలన ఇబ్బందులు
- ఈ వాయువును తక్కువ మోతాదులో పీల్చినప్పుడు, తలతిరగడం, చూపు మసకబారడం, వాంతులవ్వడం, మాటల తడబాటు, దగ్గుట, బుమ్ముట వంటి లక్షణాలు కన్పించును.ఎక్కువగా పీల్చిన ఈ లక్షణాల తీవ్రత పెరుగుతుంది, శ్వాసకోసం పై, గుండెపనితీరుపై ప్రభావం చూపును.[9]
ఇవికూడా చూడండి
బయటి లింకులు
మూలాలు/ఆధారాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.