పశ్చిమాసియాలోని దేశం From Wikipedia, the free encyclopedia
బహ్రయిన్ Bahrain (/bɑːˈreɪn/ ( listen); అరబ్బీ: البحرين al-Baḥrayn), అధికారికంగా " కింగ్డం ఆఫ్ బహ్రయిన్ " అంటారు. ఇది ఒక చిన్న ద్వీపదేశం. ఇది మిడిల్ ఈస్ట్ లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉంది. ఇది భ్రయిన్ ద్వీపంతో చేరిన ద్వీపసమూహం. ఇది 55 కి.మీ పొడవు 18 కి.మీ వెడల్పు ఉంది. పశ్చిమ సరిహద్దులో ఉన్న సౌదీ అరేబియా " కింగ్ ఫహ్ద్ కౌస్వే " ద్వారా బహ్రయిన్‌తో అనుసంధానించబడి ఉంది. ఉత్తర దిశలో ఉన్న ఇరాన్ బహ్రయిన్ మద్య 200 కి.మీ పొడవైన పర్షియన్ గల్ఫ్ ఉంది.ఆగ్నేయంలో ఉన్న కతర్ ద్వీపకల్పం బహ్రయిన్ మద్య గల్ఫ్ ఆఫ్ బహ్రయిన్ ఉంది. 2010 నాటికి బహ్రయిన్ జనసంఖ్య 1,234,571. వీరిలో 666,172 మంది అన్యదేశీయులు ఉన్నారు.[1] దిల్మున్ సంస్కృతి మూలస్థానం బహ్రయిన్.[2]
مملكة البحرين Mamlakat al-Baḥrayn కింగ్డమ్ ఆఫ్ బహ్రయిన్ |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం بحريننا Bahrainona Our Bahrain |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Manama 26°13′N 50°35′E | |||||
అధికార భాషలు | అరబ్బీ, ఆంగ్లం | |||||
ప్రజానామము | Bahrainis, Bahranis | |||||
ప్రభుత్వం | Constitutional monarchy | |||||
- | King | Hamad Bin Isa Al Khalifa | ||||
- | Prime Minister | Khalifah ibn Sulman Al Khalifah | ||||
- | Crown Prince | Salman bin Hamad bin Isa Al Khalifa | ||||
Independence | from UK | |||||
- | Date | 15 August 1971 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 665 కి.మీ² (189th) 253 చ.మై |
||||
- | జలాలు (%) | 0 | ||||
జనాభా | ||||||
- | 2005 అంచనా | 698,5851 (164th) | ||||
- | జన సాంద్రత | 987 /కి.మీ² (10th) 2,556 /చ.మై |
||||
జీడీపీ (PPP) | అంచనా | |||||
- | మొత్తం | $14.08 billion (117th) | ||||
- | తలసరి | $20,500 (35th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.859 (high) (39th) | |||||
కరెన్సీ | Bahraini dinar (BHD ) |
|||||
కాలాంశం | (UTC+3) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .bh | |||||
కాలింగ్ కోడ్ | +973 | |||||
1 | Includes 235,108 non-nationals (July 2005 estimate). |
పురాతనకాలం నుండి బహ్రయిన్ ముత్యాల ఉత్పత్తికి ప్రసిద్ధిచెందినది. 19వ శతాబ్దం నాటికి బహ్రయిన్ ముత్యాలు ప్రంపంచంలో నాణ్యమైనవని గుర్తింపువచ్చింది. ముస్లిం మతాన్ని స్వీకరించిన ఆరంభకాల దేశాలలో బహ్రయిన్ ఒకటి. బహ్రయిన్లో అరబ్ పాలన కొంతకాలం కొనసాగిన తరువాత ఈ ప్రాంతాన్ని 1521లో పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. 1602లో షాహ్ అబ్బాస్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని పోర్చుగీసు ప్రజలను తరిమివేసాడు. మొదటి అబ్బాస్‌గా గుర్తించబడిన పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన సఫావిద్ రాజవంశానికి చెందినవాడు. 1783లో బని ఉత్బా వంశస్థులు నాసర్- అల్ - మధ్కుర్ నుండి బహ్రయిన్ను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత బహ్రయిన్ అల్- ఖలిఫా రాజకుటుంబం ఆధీనంలోకి మారింది. అహమ్మద్ బీన్ ముహమ్మద్ బీన్ ఖలీఫా బహ్రయిన్ మొదటి హకింగా అధికారబాధ్యతలు చేపట్టాడు. 1800 చివరిలో విజయవంతంగా ముగుసిన యునైటెడ్ కింగ్డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఒప్పందం తరువాత బ్రిటన్ యునైటెడ్ కింగ్డం ప్రొటెక్టరేట్ అయింది. 1971 బహ్రయిన్ స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. 2002లో బహ్రయిన్ సార్వభౌమరాజ్యంగా ప్రకటించబడింది. 2011 ఆరంభకాలం నుండి బహ్రయిన్లో రాజకీయ అశాంతి నెలకొన్నది. ప్రత్యేకంగా షియా ముస్లిం ప్రజలమద్య అశాంతి నెలకొన్నది. [3] పర్షియన్ గల్ఫ్‌లో బహ్రయిన్ మొదటిసారిగా ఆయిల్ ఆధారిత ఆర్థికాభివృద్ధిని అనుభవించింది.[4] 20వ శతాబ్దం నుండి బ్యాంకింగ్, పర్యాటకరంగంలో బహ్రయిన్ పెట్టుబడులు అధికరించాయి.[5] బహ్రయిన్ రాజధాని " మనమ " బృహత్తర ఫైనాంషియల్ సంస్థలకు నిలయంగా ఉంది. మానవాభివృద్ధిలో బహ్రయిన్ ఉన్నత స్థానంలో (అంతర్జాతీయంగా 48వ స్థానం) ఉంది. వరల్డ్ బ్యాంక్ బహ్రయిన్ను " హై ఇంకం ఎకనమీ " కలిగిన దేశంగా గుర్తించింది.
అరబిక్ భాషలో " బహ్రయిన్ " అంటే భర్ సముద్ర రెండు రూపాలు అని అర్ధం. అల్- బహ్రయిన్ అంటే రెండు సముద్రాలు అని అర్ధం. అయినప్పటికీ రెండుసముద్రాలు అన్న సూచన వివాదాస్పదంగానే ఉంది.[6] ఇది ఖురాన్లో 5 మార్లు ప్రస్తావించబడింది. ఆధునిక అరబ్ భాషలో ద్వీపం అంటే అవల్ అని అర్ధం. తూర్పు అరేబియాలో ద్వీపం అంటే అల్- ఖతిఫ్, అల్- హస అంటారు.[6] బహ్రయిన్ రెండుసముద్రాలు ఒకటి తూర్పు వైపున ఒకటి పశ్చిమం వైపునా ఉన్నాయి.[7] అయినప్పటికీ బహ్రయిన్ ఉత్తర దక్షిణ తీరాలలో కూడా సముద్రం ఉంది. [8] బహ్రయిన్ భూమి పైపొరలలో ఉప్పునీరు, అంతర్భాగంలో మంచినీటి ఊట ఉండడం పేరుకు ఒక కారణం అని భావిస్తున్నారు. [9] అదనంగా బహ్రయిన్ ఉత్తర భూభాగంలో ఉన్న రెండు ఉప్పునీటి బావులలో మద్యలో మంచినీటి ఊట ఉబికివస్తూ ఉంటుంది. ఇది ఇప్పటికీ పురాతన సమాచారంగా సందర్శకులను ఆకర్షిస్తుంది.[10] బహ్రయిన్ పేరు గురించిన మరొక కథనం అల్- అషా ప్రాంతంలో ప్రచారంలో ఉంది. దానిని అనుసరించి రెండుసముద్రాలలో ఒకటి " గ్రేట్ గ్రీన్ ఓషన్ ", మరొకటి అరేబియన్ ప్రధాన భూమిలో ఉన్న ప్రశాంత సరసును సూచిస్తున్నాయని భావిస్తున్నారు. [9] మద్యయుగ చివరిలో బహ్రయిన్ అనే పేరు తూర్పు అరేబియా ప్రాంతానికి వర్తిస్తుంది. ఇందులో దక్షిణ ఇరాక్, కువైత్, అల్- హస, క్వాతిఫ్, బహ్రయిన్. ఇరాక్ లోని బస్రాకు ఆనుకొని ఉన్న బహ్రయిన్ ప్రాంతం ఓమన్ లోని హర్ముజ్‌కు సమానంగా ఉంటుంది. ఆసమయంలో బహ్రయిన్ అనే పదం అవల్ ద్వీపసమూహానికి వర్తిస్తుందని భావిస్తున్నారు.[11] తూర్పు అరేబియాలోని పూర్తి సముద్రతీర పట్టీ ఒక సహస్రాబ్ధి నుండి " బహ్రయిన్ " అని పిలువబడుతుంది.[12] ఈ ద్వీపం, రాజ్యం కూడా బహ్రయిన్ అని పిలువబడింది.
బహ్రయిన్ దిల్మన్ నాగరికతకు మూలస్థానం. బహ్రయిన్ కాంశ్యయుగంలో మెసపొటేమియా, సింధూలోయను అనుసంధానంచేసే వ్యాపారకేంద్రంగా ఉంది. [13] బహ్రయిన్ తరువాత అస్సిరియన్లు, బాబిలోనియన్ల చేత పాలించబడింది.[14] క్రీ.పూ 3 వ శతాబ్దం నుండి 6 వ శతాబ్దం వరకు బహ్రయిన్ పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన అచమనేనియన్ రాజవంశం స్వాధీనంలో ఉంది. క్రీ.పూ 250 నాటికి పార్థియా పర్షియన్ గల్ఫ్‌ను తన స్వాధీనం చేసుకుని అధికారాన్ని ఒమన్ వరకు విస్తరించాడు. వ్యాపారమార్గాలను తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి పార్ధియన్లు పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీరం వెంట సైన్యాలను బలపరివారు.[15] క్లాసికల్ కాలంలో బహ్రయిన్ను గ్రీకులు టిలాస్ అని పిలిచారు. అడ్మిరల్ జనరల్ నీర్చస్ మహావీరుడు అలెగ్జాండర్ తరఫున ముత్యాల వ్యాపారకేంద్రంగా ఉన్న బహ్రయిన్ భూభాగంలో ప్రవేశించాడు. బహ్రయిన్లో ప్రవేశించిన మొదటి గ్రీకు సైనికాధికారి నీర్చస్ అని విశ్వసించబడుతుంది. నీర్చస్ బృహత్తర వ్యాపారకేంద్రంలో భాగంగా ఉన్న సంపన్నయుతమైన భూభాగాన్ని కనుగొని దానిని " టిలాస్ ద్వీపం "గా నమోదు చేసుకున్నాడు. ఇది పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉందని ఇక్కడ విస్తారంగా పత్తి పంట పండించబడుతుందని దాని నుండి వారు వస్త్రాలు (సిండోంస్) తయారు చేస్తున్నారని వర్ణించాడు. వీటి ఉపయోగం భారతదేశం వరకు పరిమితం కాదని అరేబియన్ దేశం వరకు విస్తరించి ఉందని కూడా వర్ణించబడింది. తయారు చేసిన వస్త్రాలలో ఖరీదైనవీ, సాధారణ మైనవీ ఉన్నాయని వర్ణించా డు. [16] గ్రీక్ చరిత్రకారుడు దియోఫ్రాస్టస్ బహ్రయిన్ భూభాగం అధికంగా పత్తి చెట్లతో నిండి ఉందని, బహ్రయిన్ బాబిలోన్ చిహ్నాలు చెక్కబడిన చేతికర్రల ఎగుమతికి ప్రఖ్యాతి చెందినదని తనవ్రాతలలో నమోదు చేసాడు.[17] అలెగ్జాండర్ బహ్రయిన్లో గ్రీక్ కాలనీలు నిర్మించాలని ప్రణాళిక వేసాడు. అది రూపుదిద్దుకున్న సాక్ష్యాలు లేవు. బహ్రయిన్లో గ్రీక్ ప్రభావం కనిపిస్తుంది. ఉన్నత వర్గాలలో గ్రీకు భాష పరిచయం ఉంది. అయినప్పటికీ దైనందిక జీవితంలో అరామియాక్ వాడుకలో ఉంది. జెయూలు అరేబియన్ సూర్య - దేవుని రూపాన్ని ఆరాధించేవారు.[18] Bahrain even became the site of Greek athletic contests.[19] గ్రీకు చరిత్రకారుడు " స్ట్రాబో " ఫొయెనిసియన్లు పూర్వీకస్థానం బహ్రయిన్ అని భావిస్తున్నాడు.[20] హెరోడోటస్ కూడా ఫొయెనిసియన్ల జన్మస్థానం బహ్రయిన్ అని భావిస్తున్నా డు.[21][22] 19వ శతాబ్ధానికి చెందిన అర్నాల్డ్ హీరన్ గ్రీకు జియోగ్రాఫర్స్ టైరస్ (టైలాస్), అరద్ (బహ్రయిన్) ద్వీపాలను గుర్తించారని అవి ఫొయెనిసియన్ల మాతృభూమి అని వారు ఫొయెనిసియన్ల ఆలయ అవశేషాలను పరదర్శనలో ఉంచారని పేర్కొన్నాడు.[23] టైరె (లెబనాన్) దీర్ఘకాలంగా పర్షియన్ గల్ఫ్ పూర్వీకుల స్వాధీనంలో ఉంది.[24][25] సెమిటిక్ హెలెనైజేషన్ నుండి టలస్ పేరు వచ్చిందని, దిల్మన్ నుండి తిల్మన్ వచ్చిందని భావిస్తున్నారు. [26] ప్టోమ్లీ గియోగ్రాఫర్స్ ద్వీపాలను టైలాస్ అని పేర్కొన్నదని దీవిలో నివసించిన ప్రజలను తితిలౌయానొయి అనేవారని భావిస్తున్నారు.