బిపాషా బసు
భారతదేశ నటి, హిందీ చిత్రాల్లో ప్రముఖంగా నటించింది. / From Wikipedia, the free encyclopedia
బిపాషా బసు (జ. 1979 జనవరి 7) ఒక భారతీయ సినిమా నటి, మోడల్. ఈమె వివాహానంతరం బిపాషా బసు సింగ్ గ్రోవర్ గా పిలువబడుతోంది. [4] ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో నటించినా, తమిళ, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీషు సినిమాలలో కూడా నటించింది. ఈమె భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఈమె అనేక పురస్కారాలను పొందింది. ఈమెను మీడియా తరచుగా సెక్స్ సింబల్‌గా అభివర్ణిస్తూ ఉంటుంది.
బిపాషా బసు | |
---|---|
జననం | (1979-01-07) 1979 జనవరి 7 (వయసు 45)[1] |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | బోనీ [2] |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1996–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | [3] |
ఢిల్లీలో పుట్టి కోల్‌కతాలో పెరిగిన బిపాషా 1996లో గోద్రేజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్‌లో గెలుపొంది తరువాత ఫ్యాషన్ మోడల్‌గా వృత్తిని విజయవంతంగా కొనసాగించింది. దానితో ఈమెకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యింది. ఈమె 2001లో "అజ్నబీ అనే థ్రిల్లర్ సినిమాలో ఒక ప్రతికూల పాత్రతో సినిమారంగంలో అడుగు పెట్టింది. ఆ పాత్ర ఈమెకు ఉత్తమ నటి (మొదటి సినిమా) విభాగంలో ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఈమె ప్రధాన పాత్ర "రాజ్" అనే హారర్ సినిమాలో తొలిసారి నటించింది. తరువాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. "జిస్మ్", "కార్పొరేట్", "నో ఎంట్రీ", "ఫిర్ హేరాఫేరీ", "ఆల్ ద బెస్ట్: ఫన్ బిగిన్స్", ధూం -2, "రేస్", "రాజ్-3D", "బచ్నా ఏ హసీనో", "ఆత్మ", "క్రియేచర్ -3D", "అలోన్" వంటి అనేక సినిమాలలో ఈమె తన నటనను ప్రదర్శించింది. అనేక సినిమాలలో ఐటం సాంగ్స్‌లో నటించింది.