బాలూర్‌ఘాట్
బాలూర్‌ఘాట్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని నగరం.బాలూర్‌ఘాట్, భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక నగరం. ఇది పురపాలిక పట్టణం. ఇది దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాకు కేంద్రం. జాతీయ రహదారి 512 ద్వారా అనుసంధానించబడిన ప్రధాన నగరాల్లో ఇది ఒకటి. ఈ పట్టణంలో సంగ్రహశాల, ఉద్యానవనాలు, ఉన్నత శ్రేణి ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రి ఉన్నాయి. జిల్లా కోర్టు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయం, రక్షకభట నిలయం, రైల్వే స్టేషన్, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు మొదలైనవి ఉన్నాయి. ఆత్రేయ నది ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఇది ప్రశాంతంగా జీవించడానికి మంచి అనువైన ఒక ప్రదేశం/పట్టణం చెప్పవచ్చు. దీనిని అక్టోబరు, నవంబరు నెలలలో సందర్శించటానికి అనువైన ప్రదేశం. ఆచార, మతపరమైన పండుగలను ఆస్వాదించవచ్చు. బాలూర్‌ఘాట్ లోపలి ప్రాంతం నుండి భారతదేశ-బంగ్లాదేశ్ సరిహద్దును చూడగలిగే గ్రామీణ ప్రాంతం అయిన హిల్లికి ఇక్కడ నుండి వెళ్లి తిలకించవచ్చు.