[27] 3వ శతాబ్దంలో సస్సనిద్ రాజవంశానికి చెందిన మొదటి పాలకుడు మొదటి అర్దషిర్ ఓమన్, బహ్రయిన్లకు ప్రయాణించి అక్కడ బహ్రయిన్ పాలకుడు సనత్రంగ్ను ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[28] ఆసమయంలో బహ్రయిన్ మిష్మహిగ్ (పహ్లవి భాషలో ఈవి- చేప అని అర్ధం) అని పిలువబడేది.[29] బహ్రయిన్ అవాల్ పేరుతో షార్క్ దేవతను (సొరచేత దేవత) ను ఆరాధించే ప్రాంతాలలో ఒకటని భావిస్తున్నారు. అరాధకులు ముహర్రాక్వ్ వద్ద అవాల్ శిల్పం నిర్మించారు. అయినప్పటికీ ఇప్పుడు అది లేదు. టైలాస్ అని పలుసంవత్సరాలు పిలువబడిన తరువాత బహ్రయిన్ అవాల్ అని పిలువబడింది. 5వ శతాబ్దం నాటికి బహ్రయిన్ నెస్ట్రియాన్ క్రైస్తవానికి కేంద్రంగా మారింది. ఇక్కడ సమాహి గ్రామం నిర్మించబడింది.[30] ది ఓరియంటల్ సిర్యాక్ చర్చి సినోడల్ రికార్డులను అనుసరించి బిషప్ స్థానంగా 410లో బహ్రయిన్ నుండి " బతై " అనే బిషప్ బహిష్కారానికి గురైయ్యాడని భావిస్తున్నారు.[27] మతవిశ్వాసపరంగా బైజాంటైన్ సామ్రాజ్యం నెస్టోరియన్లను తరచుగా వివక్షకు గురిచేసేది. సాంరాజ్యానికి వెలుపల ఉన్న బహ్రయిన్ సురక్షితమని భావించి నెస్టోరియన్లు బహ్రయిన్ను తమనివాసంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం మహార్రాక్ లోని పలుగ్రామాల పేర్లు క్రైస్తవ సంప్రదాయానికి గుర్తుగా ఉన్నాయి. ఉదాహరణగా " అల్ డైర్ " (అంటే ఆశ్రమం అని అర్ధం). బహ్రయిన్ ఇస్లామిక్ పూర్వపు ప్రజలలో అరబ్ క్రైస్తవులు (అరబ్ అల్ - క్వేలు), పర్షియన్లు, జొరోయాశ్ట్రియన్లు, యూదులు [31] , అరామయిక్స్ ఉన్నారు.[32][33][34] రోబర్ట్ బెర్ట్రం సెర్జియన్, బహర్న, అరబిజెడ్ అభిప్రాయం అనుసరించి " స్థానిక క్రైస్తవం నుండి మార్పిడి అయినవారు, యూదులు, పర్షియన్లు " ఇక్కడ నివసించేవారని భావిస్తున్నారు.[32][35] ఇస్లామిక్ పూర్వ బహ్రయిన్ ప్రజలకు అరామియాక్ వాడుకభాషగా ఉండేది. కొంతమందికి పర్షియన్ వాడుక భాషగా ఉండేది. సిరియా భాషను ప్రార్థనలకు వాడుకలో ఉంది.[33]
అల్- కుదిర్ దాడి తరువాత బహ్రయిన్లో ముహమ్మదీయులు ప్రవేశించారు. మదీనా మీద దాడిచేయడానికి కుట్రపన్నుతున్నారన్న నెపంతో ముహమ్మద్ బాను సలీం తెగ మీద ఆకశ్మిక దాడిచేయమని ఆదేశాలు జారీచేసాడు. ముహమ్మద్‌కు గురిజన తెగలు బహ్రయిన్లో సైనికులను సమీకరించి ప్రధానభూమి మీద దాడిచేయడానికి ప్రణాళిక వేస్తున్నారన్న వార్త చేరిన తరువాత ఈ దాడి జరిగింది. ముహమ్మద్ వారితో యుద్ధం చేయడానికి సైన్యంతో వస్తున్నాడని గ్రహించిన గిరిజనులు వెనుకడుగు వేసారు. [36][37] [38][39] ప్రవక్త ముహమ్మద్ ప్రాంతీయ పాలకునికి పంపించిన సందేశం అనుసరించి ప్రాతీయపాలకుడు ఈ ప్రాంతం అంతటినీ మతమార్పిడి చేసాడు.[40][41]
899 లో క్వార్మార్టియన్కు చెందిన ఇస్మాయిల్ బహ్రెయిన్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఇస్మాయిల్ ముస్లిం మతం ఆదర్శధామ స్థాపనలో భాగంగా ప్రజలసంపద మొత్తం స్వాధీనం చేసుకుని తిరిగి దానిని అందరికీ సమంగా పంచిపెట్టాలని కోరింది. తరువాత క్వార్మార్టియన్లు బాగ్ధాద్ ఖలిఫా వద్దనుండి కప్పం కావాలని నిర్భందించారు. 930 నాటికి మక్కా మదీనాను స్వాధీనం చేసుకుని శాక్రెడ్ బ్లాక్ స్టోన్‌ను బహ్రయిన్‌లోని తమకేంద్రానికి (ఆషా) తిరిగి తీసుకువచ్చారు. చరిత్రకారుడు " అల్- జువయ్ని అభిప్రాయం అనుసరించి 21 సంవత్సరాల తరువాత 951లో శాక్రెడ్ బ్లాక్ స్టోన్ మర్మమైన పరిస్థితి మద్య తిరిగి తీసుకునిపోబడిందని భావిస్తున్నారు. రాతిని ఒక గోనెసంచిలో మూటకట్టి ఇరాక్ లోని గ్రేట్ మసీద్ ఆఫ్ కుఫాలో వదిలారు. రాతితో ఉన్న లేఖలో " ఆదేశం అనుసరించి తీసుకొని పోబడింది. ఆదేశం అనుసరించి తిరిగి ఇవ్వబడింది " అని వ్రాసి ఉంది. దింగిలించి తీసుకుపోవడంలో పవిత్రమైన నల్లరాయి ఏడు ముక్కలుగా విరిగింది. [42][43][44] తరువాత 976 లో ఈ ప్రాంతాన్ని అబ్బాసిదులు స్వాధీనం చేసుకున్నారు. [45] 1076లో క్వర్మాఋటియన్లను అరబ్ ఉయునిదులు (అల్- హస) ఓడించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు.[46] 1235 వరకు ఉయునిదులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచారు. 1235లో బెడోయిన్ ఉస్ఫురిదీలు ఉయునిద్ సామ్రాజ్యాన్ని పడగొట్టారు. తరువాత తూర్పు అరేబియాను బహ్రయిన్ ద్వీపాలతో చేర్చి స్వాధీనం చేసుకున్నారు. 1330లో ఆర్చిపిలాగో దేశం హార్ముజ్ పాలకుల సామంతరాజ్యం అయింది.[11] ప్రాంతీయంగా ద్వీపాలను క్వాటిఫ్ రాజవంశానికి చెందిన జార్విండ్ స్వాధీనం చేసుకున్నాడు. [47] 15వ శతాబ్ధపు మద్యకాలానికి ఆర్చియోపిలాగో జబ్రిద్ పాలనలోకి మారింది. అల్- ఆషా కేంద్రంగా బెడౌయిన్ రాజవంశం తూర్పు అరేబియాలోని అధికభూభాగాన్ని పాలించింది.
1521 లో పోర్చుగీస్ సామ్రాజ్యం హార్ముజ్‌తో కలిసి బహ్రయిన్ను జాబ్రిద్ పాలకుడు మిగ్రిన్ ఐబిన్ జమిల్ నుండి ఆక్రమించాడు. ఆక్రమణ సమయంలో మిగ్రిన్ ఐబిన్ జమిల్ మరణించాడు. 80 సంవత్సారల తరువాత పోర్చుగీసు పాలన ముగింపుకు వచ్చింది.[11] 1602లో పోర్చుగీసు వారిని పర్షియాకు చెందిన మొదటి అబ్బాస్ ద్వీపం నుండి వెలుపలకు తరిమాడు.[48] తరువాత ఈ ప్రాంతంలో బలవంతులైన షియా ముస్లిముల ఆధిక్యత కొనసాగింది. [49] తరువాత 2 శతాబ్ధాల కాలం ఈ ప్రాంతం పర్షియన్ పాలకుల ఆధీనంలో ఉంది. 1717 - 1738 మద్య కాలలో ఓమన్కు చెందిన ఇబాదీలు సాంగించిన దండయాత్రల కారణంగా పర్షియన్ల పాలన ముగింపుకు వచ్చింది.[50] ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సున్ని సంతతికి చెందిన పాలకులు పాలించారు. [11][51][52] 1753 లో హువాలా వంశస్థులు నాసర్ అల్ - మధుకుర్ (ఇరానియన్ జంద్ రాజవంశస్థుడు కరీం ఖాన్ జంద్ తరఫున) బహ్రయిన్ మీద దండయాత్ర చేసాడు. తరువాత ఈ ప్రాంతంలో ఇరానియన్ల పాలన సాగింది. [52] 1783లో నాసర్- అల్- మధుకర్ బహ్రయిన్, బుషైర్ పాలకుని బాని ఉత్బా గిరిజనులు " జుబారహ్ యుద్ధం (1762)" ఓడించి బహ్రయిన్ ద్వీపాలను స్వాధీనం చేసుకున్నారు. బాని ఉత్బా గిరిజనులు బహ్రయిన్లో 17వ శతాబ్దం నుండి నివసిస్తున్నారు. [53] ఆ సమయంలో వారు ఆప్రాంతంలోని పాం తోటల కొనుగోలు ప్రారంభించారని అల్- ఖలీఫా ప్రవేశానికి 81 సంవత్సరాల ముందు అల్- బిన్- ఖలి (బని ఉత్బా సంతతిలోని తెగ) సిత్రా ద్వీపానికి చెందిన " మరియం బింట్ అహ్మద్ అల్ సింది " నుండి ఒక పాం తోటను కొనుగోలు చేసిన పత్రాల ఆధారంగా భావిస్తున్నారు. [54] అల్ బిన్ అలి సమూహాలు క్వతార్ ద్వీపకల్పంలోని జుబారహ్ పట్టణం మీద ఆధిపత్యం సాధించారు. [55][56] ఇది బని ఉతాబహ్ అధికార కేంద్రంగా ఉంది. బని ఉతాబహ్ బహ్రయిన్ మీద అధికారం సంపాదించిన తరువాత వారు స్వతంత్ర గిరిజన తెగలుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. వారు ఎరుపు తెలుపు వర్ణ మిశ్రిత ఝంఢాను (అల్- సులామీ ఝండా) ఉపయోగించారు.[57] బహ్రయిన్లో కతర్, కువైట్, సౌదీ అరేబియా సామ్రాజ్యంలోని తూర్పు భాగం భాగంగా ఉండేవి. బుషర్కు చెందిన " నాసర్ అల్- మధ్కుర్ " పతనం తరువాత కతర్ నుండి వివిధ అరబ్ సంతతికి చెందిన వారు, తెగలకు చెందిన వారు బహ్రయిన్‌కు తరలి వెళ్ళారు. ఈ కుటుంబాలలో అల్- ఖలిఫా, అల్- మా అవఫ్హ్, అల్- ఫాధిల్, అల్- మన్నై, అల్- నొయిమి, అల్- సులైతి, అల్- సదాహ్, అల్- తవాది, ఇతర కుటుంబాలు, తెగలకు చెందిన వారు ఉన్నారు. [58] అల్- ఖలిఫా కుటుంబం 1797లో బహ్రయిన్లో స్థిరపడడానికి వెళ్ళారు. వారు అంతకుముందు ఉం కాసర్లో ఉన్నారు. వారు ఒకప్పుడు బస్రా బిడారులు, దీపిడీ నౌకల మీద ఆధారపడి జీవించే వారు. 1766లో వీరిని కువైట్ నుండి టర్కీలు తరిమివేసారు.[59] 19వ శతబ్ధం ఆరంభంలో బహ్రయిన్ మీద ఓమనీలు, సౌదీలు దాడిచేసారు. 1802లో ఓమనీ సయ్యిద్ సుల్తాన్ ఆయన కుమారుడు సలీంను అరబ్ ఫోర్ట్ గవర్నర్‌గా నియమించిన తరువాత బహ్రయిన్ను 12 సంవత్సరాల బాలుడు పాలించాడు. [60]
1820లో గ్రేట్ బ్రిటన్ " రిలేషన్ షిప్ ట్రీటీ 1820 " మీద సంతకం చేసిన తరువాత అల్ ఖలీఫా తెగను " బహ్రయిన్ పాలకులు (అల్- హకిం) గా గుర్తించింది. [61] అయినప్పటికీ 12 సంవత్సరాల తరువాత బహ్రయిన్ పాలకులు బ్రిటన్, పర్షియన్ల నుండి రక్షణ కొరకు ఈజిప్ట్‌కు వార్షిక కప్పం చెల్లించవలసిన పరిస్థితి ఎదురైంది. [62]
1860లో బ్రిటన్ బహ్రయిన్ మీద ఆధిపత్యం చేయడానికి ప్రయత్నించిన సమయంలో అల్- ఖలీఫాస్ ఇదే వ్యూహం ఉపయోగించాడు. అల్- ఖలీఫా పర్షియన్, ఓట్టమన్ పాలకులకు రక్షణ కల్పించమని కోరుతూ లేఖలు పంపాడు. పర్షియన్లు అల్- ఖలీఫాకు రక్షణ ఇవ్వడానికి నిరాకరించిన కారణంగా చివరకు బ్రిటిష్ రాజ్ ఆఫ్ ఇండియా బహ్రయిన్ మీద ఆధిపత్యం సాధించింది. బహ్రయిన్ పానల, రక్షణ బాధ్యత బ్రిటన్‌కు ఒప్పగించే ఒప్పందం మీద కాలనీ తరఫున లూయిస్ పెల్లీ, అల్- ఖలీఫాలు సంతకం చేసారు. [62]" కతారి- బహ్రయిన్ యుద్ధం 1866 " తరువాత బ్రిటిష్ ప్రతినిధులు అల్- ఖలీఫాతో మరొక ఒప్పందం మీద సంతకం చేసారు. ఒప్పందంలో బహ్రయిన్ పాలకులు భూభాగాలను మరెవ్వరికీ ఇవ్వకూడదని, మరే విదేశీ ప్రభుత్వాలతో సంబంధాలు ఏర్పరుచుకోరదని ప్రధానాంశాలుగా ఉన్నాయి. [63][64] బదులుగా బ్రిటన్ బహ్రయిన్ను సముద్ర, భూ దాడుల నుండి రక్షించాలని ఒప్పందంలో పేర్కొనబడింది. [64] ప్రధానంగా బ్రిటన్ అల్- ఖలీఫాల పాలనకు భద్రత కల్పించింది. 1880, 1892 మరికొన్ని ఒప్పందాలు జరిగాయి.
