బాలూర్ఘాట్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని నగరం. From Wikipedia, the free encyclopedia
బాలూర్ఘాట్, భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక నగరం. ఇది పురపాలిక పట్టణం. ఇది దక్షిణ దినాజ్పూర్ జిల్లాకు కేంద్రం. జాతీయ రహదారి 512 ద్వారా అనుసంధానించబడిన ప్రధాన నగరాల్లో ఇది ఒకటి. ఈ పట్టణంలో సంగ్రహశాల, ఉద్యానవనాలు, ఉన్నత శ్రేణి ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రి ఉన్నాయి. జిల్లా కోర్టు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయం, రక్షకభట నిలయం, రైల్వే స్టేషన్, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు మొదలైనవి ఉన్నాయి. ఆత్రేయ నది ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఇది ప్రశాంతంగా జీవించడానికి మంచి అనువైన ఒక ప్రదేశం/పట్టణం చెప్పవచ్చు. దీనిని అక్టోబరు, నవంబరు నెలలలో సందర్శించటానికి అనువైన ప్రదేశం. ఆచార, మతపరమైన పండుగలను ఆస్వాదించవచ్చు. బాలూర్ఘాట్ లోపలి ప్రాంతం నుండి భారతదేశ-బంగ్లాదేశ్ సరిహద్దును చూడగలిగే గ్రామీణ ప్రాంతం అయిన హిల్లికి ఇక్కడ నుండి వెళ్లి తిలకించవచ్చు.
Balurghat | |
---|---|
Town | |
Coordinates: 25.22°N 88.76°E | |
Country | India |
రాష్ట్రం | West Bengal |
జిల్లా | Dakshin Dinajpur |
Government | |
• Type | Municipality |
• Body | Balurghat Municipality |
• Chairman | Ashok Kumar Mitra (TMC) |
• MLA | Ashok Kumar Lahiri (BJP) |
• MP | Sukanta Majumdar (BJP) |
• DM | Bijin Krishna, I.A.S. |
• SP | Rahul De |
విస్తీర్ణం | |
• Total | 10.76 కి.మీ2 (4.15 చ. మై) |
Elevation | 24 మీ (79 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 1,51,416 |
• జనసాంద్రత | 14,000/కి.మీ2 (36,000/చ. మై.) |
Languages | |
• Official | Bengali[3][4] |
• Additional official | English[3] |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 733101 |
Telephone code | 03522 |
Vehicle registration | WB-61/WB-62 |
Lok Sabha constituency | Balurghat |
Vidhan Sabha constituency | Balurghat |
బాలూర్ఘాట్ పట్టణం 25.22°N 88.77°E అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది.[5] ఇది సముద్ర మట్టానికి 25 మీటర్లు (82 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.పట్టణం 10.76 కి.మీ2 (4.15 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆత్రేయ నది నగరం అంతటా ప్రవహిస్తుంది. ఇది పట్టణాన్ని అసమాన భాగాలుగా విభజిస్తుంది. నగరం ప్రధాన, ముఖ్యమైన పరిపాలనా, సాంస్కృతిక, వినోద కేంద్రాలతో, నదికి తూర్పు ఒడ్డున ఉంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ఈ పట్టణానికి సుమారు 3 కి.మీ దూరంలో ఉంటుంది.
పశ్చిమ బెంగాల్ పోలీసు పరిధిలోని బాలూర్ఘాట్ రక్షకభట నిలయం బాలూర్ఘాట్ పురపాలకప్రాంతం, బాలూర్ఘాట్ సిడి బ్లాకుపై అధికార పరిధిని కలిగి ఉంది.[6][7] బాలూర్ఘాట్ మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో బాలూర్ఘాట్ ఉప విభాగం ఉంది.[7]
బాలూర్ఘాట్ ఉపవిభాగం దాని ప్రధాన కార్యాలయం బాలూర్ఘాట్లో ఉంది.[6] బాలూర్ఘాట్ సిడి బ్లాకు ప్రధాన కార్యాలయం బాలూర్ఘాట్లో ఉంది.[8][9]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బాలూర్ఘాట్ పురపాలక సంఘం పరిధిలో 153279 జనాభా ఉంది.అందులో 76730 మంది పురుషులు కాగా, 76549 మంది మహిళలు ఉన్నారు. బాలూర్ఘాట్ పట్టణ సమ్మేళనం 1,64,593 జనాభాను కలిగి ఉంది. అందులో 82,466 మంది పురుషులు కాగా, 82,127 మంది మహిళలు ఉన్నారు. 0–6 సంవత్సరాల వయస్సుగల జనాభా 10,349. 7+ జనాభాకు సమర్థవంతమైన అక్షరాస్యత రేటు 91.66 శాతంగా ఉంది.[10] బాలూర్ఘాట్లో 37507 గృహాలు ఉన్నాయి
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, బాలూర్ఘాట్ పురపాలక సంఘం పరిధిలో 1,51,416 మంది జనాభా ఉన్నారు, అందులో 75,794 మంది పురుషులుకాగా, 75,622 మంది మహిళలు ఉన్నారు. బాలూర్ఘాట్ సగటు అక్షరాస్యత రేటు 84.8%, పురుషులు అక్షరాస్యత రేటు 87% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 82.5% ఉంది. అక్షరాస్యులు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 10,677 మంది ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలు జనాభా 15,204 మంది ఉన్నారు.షెడ్యూల్డ్ తెగల జనాభా 3,008 మంది ఉన్నారు.[2] పట్టణ జనాభా మొత్తంలో 98.7% మంది హిందువులు, తక్కువ శాతం (1% కంటే తక్కువ) ముస్లింలు, సిక్కులు ఉన్నారు.
బలూర్ఘాట్ ఉత్తర పశ్చిమ బెంగాల్లోని ఒక పంపిణీ కేంద్రం. వర్తకం చేయబడే ప్రధాన సరుకు బియ్యం, జనపనార, చెరుకు, చేపలు, నూనెగింజలు ఎక్కువుగా ఉంటాయి.[11]
దుర్గాపూజ,కాళీపూజ, ఛత్ పూజ,రథయాత్ర, బిశ్వకర్మ పూజ,గణేష్ చతుర్థి, సరస్వతి పూజలు బాలూర్ఘాట్లో విస్తృతంగా జరుపుకుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.