బారిపడా
ఒడిశా రాష్ట్రం బారిపడా జిల్లా ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
బారిపడా, ఒడిషా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలో ఉన్న పట్టణం. బుధబలంగా నది తూర్పు ఒడ్డున ఉన్న బారిపడా ఉత్తర ఒడిషా ప్రాంతపు సాంస్కృతిక కేంద్రం. ఇటీవలి సంవత్సరాలలో, ఇక్కడ అనేక వృత్తిపరమైన కళాశాలలను ప్రారంభించడంతో ఇది విద్యా కేంద్రంగా ఉద్భవించింది.[3][4] పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
త్వరిత వాస్తవాలు బారిపడా, దేశం ...
బారిపడా | |
---|---|
పట్టణం | |
Coordinates: 21.94°N 86.72°E / 21.94; 86.72 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ![]() |
జిల్లా | మయూర్భంజ్ |
Government | |
• Body | Baripada Municipality |
Elevation | 36 మీ (118 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,16,874 |
• Rank | India 446th, Odisha 8th |
భాషలు | |
• అధికారిక | ఒరియా[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 757 0xx |
Telephone code | 06792-25xxxx/ 06792-26xxxx |
Vehicle registration | OD-11 |
మూసివేయి
ఈ పట్టణం మయూర్భంజ్ జిల్లాకు ప్రధాన కార్యాలయం. వైశాల్యం ప్రకారం ఒడిషాలో ఇది అతిపెద్ద జిల్లా. పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా, సెషన్స్ కోర్టులూ ఉన్నాయి. ఒడిశా రాష్ట్ర శాసనసభ లోని బారిపడా విధాన సభ నియోజకవర్గ కేంద్రం ఇక్కడే ఉంది.[3][5]