1892లో బ్రిటన్ బహ్రయిన్ మీద పూర్తి ఆధిపత్యం వహించిన తరువాత ప్రజలమద్య అశాంతి చోటు చేసుకుంది. 1895 మొదటి సారిగా " షేక్ ఇసా బిన్ అలి "కి వ్యతిర్ ఏకంగా దేశవ్యాప్తంగా తిరుగుబాటు తలెత్తింది. తరువాత బహ్రయిన్ పాలకుడు [65] షేక్ ఇసా పర్షియన్ సంబంధం లేని మొదటి పాలకుడుగా ఈ ప్రాంతాన్ని పాలించాడు. పర్షియన్ గల్ఫ్ బ్రిటన్ ప్రతినిధి, " పర్షియన్ గల్ఫ్ రచయిత " అర్నాల్డ్ విల్సన్ మస్కట్ నుండి బహ్రయిన్‌కు వచ్చాడు. [65] బ్రిటిష్ సైనికులు కొదరు తిరుగుబాటుదారులను చంపిన తరువాత ఉద్యమం తీవ్రరూపందాల్చింది. [65] దేశంలో పెట్రోలియం అభివృద్ధి చేయడానికి ముందు బహ్రయిన్ ముత్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. 19వ శతాబ్దం నాటికి బహ్రయిన్ ముత్యాలు ప్రపంచంలో అత్యంత నాణ్యతకలిగినవని గుర్తించబడ్డాయి. 1903లో జర్మన్ అణ్వేషకుడు హెర్మన్ బర్చర్ద్ బహ్రయిన్ను సందర్శించి చరిత్రప్రాధాన్యం కలిగిన పలు ఛాయాచిత్రాలను తీసాడు. వీటిలో " క్వాసర్- ఎస్- షేక్ " ఛాయాచిత్రాలు బెహరిన్ మ్యూజియంలో ఉన్నాయి.[66] మొదటి ప్రపంచయుద్ధానికి ముందు బహ్రయిన్ 30,000 యూరోల ముత్యాలను ఎగుమతి చేసింది. 1911లో బహ్రయిని వ్యాపారుల బృందం దేశంలో బ్రిటిష్ ప్రభాన్ని ఎదుర్కొన్నారు. ఫలితంగా వ్యాపారబృంద నాయకులను ఖైదుదుచేసి దేశబహిష్కరణ చేసారు. 1923లో బ్రిటిష్ ప్రభుత్వం బహ్రయిన్లో " బహ్రయిన్ నిర్వహణా సంస్కరణలు 1920 " ప్రవేశపెట్టింది. అలాగే షేక్ ఇస్సా బిన్ అలి స్థానంలో ఆయనకుమారుని నియమించింది. అలాగే " అల్ దొస్సారి " వంటి ప్రత్యర్థి కుటుంబాలు దేశాన్ని వదలడం లేక బహిషరించడం కారణంగా సౌదీ అరేబియా, ఇరాన్‌కు తరలివెళ్ళారు.[67] మూడు సంవత్సరాల తరువాత బ్రిటన్ బహ్రయిన్లో చార్లెస్ బెల్గ్రేవ్ నాయకత్వంలో " డి ఫాక్టో " పాలన ప్రవేశపెట్టింది. 1957 వరకు చార్లెస్ బెల్గ్రేవ్ పాలకునికి సహాయకునిగా ఉన్నాడు.[68][69] బెల్గ్రేవ్ బహ్రయిన్లో పలు సంస్కరణలు చేపట్టి దేశంలో మొదటి ఆధునిక పాఠశాల (1919), పర్షియన్ బాలికల పాఠశాల (1928) స్థాపించాడు.[70] అలాగే అరబ్ బానిస వ్యాపరం రద్దు (1937) చేసాడు. [71] రాపిడ్ పేస్ వద్ద " పీర్ల్ డైవింగ్ ఇండస్ట్రీ " అభివృద్ధి చేసాడు. 1927లో రేజాషా, షాహ్ ఆఫ్ ఇరాన్ బహ్రయిన్ సార్వభౌమత్వం కోరుతూ " లీగ్ దేశాలకు " లేఖ పంపారు. ఈ చర్య బెల్గ్రేవ్ను షియా ఇస్లాం, సున్నీ ముస్లిముల మద్య యుద్ధాన్ని ప్రోత్సహించడం మొదలైన కఠనచర్యలు తీసుకునేలా ప్రోత్సహించింది. ఉద్యమం అణచబడడం, ఇరానియన్ ప్రభావాన్ని పరిమితి చేయడం ఈ చర్యల వెనుక ప్రధానోద్ధేశ్యంగా ఉంది.[72] బ్రిగేవ్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని అరబ్ గల్ఫ్ అని పిలవాలని ప్రతిపాదించాడు. అయినప్పటికీ ఈ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం త్రోసిపుచ్చింది.[68]
బ్రిటన్ బహ్రెయిన్‌లో చేపట్టిన అభివృద్ధికార్యక్రమాలు సౌదీ అరేబియా, ఇరానియన్లను ఆందోళనకు గురిచేసాయి.
1931లో కలిఫోర్నియా స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ (ఎస్.ఒ.ఎ.ఎల్) " అనుబంధ సంస్థగా బహ్రయిన్లో " ది బహ్రయిన్ పెట్రోలియం కంపెనీ " (బాప్కొ) [73] స్థాపించబడి ఉత్పత్తి ఆరంభించింది. ఇది బహ్రయిన్ను మరింత ఆధునికం చేసింది. యునైటెడ్ కింగ్డంతో సంబంధాలు మరింత బలపడ్డాయి. ఫలితంగా 1935లో బ్రిటిష్ రాయల్ నేవీ మిడిల్ ఈస్టర్న్ కమాండ్ పూర్తిగా బుషర్ నుండి బహ్రయిన్‌కు తరలించబడింది.[74]1930 ఆరంభంలో " బహ్రయిన్ ఎయిర్పోర్ట్ " అభివృద్ధిచేయబడింది. అక్కడి నుండి ఇంపీరియల్ ఎయిర్ వేస్ విమానాలు పయనించాయి. తరువాత అదే దశాబ్ధంలో ఫ్లైయింగ్ - బోట్స్, సీ ఫ్లైట్స్ కొరకు బహ్రయిన్ మేరీటైం ఎయిర్పోర్ట్ స్థాపించబడింది. [75]
బహ్రయిన్ రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొన్నది. 1940 అక్టోబరు 19 న ఇటాలియన్ బాంబర్ విమానాలు బహ్రయిన్ మీద బాంబుదాడి చేసాయి. [76] ఈ దాడి ఆయిల్ రిజైనరీలను లక్ష్యంగా చేసుకుని చేయబడింది.[77] రెండు ప్రాంతాలలో కనీసమైన నష్టం సంభవించింది. [77] రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ వ్యతిరేకత అరబ్ ప్రంపంచం అంతటా అధికంగా వ్యాపించింది. తిరుగుబాటుదారులు యూదసమూహాలను లక్ష్యంగా చేసుకుని పోరాటం సాగించారు. 1948లో దేశంలో ప్రతీకారం, అల్లర్లు అధికం అయ్యాయి.[78] బహ్రయిన్ యుదసమూహానికి చెందిన ప్రజలు చాలామంది వారి ఆస్తులను విడిచి బాంబేకు తరలివెళ్ళారు. తరువాత వారు ఇజ్రాయిల్, యునైటెడ్ కింగ్డంలో స్థిరపడ్డారు. 2008 నాటికి బహ్రయిన్ లోని యూదుల సంఖ్య 37 మాత్రమే.[78] 1950లో సెక్రెటిరేనియన్ కలహాలు తరువాత " ది నేషనల్ యూనియన్ కమిటీ " రూపొందించబడింది. తరువాత వారు ఎన్నిక చేసిన సభ్యులు కలిగిన అసెంబ్లీ కావాలని, బెల్గ్రేవ్ను తొలగించాలని పోరాటం సాగించారు. పోరాటంలో భాగంగా పలు ప్రదర్శనలు, జనరల్ స్టైక్ నిర్వహించబడ్డాయి. 1965లో ఒక మాసకాలం " మార్చి ఇంతిఫా " నిర్వహించబడుంది.[79]
1971 ఆగస్టు 15 న [80][81] బహ్రయిన్ స్వతంత్రం దేశంగా ప్రకటించబడింది. అలాగే యునైటెడ్ కింగ్డంతో స్నేహసంబంధాలు కొనసాగే ఒప్పందం మీద ఇరుదేశాలు సంతకం చేసాయి. అదే సంవత్సరం బహ్రయిన్ ఐక్యరాజ్యసమితి, అరబ్ లీగ్‌తో చేర్చబడింది.[82] 1970లో విజయవంతమైన ఆయిల్ అణ్వేషణ బహ్రయిన్‌కు బృహత్తర ఆదాయం చేకూర్చినప్పటికీ ఇతర కారణాల కారణంగా ఆర్థికరంగంలో పతనం ఎదుర్కొనవలసిన పరిస్థితి నెలకొన్నది. దేశం వైవిధ్యమైన ఆర్థికవిధానాలను చేపట్టింది. అలాగే 1970-1980 మద్య జరిగిన లెబనాన్ అంతర్యుద్ధం బహ్రయిన్‌కు ఆర్థికప్రయోజనం కలిగించింది. అంతర్యుద్ధం కారణంగా లెబనాన్ లోని బృహత్తర బ్యాంకింగ్ రగం లెబనాన్‌ను వదిలి బహ్రయిన్ చేరింది. అందువలన బహ్రయిన్ మిడిల్ ఈస్ట్ ఆర్థిక కేంద్రంగా మారింది. [83] 1979లో ఇరాన్లో " ఇరానియన్ విప్లవం (ఇస్లామిక్ విప్లవం) " తరువాత 1981లో బహ్రయిన్ షియా సంప్రదాయవాదులు " ఇస్లామిక్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ బహ్రయిన్ " రూపొందించి చేసిన తిరుగుబాటు విఫలమైంది. బహ్రయిన్ నుండి బహిష్కరించబడి ఇరాన్ చేరిన ఒక షియా సంప్రదాయవాది ఉద్యమానికి మూలకారణంగా వ్యవహరించాడు. [84] 1994 చెప్పులు లేకుండా మారథాన్ పోటీలో పరుగెడుతున్న మహిళలమీద యువకులు రాళ్ళు విసిరిన కారణంగా పోలీసులతో ఏర్పడిన ఘర్షణ దేశంలో కల్లోలానికి దారితీసింది. [85][86]1990లో బహ్రయిన్లో మరొక విప్లవం తలెత్తింది. 1994- 2000 మద్య కాలంలో లెఫ్టిస్టులు, లిబరల్, ఇస్లామీలు కలిసి సైన్యసమీకరణ చేసారు.[87] ఈ సంఘటనలో 40 మంది మరణించారు. 1999లో " హమిద్ ఇబ్న్ ఇస అల్ ఖలిఫా " బహ్రయిన్ ఎమీర్ కావడంతో ఉద్యమం ముగింపుకు వచ్చింది.[88] ఆయన బహ్రయిన్లో పార్లమెంటు ఎన్నికలను నిర్వహించాడు. ఆయన రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయడం, ఎన్నికలలో స్త్రీలకు ఓటు హక్కు కల్పించాడు. [89] నేషనల్ యాక్షన్ చార్టర్‌కు మద్దతు కల్పిస్తూ 2001 ఫిబ్రవరి 14-15లలోలో ఒక రిఫరెండం నిర్వహించబడింది. [90] 2002 ఫిబ్రవరి 14న నేషనల్ యాక్షన్ చార్టర్ బహ్రయిన్ పేరు " కింగ్డం ఆఫ్ బహ్రయిన్ "గా మార్చబడింది.[91]
బహ్రయిన్ 2001 తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ యుద్ధంలో భాగస్వామ్యం వహించింది. బహ్రయిన్ మానవతా ధృక్పథంతో 2001 అక్టోబరులో అరేబియన్ సముద్రంలో యుద్ధనౌకను నిలిపి విముక్తి కార్యక్రమాలను చేపట్టింది.[92] ఫలితంగా యు.ఎస్. అధ్యక్షుడు " జార్జ్ డబల్యూ బుష్ " ప్రభుత్వం బహ్రయిన్ " నాన్- నేటో అల్లాయ్ "గా గుర్తించింది. [92] బహ్రయిన్ ఇరాక్ దాడికి వ్యతిరేకత తెలిపింది. అంతేకాక దాడికి ముందు సద్దాం హుసేన్‌కు ఆశ్రయం ఇచ్చింది. [92] 2001లో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో సరిహద్దులోని హవర్ ద్వీపాల వివాదం పరిష్కారం అయిన తరువాత పొరుగున ఉన్న బహ్రయిన్ కతర్‌తో సంబంధాలు అభివృద్ధి చేసింది. దేశంలో రాజకీత స్వంతంత్రం ఏర్పడిన తరువాత 2004లో బహ్రయిన్ యునైటెడ్ స్టేట్స్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి అంగీకారం తెలిపింది.[93]
2011లో బహ్రయిన్ లోని సున్నీపాలకులమీద షియా ముస్లిములు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.[94][95] బహ్రయిన్ ముందుగా ప్రదర్శనకు అంగీకరించి తరువాత ప్రదర్శనకారుల కేంపు మీద రాత్రివేళలో వారు నిద్రిస్తున్న సమయంలో దాడిచేసింది. ఈ సంఘటన " బహ్రయిన్ బ్లడీ తర్స్డే "గా వర్ణించబడింది.[95] ఒక మాసం తరువాత బహ్రయిన్ సౌదీ అరేబియా నుండి రక్షణ సహాయం కొరకు అభ్యర్థించింది. అలాగే దేశంలో మూడు మసాల అత్యవసర పరిస్థితిని (ఎమర్జెంసీ) ప్రకటించబడింది.[95] తరువాత బహ్రయిన్ ప్రభుత్వం ప్రత్యర్థుల మీద కఠిన చర్యలు తీసుకుంది. ఈ సందర్భంలో వేలాది ఖైదులు, హింసాత్మకచర్యలు చోటుచేసుకున్నాయి.[96][97][98][99][100] అయినప్పటికీ ప్రదర్శనకారులు, సెక్యూరిటీ దళాలమద్య దినసరి కలహాలు కొనసాగాయి. కలహాలు డజెన్లకొద్ది మరణాలు సంభవించాయి.[101][102][103][104][105][106] 2014 నాటికి 80 మంది పౌరులు 13 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. [107][108]
బహ్రయిన్ పర్షియన్ గల్ఫ్‌లో సౌదీ ఆరేబియాకు తూర్పున ఉంది. బహ్రయిన్ సాధారణంగా చదరంగా, పొడిగా ఉండే ద్వీపసమూహం. బహ్రయిన్ స్మోక్ పర్వతం దిగువ ప్రాంతంలో ఉంటుంది.[109][110] బహ్రయిన్ వైశాల్యం 662 చ.కి.మీ. భూపునరుద్ధరణ ప్రణాళిక కారణంగా వైశాల్యం 765 చ.కి.మీ లకు చేరుకుంది. బహ్రయిన్ హంబర్గ్ లేక ఐల్ (మాన్) కంటే కొంచం అధికం. [110] బహ్రయిన్‌లోని 33 ద్వీపాల సమూహాన్ని సాధారణంగా ఆర్చిపిలాగొ అంటారు.[111] భుభాగం విస్తరణ ప్రణాళిక కారణంగా ద్వీపాల సంఖ్య 84 కు చేరుకుంది. [112] బహ్రయిన్ ఇతరదేశాలతో సరిహద్దును పంచుకోవడం లేదు. బహ్రయిన్లో 161 కి.మీ సముద్రతీరప్రాంతం ఉంది. దేశంలో 22 కి.మీ అంతర్గత సముద్రతీరం ఉంది. బహ్రయిన్ లోని అతిపెద్ద ద్వీపం బహ్రయిన్ ద్వీపం. అదనంగా హావర్ ద్వీపాలు, ముహర్రగ్ ద్వీపాలు, ఉం అన్ నాసన్, సిత్రా ద్వీపాలు ఉన్నాయి. బహ్రయిన్ శితాకాలంలో చలి స్వల్పంగా ఉంటుంది. బహ్రయిన్ అత్యధిక మొత్తంలో ఆయిల్ నిలువలు, సహజయు నిలువలు, చేపలు బహ్రయిన్ ప్రధాన ఆర్థికవనరులుగా ఉన్నాయి. బహ్రయిన్ లోని వ్యవసాయభూమి 2.82% మాత్రమే ఉంది.[113] 92% బహ్రయిన్ భూభాగం ఎడారిప్రాంతం. తరచుగా సంభవించే కరువులు, ధూళి తుఫానులు బహ్రయిన్ ప్రధాన విపత్తులుగా ఉన్నాయి.[114]
పరిమితమైన వ్యవసాయ భూమిని ఎడారి చేస్తున్నారని, సముద్రతీర భుభాగాన్ని ధ్వంసం చేస్తున్నారని బహ్రయిన్ పర్యావరణ వివాదాలను ఎదుర్కొంటున్నది. సముద్రతీరంలోని పగడపు దిబ్బలను, సముద్రపు మొక్కలను ధ్వంసం చేయడం పర్యావరణం దెబ్బతింటూ ఉనదని ఆరోపణలు ఎదురౌతూ ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీలు, బృహత్తర ట్యాంకర్లు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి చిందుతున్న అయిల్ సముద్రజలాలను కలుషితం చేస్తున్నాయి. తుబ్లీ బే ప్రాంతంలో నిర్వహించబడుతున్న చట్టవిరుద్ధమైన భూపునరుద్ధరణ వివాదాంశాలలో ఒకటిగా ఉంది. వ్యవసాయ రంగం, గృహావసరాలకు డమ్మం అక్విఫర్ నీరందింస్తుంది. బహ్రయిన్లో ప్రధాన అక్విఫర్ ఉంది. అక్విఫర్ సమీపప్రాంతంలోని నీటివనరులలో ఉప్పుశాతాన్ని అధిరిస్తుందన్న వివాదం ఉంది. [115]
ఇరాన్ లోని జగ్రోస్ పర్వతశ్రేణిలో లెవల్ విండ్స్ బహ్రయిన్లో ప్రవేశించడానికి సహకరిస్తున్నాయి. నైరుతీ ౠతుపవనాలు ఇరాక్, సౌదీ అరేబియా నుండి ధూళి తుఫానులను బహ్రయిన్‌కు తీసుకువస్తున్నాయి. ప్రాంతీయంగా షమాల్ అని పిలువబడే గాలులు జూన్ జూలై మాసాలలో అస్పష్టమైన వాతావరణానికి కారణం ఔతుంది. [116] వేసవి చాలా వేడిగా ఉంటుంది. బహ్రయిన్ సమీపంలోని సముద్రం చాలా నిస్సారంగా ఉంటుంది. త్వరగా వేడెక్కి గాలిలో తేమను అధికం చేస్తూ (ప్రత్యేకంగా రాత్రివేళలలో) ఉంటుంది. వేసవి వాతావరణం 50 డిగ్రీల సెల్షియస్ చేరుకుంటుంది. [117] బహ్రయిన్ వర్షపాతం తక్కువగా ఉంటుంది. వర్షపాతం క్రమానుసారంగా ఉండదు. వర్షపాతం 71.8 మి.మి ఉంటుంది. [118]
శీతోష్ణస్థితి డేటా - Manama | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 20.0 (68.0) |
21.2 (70.2) |
24.7 (76.5) |
29.2 (84.6) |
34.1 (93.4) |
36.4 (97.5) |
37.9 (100.2) |
38.0 (100.4) |
36.5 (97.7) |
33.1 (91.6) |
27.8 (82.0) |
22.3 (72.1) |
30.1 (86.2) |
సగటు అల్ప °C (°F) | 14.1 (57.4) |
14.9 (58.8) |
17.8 (64.0) |
21.5 (70.7) |
26.0 (78.8) |
28.8 (83.8) |
30.4 (86.7) |
30.5 (86.9) |
28.6 (83.5) |
25.5 (77.9) |
21.2 (70.2) |
16.2 (61.2) |
23.0 (73.4) |
సగటు అవపాతం mm (inches) | 14.6 (0.57) |
16.0 (0.63) |
13.9 (0.55) |
10.0 (0.39) |
1.1 (0.04) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0.5 (0.02) |
3.8 (0.15) |
10.9 (0.43) |
70.8 (2.79) |
సగటు అవపాతపు రోజులు | 2.0 | 1.9 | 1.9 | 1.4 | 0.2 | 0 | 0 | 0 | 0 | 0.1 | 0.7 | 1.7 | 9.9 |
Source: World Meteorological Organisation (UN) [119] |
బహ్రయిన్ ద్వీపసమూహంలో 330 జాతిల పక్షులు నమోదుచేయబడి ఉన్నాయి. వీటిలో 26 పక్షిజాతులు బహ్రెయిన్‌లో సంతానాన్ని పెంపొదించుకుంటున్నాయి. వేలాది వలసపక్షులు పర్షియన్ గల్ఫ్‌ను దాటి బహ్రయిన్ చేరుకుని శీతాకాలం, ఆకురాలు కాలం వరకు నివసించి తిరిగి తమస్వస్థానాలకు చేరుకుంటాయి.[120] బహ్రయిన్‌కు వచ్చే పక్షులలో " చ్లమిడాయిట్స్ ఉండులాటా " అనే అంతరించిపోతున్న పక్షిజాతి ఒకటి.[120] బహ్రయిన్‌లోని అనేక ద్వీపాలు, నిస్సార సముద్రాలకు సంతానోత్పత్తి చేయడానికి వస్తున్న పక్షులలో దాదాపు 1,00,000 జతల అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన " ఫలక్రొకొరాక్స్ నిగ్రొగులరిస్ " జాతి పక్షులను హావర్ ద్వీపాలలో నమోదుచేయబడ్డాయి.[120]
బహ్రయిన్లో 18 క్షీరదాలను మాత్రమే కనిపెట్టారు.అరణ్యప్రాంతాలలో దుప్పి, ఎడారి కుందేలు, ముళ్ళపంది సాధారణంగా కనిపిస్తుంటాయి. అయినప్పటికీ అరేబియన్ ఓరిక్ష్ వేటకారణంగా దీవిలో కనుమరుగైయ్యాయి.[120] 25 జాతుల ఉభయచరాలు, సరీసృపాలు, 21 జాతుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. [120] వైవిధ్యమైన మేరైన్ బయోటోప్స్, సముద్రపు గడ్డి, మడ్‌ఫ్లాట్స్, పట్చి పగడపు దిబ్బలు ఉన్నాయి. అంతరించిపోతున్న జాతులైన దుగొంగ్, హరిత తాబేలు ఉనికికి సముద్రపు గడ్డి దిబ్బలు సహకరిస్తుంటాయి.[121] 2003లో బహ్రయిన్ సీ కౌస్ (సముద్రపు ఆవు), డాల్ఫిన్ల వేటను నిషేధించింది.[120] సంరక్షిత ప్రాంతం హవర్ ద్వీపాలు విలువైన, వైవిధ్యమైన వసలపక్షులకు ఆహారం, సంతానోత్పత్తి అనుకూలప్రాంతాలుగా ఉన్నాయి. వలస పక్షులకు ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రాంతంగా ఉంది. హావర్ ద్వీపాల బ్రీడింగ్ కాలనీ ప్రపంచంలో అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని దుగొంగుల సంఖ్య ప్రంపంచంలో ద్వితీయస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.[121]
బహ్రయిన్లో 5 సంరక్షిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో 4 సముద్రవాతావరణంలో ఉన్నాయి. [120]
అవి వరుసగా :
బహ్రయిన్ రాచరిజ వ్యవస్థవిధానంలో అల్- ఖలిఫా పాలనలో ఉంది. బహ్రయిన్ రాజుగా " హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా " పాలనచేస్తూ ఉన్నాడు. రాచరిక నియంతృత్వ పాలనలో ప్రజాస్వామ్యవ్యవస్థ లోపం, న్యాయాధికార లోపం పరిశీలకులను ఇది నియంతృత్వదేశంగా భావించేలా చేస్తుంది. రాజు హమాద్ విస్తారమైన అధికారం కలిగి ఉన్నాడు. ప్రధానమత్రిని నియమించడం, మంత్రివర్గాన్ని నిర్ణయించడం, బహ్రయిన్ రక్షణ వ్యవస్థను నియంత్రించడం, న్యాధికారులను నియమించడం నేషనల్ అసెంబ్లీ సభ్యులను నియమించడం, కంసలేటివ్ కౌంసిల్ నియామకం, ఎన్నికచేయబడిన కౌంసిల్ను రద్దుచేయడం రాజు అధికారపరిధిలో ఉంటాయి.[95] ఎన్నిక చేయబడని నియమించబడిన ప్రధానమంత్రి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. 1971 నుండి ప్రస్తుత రాజుకు అంకుల్ " ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా "గా (ప్రధానమంత్రి) నియమించబడ్డాడు. ప్రపంచంలో అతి దీర్ఘకాల ప్రధానమంత్రిగా ఖలీఫా బిన్ సల్మాన్ గుర్తించబడుతున్నాడు.[122] 2010లో మంత్రివర్గంలో సగం అల్ కలీఫా కుటుంబ సభ్యులే.[123] బహ్రయిన్ ఉభయసభల విధానం అమలులో ఉన్న దేశం. ఉభయసభలలో 40 మంది సభ్యులు కలిగిన షురా కౌంసిల్, 40 మంది సభ్యులు కలిగిన కౌంసిల్ ఆఫ్ రెప్రెజెంటేటివ్ ఉన్నాయి. 40 మంది సభ్యులు కలిగిన షురా కౌంసిల్ను రాజు నియమిస్తాడు. కౌంసిల్ ఆఫ్ రెప్రెజెంటేటివ్ 40 మంది సభ్యులను నియోజకవర్గ సభ్యులు ఎన్నుకుంటారు. ఎన్నికలు 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి.[95]: 15 [124] 1973లో బహ్రయిన్లో మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అయినప్పటికీ రెండు సంవత్సరాల తరువాత ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పార్లమెంటును రద్దుచేసాడు. [79] 2002, 2001 మద్య మూడు పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. బహ్రయిన్ పార్లమెంటరీ ఎన్నికలు 2002 (దీనిని ప్రతిపక్షాలు బహిష్కరించాయి), బహ్రయిన్ పార్లమెంటరీ ఎన్నికలు 2006లో అల్ వెఫాగ్ ఆధిక్యత సాధించింది. మూడవసారిగా బహ్రయిన్ పార్లమెంటరీ ఎన్నికలు 2010 నిర్వహించబడ్డాయి. [125] తరువాత 2011 లో 18 మంది అల్ వెఫాగ్ సభ్యుల రాజీనామాతో బై ఎలెక్షన్లు నిర్వహించబడ్డాయి.[126][127] ఎన్నికలు షియా, సున్నీ ముస్లిములకు ప్రయోజనం చేకూర్చాయి.[128] ఇవి రాజకీయ విధానంలో కొత్తౌత్సాహం నింపాయి. షియా మతగురువు ఇసా ఖాసిం ఎన్నికలలో ప్రధానపాత్ర వహించాడు.[129] 2005లో షియా " కుటుంబ చట్టం " రద్దుచేయాలని ప్రభుత్వం పిలుపు ఇచ్చినప్పుడు దానిని వ్యతిరేకిస్తూ 1,00,000 మంది షియాముస్లిములు వీధిప్రదర్శన చేసారు. షియా ముస్లిములు చట్టం రద్దుచేసే అధికారం పార్లమెంటుకుగాని ప్రభుత్వానికి కాని లేదని తమ వాదనను వెలిబుచ్చారు. అయినప్పటికీ చట్టానికి మహిళల మద్దతు ప్రకటించారు. మహిళా ఉద్యమకారులు " కుటుంబచట్టం వలన తాము మౌనంగా వేదన అనుభవిస్తున్నామని " అభిప్రాయం వెలిబుచ్చారు. మహిళలు 500 మంది సభ్యులతో కుటుంబ చట్టం రద్దుకు మద్దతు తెలుపుతూ ర్యాలి నిర్వహించారు.[130][131][132] మహిళా ఉద్యమకారిణి ఘధ జంషీర్ [133] ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రతిపక్ష ఇస్లామిక్ బృందాలతో బేరసాలకు ఉపకరణంగా ఉపయోగించుకున్నదని ఆరోపించింది.[134] [135]
1975, 1999 మద్యకాలంలో బహ్రయిన్ ఏకపక్ష ఖైదులు, విచారణరహిత నిర్భంధం, హిస, బలవంతపు దేశబహిష్కరణ వంటి మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగాయి.[137][138] 1999లో ఇసా అల్ ఖలీఫా తరువాత ఆయన కుమారుడు ఎమిర్ హమద్ అల్ ఖలీఫా అధికారం చేపట్టాడు. ఆయన పెద్ద ఎత్తున సంస్కరణలు మానవహక్కుల కార్యక్రమాలు చేపట్టాడు. [139] ఆమెనిటీ ఇంటర్నేషనల్ ఈ చర్యలను " మానవహక్కుల చారిత్రక కాలం " (హిస్టారికల్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్) గా వర్ణించింది. [89]2007లో బహ్రయిన్లో తిరిగి హింసాత్మక చర్యలు మొదలైన తరువాత మానవహక్కుల స్థితి దిగజారింది.[140] 2011లో హ్యూమన్ రైట్స్ వాచ్ దేశంలోని మానవహక్కుల స్థితిని " దుర్భరం " వర్ణించింది. [141] ఈ సమయంలో బహ్రయిన్ గతంలో సంపాదించిన కొన్ని అంతర్జాతీయ ర్యాంకులను కోల్పోయింది. [142][143][144][145][146]2011లో బహ్రయిన్ ఉద్యమం అణిచివేయబడిన తీరు బహ్రయిన్ను విమర్శకు గురిచేసింది. సెప్టెంబరులో ప్రభుత్వం విచారణ కొరకు నియమించిన కమీషన్ ఉద్యమ అణచివేత సమయంలో జరిగిన హింసను ధృవీకరించింది. తరువాత బాధాకరమైన పరిస్థితులు తిరిగి సంభవించకుండా నివారిస్తామని, సస్కరణలు చేపడతామని ప్రభుత్వం ప్రజలకు మాట ఇచ్చింది. [147] అయినప్పటికీ 2012 ఏప్రెల్‌లో ఆమెంస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల సేవాసంస్థలు అందించిన నివేదికలు అదే తరహా హింసాత్మకచర్యలు కొనసాగుతున్నాయని తెలియజేసాయి.[148][149]
కతారి టీ.వి ప్రసారం చేసిన డాక్యుమెంటరీ బహ్రయిన్ హింసాత్మకచర్యలను బహిర్గతం చేసిన కారణంగా కతర్, బహ్రయిన్ సంబంధాల మద్య సమస్యలు ఎదురైయ్యాయి. [150][151] 2014 నవంబరులో " గల్ఫ్ కార్పొరేషన్ కౌంసిల్ " మీటింగ్ తరువాత బహ్రయిన్ కతర్‌తో దౌత్యసంబంధాలను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. [152]
బహ్రయిన్లో మహిళలకు ఓటుహక్కు లభించిన తరువాత మహిళల రాజకయ హక్కుల స్థితి కొంచం అభివృద్ధిచెందింది. 2002లో జాతీయ ఎన్నికలలో మొదటి సారిగా మహిళలు భాగస్వామ్యం వహించారు.[153] అయినప్పటికీ ఎన్నికలలో విజయం సాధించలేదు. ప్రతిగా షియా, సున్నీ ఇస్లామిస్టులు అత్యధిక స్థానాలు సాధించి ఎన్నికలలో ఆధిక్యత సాధించారు.[154] ఎన్నికలలో అపజయం పొందిన ఆరుగురు మహిళలు షురా కౌంసిల్ సభ్యులుగా నియమించబడ్డారు. షురా కౌంసిల్‌లో స్థానిక యూదులు, క్రైస్తవ ప్రతినిధులు కూడా ఉంటారు.[155] డాక్టర్. నాదా హఫాద్ బహ్రయిన్ మొదటి మహిళా క్యాబినెట్ మంత్రిగా నియమించబడింది. 2004లో నాదా హఫాద్ ఆరోగ్యమంత్రిగా నియమించబడింది. " ది క్వాసి - గవర్నమెంటల్ వుమంస్ గ్రూప్ ", ది సుప్రీం కౌంసిల్ ఆఫ్ వుమన్ లలో శిక్షితులైన మహిళాప్రతినిధులు 2006 జనరల్ ఎన్నికలలో పాల్గొన్నారు. బహ్రయిన్ " యునైటెడ్ నేషంస్ జనరల్ అసెంబ్లీ " నాయకత్వం వహించడానికి ఎన్నిక చేయబడిన తరువాత 2006లో బహ్రయిన్ మహిళా ఉద్యమనాయకురాలు, లాయర్ అయిన " హ్యా రాషెద్ అల్- ఖలీఫా " యునైటెడ్ నేషంస్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలుగా ఎన్నికచేయబడింది. ఈ నియామకంతో అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వం వహించిన మూడవ మహిళగా హ్యా రాషెద్ అల్- ఖలీఫా ప్రత్యేకత సాధించింది. [156] మహిళా ఉద్యమకారిణి ఘద జంషీర్ " ప్రభుత్వం మహిళా హక్కులను అలంకార సామాగ్రిగా మార్చింది " అని అభిప్రాయపడింది. ఆమె సంస్కరణలు కృత్రిమమైనవని వాస్తవానికి ప్రభుత్వం ప్రభుత్వేతర మహిళాస్థలకు అంతరాయం కల్పిస్తుందని ఆరోపించింది.[134] 2006లో లతీఫా అల్ గవూద్ మొదటి మహిళా ఎం.పిగా విజయం సాధించింది.[157] 2011 నాటికి మహిళా సభ్యుల సంఖ్య 4 కు చేరింది.[158] 2008లో హౌడానానూ యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్‌గా (అరబ్ దేశాలు నియమించిన మొదటి జ్యూయిష్ అంబాసిడర్) నియమించబడింది. [159] 2011లో " అలీస్ సమాన్ " అనే క్రైస్తవ మహిళను యు.కె అంబాసిడర్‌గా నియమించబడింది.[160]
బహ్రయిన్ పాత్రికేయులు విధినిర్వహణలో పలుసమస్యలను ఎదుర్కొంటున్నారు. 2011 ప్రతిపక్షాల ప్రభుత్వవ్యతిరేక ప్రదర్శనల సమయంలో అధికారిలు పాత్రికేయులను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిపక్షాలకు చెందిన పాత్రికేయులను (అల్ వసత్ (బహ్రయిన్ న్యూస్ పేపర్) నిర్భంధించిసత్యదూరమైన వాత్రలు ప్రచురించినందుకు జరిమానా విధించబడింది.పలు విదేశీ ప్రతినిధులను దేశం వెలుపలికి పంపారు.[161] దేశీయ ప్రసారాన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అశాంతికి కారణం తెలుసుకోవడానికి నియమింవిన ఇండిపెండెంట్ కమీషన్ మీడియా కవరేజ్ వివక్షధోరిణి చూపుతుందని అభిప్రాయం వెలిబుచ్చింది. ప్రతిపక్షాలకు మాధ్యమప్రసారాలు తగిన అవకాశం ఇవ్వడం లేదని కమీషన్ భావించింది. ప్రభుత్వం సెన్సార్ అంక్షలను సడలించాలని కమీషన్ సిఫారసు చేసింది. బహ్రయిన్లో సౌది- నిధిసహాయంతో పనిచేస్తున్న అలారబ్ న్యూస్ చానల్ ప్రసారకార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయబడ్డాయి. ప్రతిపక్షాలు లండన్ నుండి శాటిలైట్ ద్వారా చేస్తున్న " లౌలౌ " టి.వి ప్రసారాల సిగ్నల్స్ బహ్రయిన్లో నిలిపివేయబడ్డాయి.[161] 2012 నాటికి బహ్రయిన్లో 9,61,000 ఇంటర్నెట్ వాడకందారులు ఉన్నారు.[161] [162]
బహ్రయిన్ చిన్న దేశం అయినా " బహ్రయిన్ డిఫెంస్ ఫోర్స్ " చక్కగా నిర్వహించబడుతుంది. ఇందులో 13,000 మంది పనిచేస్తున్నారు. [163] బహ్రయిన్ మిలటరీ సుప్రీం కమాండర్‌గా " రజా హమిద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ", డెఫ్యూటీ సుప్రీం కమాండర్‌గా రాకురుడు సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా " బాధ్యత వహిస్తున్నారు.[164][165] బహ్రయిన్ డిఫెంస్ ఫోర్స్ యునైటెడ్ స్టేట్స్ ఉపకరణాలను ఉపయోగిస్తుంది. ఎఫ్-16 ఫైటింగ్ ఫల్కాన్, ఎఫ్-5 ఫ్రీడం ఫైట్ర్స్, యు.హెచ్ 60 బ్లాఖ్హాక్, ఎం.60 పటాన్, ఎఫ్.ఎఫ్‌జి 24 రక విమానాలు ఉన్నాయి. అలాగే అలివర్ హజార్డ్ ఫెర్ర్య్ కూడా ఉంది[166][167] బహ్రయిన్ ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. బహ్రయిన్ యునైటెడ్ స్టేట్స్ మిలటిరీతో సహకార రక్షణ ఒప్పందం మీద సంతకం చేసింది. 1990 నుండి బహ్రయిన్‌లోని జుఫెయిర్ వద్ద యునైటెడ్ స్టేట్స్ బేస్ ఏర్పాటు చేయబడింది. 1948 నుండి బహ్రయిన్లో యు.ఎస్ నావల్ కేంద్రం ఉంది. [168][169] బహ్రయిన్లో దాదాపు 6,000 మంది యునైటెడ్ స్టేట్స్ సైనికులు ఉన్నారు.[170] బహ్రయిన్ షియా ముస్లిములకు ఎదురుగా " సౌది అరేబియన్ - లెడ్ ఇంటర్వెంషన్ ఇన్ ఏమన్ "లో పాల్గొన్నది.[171][172]
బహ్రయిన్ 190 దేశాలతో ద్వైపాక్షిక దౌత్యసంబంధాలను ఏర్పరుచుకుంది.[173] 2012 బహ్రయిన్ 25 దౌత్యకార్యక్రమాలు, 3 రాయబారుల నియామకం, 4 శాశ్వత మిషన్లను అరబ్ దేశాలు, యునైటెడ్ నేషంస్, యురేపియన్ యూనియన్లకు పంపడం మొదలైన కార్యక్రమాలను చేపట్టింది. [174] బహ్రయిన్లో 36 విదేశీ దౌత్యకార్యాలలు ఉన్నాయి. బహ్రయిన్ ప్రాంతీయ రాజకీయాలలో నమ్రతకలిగిన, పరిమితమైన పాత్రవహిస్తుంది. " అరబ్ లీగ్ ఆన్ మిడిల్ ఈస్ట్ పీస్ " కట్టుబాటును, పాలస్తీనా హక్కుల పరిరక్షణను బలపరుస్తూ ఉంది.[175] " గల్ఫ్ కార్పొరేషన్ కౌంసిల్ "కు నిధులను సమకూరుస్తున్న దేశాలలో బహ్రయిన్ ఒకటి.[176][177][178]" 2011లో ప్రొ- డెమొక్రసీ ప్రొటెస్ట్ " అణిచివేయడానికి సౌదీ అరేబియయన్ సైన్యం బహ్రయిన్‌కు పంపబడింది.[179]
బహ్రయిన్ లోని మొదటి ముంసిపాలిటీ 8- మంది సభ్యులు కలిగిన మనమా ముంసిపాలిటీ 1919లో స్థాపించబడింది.[180] ముంసిపాలిటీ సభ్యులు వార్షికంగా ఎన్నుకొనబడతారు. బహ్రయిన్ మొదటి ముంసిపాలిటీ అరబ్ ప్రంపంచంలోనే మొదటిదిగా గుర్తించబడుతుంది.[180] ముంసిపాలిటీ రహదార్లను శుభం చేయడం, భవనలను, దుకాణాలను వాడకందార్లకు అద్దెకు ఇవ్వడం మొదలైన విధులు నిర్వహిస్తుంది. 1929 నాటికి ముంసిపాలిటీ రహదార్ల విస్తరణ, మార్కెట్లను తెరవడం, కబేళాలను నిర్మించడం మొదలైన బాధ్యతలను నిర్వహించడం ఆరంభించింది. [180] 1958లో ముంసిపాలిటీ " వాటర్ ప్యూరిఫికేషన్ " ప్రాజెక్టులను చేపట్టింది.[180] 1960లో బహ్రయిన్లో మనామా, హిద్, అల్ ముహరగ్, రిఫ్ఫ అనే 4 ముంసిపాలిటీలు ఏర్పాటుచేయబడ్డాయి.[181] తరువాత 30 సంవత్సరాలకు 4 ముంసిపాలిటీలు 12 ముంసిపాలిటీలుగా విభజించబడ్డాయి. అంతేకాక హమద్ టౌన్, ఇసాటౌన్ మొదలైన సెటిల్మెంటులు ఏర్పాటు చేయబడ్డాయి.[181] ముంసిపాలిటీలు మనామా ముంసిపాలిటీ కేంద్రంగా నిర్వహించబడుతుంటాయి. మనామా సభ్యులు రాజుచేత నియమించబడతారు.[182]1971లో బహ్రయిన్ స్వతంత్ర దేశం అయిన తరువాత, 2002లో బహ్రయిన్ ముంసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. [183]
ముంసిపాలిటీల జాబితా:
2002 జూలై 3 తరువాత బహ్రయిన్ 5 గవర్నరేట్లుగా విభజించబడింది. ఒక్కొక్క దానికి ఒక్కొక గవర్నర్ నియమించబడతాడు.
గవర్నరేట్ల జాబితా:
2014లో సెంట్రల్ గవర్నరేట్ రద్దుచేయబడి ఆ భూభాగాన్ని నార్తెన్ గవర్నరేట్, సదరన్ గవర్నరేట్, కేపిటల్ గవర్నరేట్లుగా విభజించబడింది. [185]
2001లో యునైటెడ్ స్టేట్స్ " మేజర్ నాన్ - నేటో అలాయ్ "గా రూపుందించింది. [186] బహ్రయిన్ నిరంకుశ పాలనలో ఉన్న దేశం. యు.ఎస్ ఆధారిత " నాన్ - గవర్నమెంటల్ (ఫ్రీడం హౌస్) బహ్రయిన్ను నాట్ ఫ్రీ అని వర్గీకరించింది. [187]
2006 జనవరి నివేదిక అనుసరించి " యునైటెడ్ నేషంస్ ఎకనమిక్ అండ్ సోధల్ కమీషన్ ఫర్ వెస్టర్న్ ఆసియా " అరబ్ వరల్డ్‌లో బహ్రయిన్ ఆర్థికరంగం వేగవంతంగా అభివృద్ధిచెందుతుందని తెలియజేస్తున్నాయి.[188] బహ్రయిన్ మధ్య ఆసియాదేశాలలో అనియంతృత ఆర్థిక వ్యవస్థకలిగిన దేశమని భావించబడుతుంది. 2011 అనియంతృత ఆర్థిక వ్యవస్థకలిగిన దేశాల జాబితాలో బహ్రయిన్ 12వ స్థానంలో ఉందని " హెరిటేజ్ ఫౌండేషన్ (వాల్ స్ట్రీట్ జనరల్) ప్రచురించింది.[189]2008లో బహ్రయిన్ ప్రపంచంలోని వేగవంతంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థిక కేంద్రం అని లండన్ నగరం గ్లోబల్ ఫైనాంషియల్ జాబితా తెలియజేస్తుంది.[190][191] బహ్రయిన్ బ్యాంకింగ్, ఫైనాంషియల్ సర్వీస్ సెక్టర్ (ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంకింగ్) ఆయిల్‌రంగ అభివృద్ధి వలన ప్రయోజనపడుతుంది. [192] బహ్రయిన్ నుండి పెట్రోలియం ఉతపత్తి, ప్రొసెసింగ్ అత్యధికంగా ఎగుమతి చేయబడుతున్నాయి. పెట్రోలియం ఎగుమతులు బహ్రయిన్ జి.డి.పిలో 11%, ప్రభుత్వ జాతీయ ఆదాయంలో 70%, మొత్తం ఎగుమతులలో 60% భాగస్వామ్యం వహిస్తున్నాయి. [113] బహ్రయిన్ ఎగుమతులలో అల్యూమినియం ఉత్పత్తులు, నిర్మాణ వస్తువులు రెండో స్థానంలో ఉన్నాయి.[113]
1985 నుండి ఆయిల్ ధరలలో హెచ్చుతగ్గుల కారణంగా ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉంటున్నాయి. చక్కగా అభివృద్ధి చేయబడిన కమ్యూనికేషంస్, రవాణాసౌకర్యాల కారణంగా బహ్రయిన్ పలు బహుళజాతి సంస్థలకు ప్రధాన పరిశ్రమల ఇంఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి కేంద్రంగా మారింది. బహ్రయిన్ క్రూడాయిల్ దిగుమతి చేసుకుని పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. 2007 గణాంకాలు బహ్రయిన్ దిగుమతులలో క్రూడాయిల్ దిగుమతి 51% భాగస్వామ్యం వహిస్తుందని తెలియజేస్తున్నాయి. [114] బహ్రయిన్లో అధికరిస్తున్నప్రజల ఆహారావసరాలను తీర్చడానికి అధిక మొత్తంలో ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. బహ్రయిన్ మాంసాహారాన్ని ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకుంటుంది. బహ్రయిన్ పండ్లవాడకంలో 75% దిగుమతి ద్వారా లభిస్తున్నాయి. [193][194] దేశంలోని మొత్తం భూభాగంలో 2.9% వ్యవసాయానుకూలంగా ఉంది. బహ్రయిన్ జి.డి.పి.లో వ్యవసాయం 0.5% భాగస్వామ్యం వహిస్తుంది.[194] 2004లో యు.ఎస్ బహ్రయిన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు మీద బహ్రయిన్ సంతకం చేసింది. అది ఇరుదేశాల మద్య వ్యాపారకట్టుబాట్లు తగ్గేలాచేసింది.[195] అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, 2011 బహ్రయిన్ తిరుగుబాటు దేశాభివృద్ధి 2.2% క్షీణించింది.[196] బహ్రయిన్లో యువతలో నిరుద్యోగ సమస్య, ఆయిల్, భూగర్భ జలాల క్షీణత దీర్ఘకాల ఆర్థికసమస్యలుగా మారాయి. [[2008లో నిరుద్యోగ సమస్య 4% ఉంది.[197] మహిళలలో నిరుద్యోగ సమస్య 85%.[198] 2007 బహ్రయిన్ లేబర్ మినిస్టర్ డాక్టర్ మజీద్ అల్ అలావి చేపట్టిన సంస్కరణల కారణంగా బహ్రయిన్ నిరుద్యోగ సమస్యను కొంత పరిష్కరించింది.[199]
పర్యాటకగమ్యంగా బహ్రయిన్ 2008లో 8 మిలియన్ల సందర్శకులను ఆకర్షించింది. అయినప్పటికీ సందర్శకుసంఖ్య వార్షికంగా మారుతూ ఉంటుంది. [200] వీరిలో అత్యధికంగా అరబ్ దేశాలకు చెందినవారే ఉన్నారు. అంతర్జాతీయంగా బహ్రయిన్ వారసత్వచరిత్ర సందర్శకులను ఆకర్షిన్న కారణంగా వెలుపలి దేశాల నుండి బహ్రయిన్‌కు వస్తున్న సందర్శకుల సంఖ్య అధికరిస్తూ ఉంది.
బహ్రయిన్ సంస్కృతిలో ఆధునిక అరబ్ సంస్కృతి, 5,000 సంవత్సరాల పూర్వపు సాంస్కృతిక భవన నిర్మాణ వారసత్వం మిశ్రితమై ఉంది. బహ్రయిన్లో ఉన్న క్వలాత్ అల్ బహ్రయిన్ కోట ప్రపంచవారసత్వసంపదగా గుర్తించబడింది. బహ్రయిన్ నేషనల్ మ్యూజియంలో బహ్రయిన్ ద్వీపాలలో నివసించిన మానవుల సంబంధిత వస్తువులు భద్రపరచబడి ఉన్నాయి. వీటిలో 9,000 నాటి చరిత్రను తెలియజేస్తున్న వస్తువులు కూడా ఉన్నాయి. బెయిట్ అల్ ఖురాన్ ( ది హౌస్ ఆఫ్ ఖురాన్) మ్యూజియంలో ఇస్లామిక్ ఖురాన్ సంబంధిత కళాఖండాలు ఉన్నాయి. బహ్రయిన్‌లోని పర్యాటక ఆకర్షణలలో చారిత్రకప్రాధాన్యత కలిగిన " అల్ ఖమిస్ మసీదు " ఒకటి. ఇది ఈ ప్రాంతంలోని పురాతన మసీదుగా గుర్తించబడుతుంది. మహారగ్లో ఉన్న అరబ్ కోట, బార్బర్ పురాతన ఆలయం ఉన్నాయి. ఈ ఆలయం దిల్మునితే కాలంలో నిర్మితమైంది. బహ్రయిన్ దిల్మున్ మ్యూరియల్ మౌండ్స్ (సమాధి గుట్టలు), సార్ ఆలయం ఉన్నాయి. [201] బహ్రయిన్లో 400 సంవత్సరాల వృక్షం ఉంది. ఎడారి మద్యభాగంలో ఉన్న ఈ వృక్షం పరిసరాలలో ఎలాంటి జలాధారం లేదు. ఇది కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటి. [202] హావర్ ద్వీపాలలో పక్షుల పరిశీలన, స్కుబా డైవింగ్, గుర్రపుస్వారీ బహ్రయిన్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. సౌదీ అరేబియా సమీపంలోని పలువురు పర్యాటకులు మనామాలో ఉన్న బహ్రయిన్ సిటీ సెంటర్, సీఫ్ డిస్ట్రిక్‌లో ఉన్న సీఫ్ మాల్, షాపింగ్ చేయడానికి మనామాకు వస్తుంటారు. మనామా సౌక్, పాత డిస్ట్రిక్‌లో ఉన్న గోల్డ్ సౌక్ కూడా పర్యాటకులలో ప్రాబల్యత సంతరించుకున్నాయి.[203]2005 నుండి బహ్రయిన్ వార్షికంగా మార్చిలో " స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ " ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో ప్రదర్శనలు ఇవ్వడానికి అంతర్జాతీయ కళాకారులు, సంగీతకారులు వస్తుంటారు.[204] 2012లో మనామాను " అరబ్ కేపిటల్ ఆఫ్ కల్చర్ ", 2013లో " కేపిటల్ ఆఫ్ అరబ్ టూరిజం " అని అరబ్ లీగ్ చేత పేర్కొనబడింది. 2012 ప్రదర్శనలలో ఆండ్రియా బొసెల్లీ, జూలియో గ్లెసియాస్, ఇతర కళాకారులు పాల్గొన్నారు.[205]
బహ్రయిన్లో ఒకేఒక అతర్జాతీయ విమానాశ్రయం ఉంది. బహ్రయిన్ ఈశాన్యంలో ముహరగ్ వద్ద " బహ్రయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " ఉంది. 2010లో బహ్రయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 1,00,000 కంటే అధికమైన విమానాలు పయనించాయి. వీటిలో 8 మిలియన్లకంటే అధికమైన ప్రయాణీకులు పయనించారు. [206] బి.ఐ.ఎ. బేస్ నుండి బహ్రయిన్ నేషనల్ కారియర్, " గల్ఫ్ ఎయిర్ " విమానసేలు అందించబడుతున్నాయి.
బహ్రయిన్ చక్కగా అభివృద్ధిచేయబడిన రవాణావ్యవస్థను (ప్రత్యేకంగా మనామా రహదారి వ్యవస్థ) కలిగి ఉంది. 1930 ఆరంభంలో ఆయిల్ అణ్వేషణ కారణంగా దేశంలో పలురహాదార్ల నిర్మాణం వేగవంతం అయింది. రహదార్లు పలు గ్రామాలను అనుసంధానం చేస్తూ నిర్మించబడ్డాయి.[207]1929లో మనామా మరుయు ముహరగ్ మద్య వంతెన నిర్మించబడింది. 1941లో పాత చెక్క వంతెన స్థానంలో సరికొత్తగా కాస్‌వే నిర్మించబడింది. [207] ప్రస్తుతం రెండు ప్రాంతాలను కలుపుతూ మూడు వంతెనలు నిర్మించబడ్డాయి.[208]1932లో బహ్రయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిచిన తరువాత రెండు ద్వీపాలమద్య ప్రయాణాలు అధికం అయ్యాయి.[207] తరువాత నిర్మించబడిన రింగ్ రోడ్డు, హైవేలు మానామాను నార్తన్ గవర్నరేట్ గ్రామాలు, సెంట్రల్, సదరన్ పట్టణాలతో అనుసంధానం చేసాయి.
నాలుగు ప్రధాన ద్వీపాలు, పట్టణాలు, గ్రామాలు చక్కగా నిర్మించబడిన రహదార్లతో అనుసంధానించబడ్డాయి. 2002 గణాంకాలను అనుసరించి బహ్రయిన్లో 3164 కి.మీ పొడవున రహదార్లు నిర్మించబడ్డాయి. వీటిలో 2433 కి.మీ రహదారి పేవ్మెంటు చేయబడ్డాయి. మనామాను ముహరగ్ ద్వీపంతో అనుసంధానం చేస్తూ 2.2 కి.మీ కాస్‌వే నిర్మించబడింది. అలాగే మరొక వంతెన సిత్రాను ప్రధాన ద్వీపంతో అనుసంధానంచేస్తూ ఉంది. 24 కి.మీ పొడవైన కింగ్ ఫాహ్ద్ కాస్ వే బహ్రయిన్ను సౌదీ అరేబియాతో అనుసంధానం చేస్తుంది. సౌదీ అరేబియా నిదిసహాయంతో నిర్మించబడిన ఈ రహదారి మార్గం 1986లో నిర్మాణం పూర్తిచేసుకుంది. 2008లో కాస్ వే మార్గంలో 17,743,495 మంది ప్రయాణీకులు పయనించారు. [209] బహ్రయిన్ పోర్ట్ " మైనా సల్మాన్ " దేశంలోని ప్రధాన సీ పోర్టుగా సేవలు అందిస్తుంది. ఇందులో 15 బెర్తులు ఉన్నాయి. [210] 2001లో బహ్రయిన్‌కు 8 నౌకలు కలిగిన మర్చంట్ ఫ్లీట్ ఉంది. [211] నగరంలో ప్రయాణ సౌకర్యానికి ప్రైవేట్ వాహనాలు, టాక్సీలు కూడా లభిస్తుంటాయి.[212]
బహ్రయిన్ సమాచారరంగం 1981లో అధికారికంగా ఆరంభించబడింది. బటెల్కో కంపెనీ స్థాపనతో బహ్రయిన్ సమాచారరంగానికి శ్రీకారం చుట్టబడింది. ఇది 2004 వరకు ఏకచ్ఛత్రంగా సమాచారరంగాన్ని పాలించింది. 1981లో బహ్రయిన్లో 45,000 టెలిఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. 1999లో బహ్రయిన్ మొబైల్ కాంట్రాక్టుల సంఖ్య 1,00,000 కు చేరుకుంది. [213][213] 2004లో జైన్ గ్రూప్ (ఎం.టి.సి. ఒడాఫోన్) బహ్రయిన్లో పనిచేయడం ఆరంభించింది. 2010లో వి.ఐ.వి.ఎ. (సౌదీ టెలికాం కపెనీ) మొబైల్ సేవలు ప్రారంభం అయ్యాయి. [214] బహ్రయిన్ 1995లో ఇంటర్నెట్ సేవలు ఆరంభించింది.[215] బహ్రయిన్ ఇంటర్నెట్ వాడుకరులు 40,000 చేరుకుంది (2004) నుండి [216] 2008 నాటికి 2,50,000.[217] 2013లో టి.ఆర్.ఎస్. 22 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతి ఇచ్చింది. [218]
2010 గణాంకాలను అనుసరించి బహ్రయిన్ జనసంఖ్య 1.2 మిలియన్లకు చేరుకుంది. వీరిలో 568,399 బహ్రయిన్ ప్రజలు. వీరిలో 666,172 బహ్రయిన్ పౌరసత్వం లేని వారు ఉన్నారు. [1] 2007 లో బహ్రయిన్ జనసంఖ్య 1.05 మిలియన్లు. వీరిలో బహ్రయిన్ పౌరసత్వం లేనివారి సంఖ్య 517,368.[219] బహ్రయినేతరులలో అత్యధికులు మిడిల్ ఈస్టుకు చెందిన వారు ఉండగా దక్షిణాసియాకు చెందినవారు కూడా గణనీయంగా ఉన్నారు. 2008 గణాంకాలను అనుసరించి దాదాపు 2,90,000 నాన్ రెసిడెంట్ ఇండియన్లు బహ్రయిన్లో విససిస్తున్నారని భావిస్తున్నారు. బహ్రయిన్లో నివసిస్తున్న బహ్రయినేతర ప్రజలలో ఒకేదేశానికి చెందినవారి సంఖ్యలో భారతీయులు ప్రథమస్థానంలో ఉన్నారు. [220][221] బహ్రయిన్ జసాంధ్రతపరంగా స్వతంత్ర దేశాలలో బహ్రయిన్ 4 వ స్థానంలో ఉంది. బహ్రయిన్ జనసాధ్రంత 1,646 చ.కి.మీ. 2 (2010).[1] దేశం ఉత్తరభాగంలో జనసాంధ్రత అధికంగా ఉండగా దక్షిణ ప్రాంతంలో జనసాంధ్రత తక్కువగా ఉంది.[1] దేశం ఉత్తరభాగంలో అధికంగా నగరీకరణ చేయబడింది. ఉత్తరభాగం మహానగరంగా భావించబడుతుంది.[222]
బహ్రయిన్ ప్రజలలో వైవిధ్యమైన సంప్రదాయాలు ఉన్నాయి. వీరిలో షియా బహ్రయిన్ ప్రజలలో బహామా, ఆజం అనే రెండు తెగలు ఉన్నాయి. షియా బహ్రయిన్లు అధికంగా బహామా సంప్రదాయానికి చెందినవారున్నారు. ఆజం ఆఫ్ బహ్రయిన్లు ఇరానియన్ సంప్రదాయానికి చెందిన పర్షియన్లు. షియా పర్షియన్లు పెద్ద సమూహాలుగా మనామా, ముహరగ్లలో కేంద్రీకృతమై ఉన్నారు. అల్పసంఖ్యాఖంగా అల్- హసాకు చెందిన హస్విస్ సంప్రదాయ షియా బహ్రయిన్లు ఉన్నారు.
సున్నీ బహ్రయిన్లు ప్రధానంగా అల్ అరబ్, హుబాలా తెగలకు చెంది ఉన్నారు. బహ్రయిన్లో సున్నీ అరబులు అత్యధికప్రాధాన్యత కలిగిన సంప్రదాయప్రజలుగా ఉన్నారు. వారు బహ్రయిన్లో ఉన్నత పదవులు వహిస్తున్నారు. వీరిలో అతున్నత పదవు వహిస్తున్న అల్ ఖలీఫా కూడా సున్నీ సంప్రదాయానికి చెందినవాడే.
సున్నీ అరబ్బులు జల్లాక్, ముహరగ్, రిఫ్ఫా, హవర్ ద్వీపాలలో నివసిస్తున్నారు. హువాలా ప్రజలు ఇరానియన్ సున్నీ సంతతికి చెందిన ప్రజలు. వీరిలో కొదరు సున్నీ పర్షియన్లు ఉన్నారు. [223][224] మిగిలిన వారు సున్నీ అరబ్బులు. [225] బలోచ్ సంప్రదాయానికి చెందిన సున్నీ సంప్రదాయ ప్రజలు ఉన్నారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన బహ్రయిన్లు అధికంగా తూర్పు ఆఫ్రికాకుచెందినవారు. వీరు అధికంగా ముషారగ్, రిఫాలో నివసిస్తున్నారు.[226]
బహ్రయిన్ అధికార మతం ఇస్లాం. బహ్రయిన్ ప్రజలలో అత్యధికులు ముస్లిములే. బహ్రయిన్ ప్రజలలో65-75% బహ్రయిన్ ముస్లిములు లేక షియా తెగకు చెందినవారై ఉన్నారు. [228][229][230][231][232] బహ్రయిన్లో స్థానిక క్రైస్తవులు కొందరు ఉన్నారు. 2010 గణాంకాలను అనుసరించి ముస్లిమేతర బహ్రయిన్ల సంఖ్య 3,67,683. వీరిలో అత్యధికులు క్రైస్తవులే. [233][note 1] బహ్రయిన్ క్రైస్తవులలో బహిష్కరించబడిన వారి సంఖ్య అధికంగా ఉంది. స్థానిక బహ్రయిన్ క్రైస్తవుల సంఖ్య తక్కుగా ఉంటుంది. గత యునైటెడ్ కింగ్డం అంబాసిడర్ అలీస్ సమాన్ బహ్రయిన్ స్థానిక క్రైస్తవమతానికి చెందినవాడు. బహ్రయిన్ పౌరులలో జ్యూషిష్ ప్రజలు 37 మంది ఉన్నారు.[234] వైవిధ్యమైన వనరుల ఆధారాలు జ్యూయిష్ ప్రజల సంఖ్య 36-50 వరకు ఉంటుందని తెలియజేస్తున్నాయి.[235]
ఆసియన్ దేశాల నుండి బహ్రయిన్‌కు భారతదేశం, ఫిలిప్పీన్స్, శ్రీలంక పెద్ద ఎత్తున వలసప్రజలు, శ్రామికులు వచ్చి చేరారు. దేశంలోని మొత్తం ముస్లిముల సంఖ్య సమీకాలంలో తగ్గుతూ ఉంది.[236] 2001 గణాంకాలను అనుసరించి బహ్రయిన్ ప్రజలలో ముస్లిములు 81.2%, క్రైస్తవులు 10%, 9.8% హిందులు, ఇతరులు ఉన్నారని తెలియజేస్తున్నాయి.[113] 2010 గణాంకాలు ముస్లిముల సంఖ్య 70.2%కి చేరిందని తెలియజేస్తున్నాయి. ముస్లిమేతరుల సంఖ్యలో మార్పు లేదు.[1] బహ్రయిన్ ప్రభుత్వాధికారులు బహ్రయిన్ ప్రతిపక్షాల నివేదికలను నిరాకరించారు. సున్నీ సిరియన్లకు పౌరసత్వం ఇవ్వడం ద్వారా ముస్లిం పౌరుల సంఖ్యను అధికం చేయాలని నిర్వాహం ప్రయత్నిస్తుంది.[237] బహ్రయిన్ మొత్తం ప్రజలలో బహాలు 1% ఉంది.[238]
అరబిక్ భాష బహ్రయిన్ అధికారభాషగా ఉంది. ఆగ్లం కూడా అధికంగా వాడుకలో ఉంది.[239] అరబిక్ భాషాసంబంధిత బహరాని అరబిక్ అత్యధికంగా వాడుకలో ఉంది. మూల అరబిక్ భాధకంటే ఇది కొంత వ్యత్యాసంగా ఉంటుంది. అరబిక్ భాష బహ్రయిన్ రాజకీయాలలో ప్రధానపాత్ర వహిస్తుంది. బహ్రయిన్ రాజ్యంలో పార్లమెంటు సభ్యులు తప్పకుండా అరబిక్ భాషాధారాళంగా మాట్లాడగలిగి ఉండాలన్న నిబంధన ఉంది.[240] బహ్రయిన్, బ్రయినేతర ప్రజలలో చాలామంది పర్షియన్ భాష మాట్లాడుతున్నారు.[239] నేపాల్ భాష గుర్ఖా నేపాలీ శ్రామికులు, గుర్ఖా సైనికులకు వాడుకభాషగా ఉంది. మలయాళం, తమిళం, హిందీ భాషలు భారతీయులకు వాడుకభాషలుగా ఉన్నాయి.[239] పలు వ్యాపార సంస్థలు, రహదారి చిహ్నాలు అరబిక్, ఆంగ్లభాషలో ఉంటాయి. [241]
బహ్రయిన్ దేశంలోని 6-14 సంవత్సరాల మద్య వయసున్న పిల్లలకు నిర్భంధవిద్య అమలులో ఉంది.[242] బహ్రయిన్ ప్రభుత్వ పబ్లిక్ పాఠశాలలో పౌరులకు విద్య ఉచితం. బహ్రయిన్ విద్యామంత్రిత్వశాఖ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తుంది. ప్రభుత్వపాఠశాలలలో కోఎజ్యుకేషన్ అమలులో లేదు. బాలలకు, బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి.[243] 20 వ శతాబ్ధపు ఆరంభంలో బహ్రయిన్లో ఖురానిక్ పాఠశాలలు (కుట్టుబ్) మాత్రమే విద్యాబోధన చేస్తూ ఉండేవి.[244] సంప్రదాయ పాఠశాలలు పిల్లలకు, యువతకు ఖురాన్ బోధిస్తుంటాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బహ్రయిన్ వెస్టర్న్ ప్రభావానికి దారి ఇచ్చింది. అలాగే ప్రజల ఆసక్తిని అనుసరించి ఆధునిక విద్యా శాలలు ప్రారంభించబడ్డాయి. 1919 నుండి బహ్రయిన్ ఆధునిక ప్రభుత్వపాఠశాలలు ఆరంభించబడ్డాయి. ఇందులో భాగంగా బాలల కొరకు " అల్- హిదయ అల్- ఖలీఫా స్కూల్ " ముహరగ్లో ప్రారంభించబడింది. [244] 1926 ఎజ్యుకేషన్ కమిటీ బాలుర కొరకు రెండవ పబ్లిక్ స్కూల్ ప్రాంరంభించబడింది. 1928లో బాలికల కొరకు ముహరగ్లో మొదటి స్కూల్ ప్రారంభించబడింది. [244] 2011 గణాంకాలను అనుసరించి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సంఖ్య 126,981. [245]2004లో రాజా హమద్ ఇబిన్ ఇసా అల్ ఖలీఫా " కింగ్ హమాద్ స్కూల్స్ ఆఫ్ ఫ్యూచర్ " ప్రాజెక్ట్ ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా బహ్రయిన్ లోని " కె- 12 ఎజ్యుకేషన్ " పాఠశాలలలో ఇంఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించి విద్యాబోధచేయబడుతుందని భావిస్తున్నారు. [246] బహ్రయిన్ పాఠశాలను అంతర్జాలంతో అనుసంధానంచేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.[247] అదనంగా బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులకు హైస్కూల్ విద్య తరువాత విద్యను అందిస్తున్నాయి. " యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంటు డిఫెంస్ " " కె-12 " స్కూల్సుకు కరికులం అందిస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ " ఐబి డిప్లొమా ప్రోగ్రాం " లేక యునైటెడ్ కింగ్డం " ఎ- లెవల్" డిప్లొమాను అందస్తున్నాయి.
ఉన్నతస్థాయి డిగ్రీలతో విదేశాల నుండి వస్తున్న బహ్రయిన్ పౌరులు స్థాపించే విద్యాసంస్థలకు బహ్రయిన్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. " ది యూనివర్శిటీ ఆఫ్ బహ్రయిన్ " గ్రాజ్యుయేట్ విద్య అందించడానికి స్థాపించబడింది. " కింగ్ అబ్దులజిజ్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైంసెస్ "ను హెల్త్ మినిస్టరీ నిర్వహణలో పనిచేస్తుంది. ఇది ఫిజీషియన్లను, నర్సులను, ఫార్మాసిస్లకు, పారామెడికల్స్కు శిక్షణ ఇస్తుంది. 2001 నేషనల్ ఏక్షన్ చార్టర్ ప్రైవేట్ యూనివర్శిటీల స్థాపనకు మార్గం సుగమం చేసింది. ఫలితంగా మనామాలో " అహిలా యూనివర్శిటీ ", సార్ (బహ్రయిన్) లో " యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ బహ్రయిన్ " స్థాపించబడ్డాయి. 2005లో " ది రాయల్ యూనివర్శిటీ ఫర్ వుమన్ " స్థాపించబడింది. ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఇన్ బహ్రయిన్ మహిళల కొరకు స్థాపించబడింది. " ది యూనివర్శిటీ ఆఫ్ లండన్ " బహ్రయిన్లో దూరవిద్యా సౌకర్యం కల్పించడం కొరకు ప్రాంతీయ ప్రతినిధి కార్యాలయం స్థాపించింది.[248] దక్షిణాసియా విద్యార్థుల కొరకు పాకిస్థాన్ ఉర్దూ స్కూల్ (బహ్రయిన్), ది బిర్లా ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ స్థాపించబడ్డాయి. బహ్రయిన్లో ఉన్నవిద్యాసంస్థలలో డీ పౌల్ యూనివర్శిటీ, బెంట్లీ యూనివర్శిటీ, ది ఎర్ంస్ట్ & యంగ్ ట్రైనింగ్ ఇంస్టిట్యూట్, ఎన్.వై.ఐ.టి. ది ఇండియన్ స్కూల్ (బహ్రయిన్) ప్రధానమైనవి. 2004లో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జెంస్ ఇన్ ఐర్లాండ్ బహ్రయిన్లో మెడికల్ యూనివర్శిటీ స్థాపించింది. బహ్రయిన్లో ఇవి కాక అదనంగా అరేబియన్ గల్ఫ్ యూనివర్శీటీ, ఎ.ఎం.ఎ. ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, కాలేజ్ ఆఫ్ హెల్త్ సైంసెస్ మెడికల్ స్కూల్స్ ఉన్నాయి.
1960 నుండి బహ్రయిన్ " యూనివర్సల్ హెల్త్ కేర్ విధానం " అనుసరిస్తుంది.[249] బహ్రయిన్ పౌరులకు ప్రభుత్వం ఆరోగ్యసంరక్షణ ఉచితంగా అందిస్తుంది. బహ్రయినేతర ప్రజలకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తుంది. బహ్రయిన్ జి.డి.పిలో ఆరోగ్యసంరక్షణకు 4.5% వ్యయం చేయబడుతుందని " వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ " భావిస్తుంది. బహ్రయిన్ ఫిజీషియన్లు, నర్సులు అధికంగా బహ్రయిన్ హెల్త్ సెక్టర్ నుండే లభిస్తున్నారు. [250] 1893లో బహ్రయిన్లో మొదటిసారిగా " అమెరికన్ మిషన్ హాస్పిటల్ " డిస్పెంసరీగా ప్రారంభించబడింది.[251] బహ్రయిన్లో మనామా డిస్ట్రిక్‌లో 1957లో మొదటి ప్రభుత్వ హాస్పిటల్ " టెర్రిటరీ హాస్పిటల్ "గా ప్రారంభించబడింది.[252] ప్రస్తుతం బహ్రయిన్ అంతటా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలో " ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఆఫ్ బహ్రయిన్ " ఒకటి. బహ్రయిన్ ప్రజల ఆయుఃప్రమాణం పురుషులకు 73 సంవత్సరాలు, స్త్రీలకు 76 సంవత్సరాలు. ప్రాంతీయ దేశాలతో పోల్చి చూస్తే బహ్రయిన్లో ఎయిడ్స్, హెచ్ ఐ వి తక్కువ స్థాయిలో ఉంది. [253][253] ఆరోగ్యమంత్రిత్వశాఖ క్రమానుసార టి.బి. ఇతర అంటువ్యాధులకు (హెపటీటిస్ బి) వాక్సినైజేషన్ నిర్వహించి అంటువ్యాధుల నిర్మూలనకు పాటుపడుతుంది.[253][254] బహ్రయిన్ ప్రస్తుతం " ఒబేసిటీ సమస్యను ఎదుర్కొంటున్నది. పురుషులలో 28.9%, స్త్రీలలో 38.2% ఒబేసిటీ ఉన్నట్లు వర్గీకరించబడింది.[255] బహ్రయిన్లో డయాబీటీస్ శాతం అధికంగా ( ప్రపంచంలో 5 వ స్థానం) ఉంది. బహ్రయినీ ప్రజలలో 15% మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా దేశంలో 5% మరణాలు సంభవిస్తున్నాయి.[256] బహ్రయిన్లో కార్డియో వాస్కులర్ డిసీస్ 32% ఉంది. ఇది దేశంలోని మరణాలకు ప్రథమకారణంగా ఉంది. రెండవ స్థానంలో కేన్సర్ వ్యాధి ఉంది.[257] సికెల్ సెల్ అనీమియా, థాలస్సీమియా దేశంలో నియంత్రించబడ్డాయి. బహ్రయిన్ ప్రజలలో 18% ప్రజలు సికెల్ సెల్ అనీమియాతో బాధపడుతున్నారు. 24% థాలస్సీమియాతో బాధపడుతున్నారు.[258]
బహ్రయిన్ కొన్నిమార్లు " మిడిల్ ఈస్ట్ లైట్ " అవి వర్ణించబడుతుంది.[259] ఆధునికత, పర్షియన్ గల్ఫ్ సంప్రదాయం ప్రతిబింబించే బహ్రయిన్ కారణంగా బహ్రయిన్ మిడిల్ ఈస్ట్ లైట్‌గా వర్ణించబడుతుంది. ఇస్లాం ప్రధానమతంగా ఉన్న బహ్రయిన్ ప్రజలు ఇతర మతాలపట్ల సహనం ప్రదర్శిస్తుంటారు.[260] పొరుగు దేశాలతో పోల్చిచూస్తే బహ్రయిన్ స్త్రీలహక్కులు స్త్రీలపట్ల ఉదారంగా ఉంటాయి. స్త్రీలు సంప్రదాయదుస్తులైన హిజాబ్ లేక అభయ ధరిస్తుంటారు. [110] అయినప్పటికీ సంపదాయంగా పురుషులు థోబ్ ధరిస్తుంటారు. పురుషుల సంప్రదాయ దుస్తులలో కెఫ్ఫియత్, ఘుత్రా, అగల్ వంటి శిరస్త్రాణాలు భాగంగా ఉంటాయి. సాధారణంగా దేశంలో పాశ్చాత్యదుస్తులు ధరించడం అధికరిస్తుంది.[110]1976 నుండి బహ్రయిన్లో హోమోసెక్స్యుయాలిటీ చట్టబద్ధం చేయబడినప్పటికీ పలువురు హోమోసెక్స్యల్స్ ఖైదుచేయబడుతూనే ఉన్నారు.[261][262][263]
1950 నుండి దేశంలో మోడర్న్ ఆర్ట్ ఉద్యమం అధికారికంగా ప్రవేశపెట్టబడింది. అందులో భాగంగా ఆర్ట్ సొసైటీ రూపొందించబడింది. ఎక్స్ప్రెషనిజం, సర్రియలిజం అలాగే కాలిగ్రఫీ (అందమైన దస్తూరీ) వంటి కళలు దేశంలో ప్రబలమౌతూ ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం (నైరూప్య భావవ్యక్తీకరణ) కూడా దేశంలో ప్రాబల్యత సంతరించుకుంటుంది. [264] మట్టిపాత్రల తయారీ, వస్త్రతయారీ దేశంలో ప్రాబల్యత సంతరించుకుంటున్నాయి. బహ్రయిన్ గ్రామాలలో వీటికి ప్రధాన్యత ఇస్తున్నారు. [264] అరబిక్ దస్తూరీ కళ ప్రాబల్యత కూడా అధికరిస్తుంది. ఇస్లామిక్ ఆర్ట్ అభివృద్ధిచేయడంలో ప్రభుత్వం కీలకపాత్ర వహిస్తుంది. ప్రభుత్వం ఇస్లామిక్ మ్యూజియం, బెయిట్ అల్ ఖురాన్ స్థాపించింది.[264]" ది బహ్రయిన్ నేషనల్ మ్యూజియం "లో సమకాలీన కళాఖండాల ప్రదర్శన ఉంది. [265] బహ్రయిన్ ఆర్కిటెక్చర్ పొరుగున ఉన్న పర్షియన్ గల్ఫ్ దేశాలను పోలి ఉంటుంది. విండ్ టవర్ నిర్మాణం గృహాలకు సహజమైన గాలిని అందించడానికి సహకరిస్తుంటాయి. పురాతన నగరాలైన మనామా, ముహరగ్ నగరాలలోని పురాతన భవనాలలో ఇవి అధికంగా కనిపిస్తుంటాయి.[266]
బహ్రయిన్లో సాహిత్య సంప్రదాయం బలంగా ఉంది. చాలమంది సంప్రదాయ రచయితలు, కవులు క్లాసికల్ అరబిక్ శైలిలో వ్రాస్తుంటారు. సమీప సంవత్సరాలలో పలువురు యువకవులు పాశ్చాత్య సాహిత్యం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో అధికంగా " ఫ్రీ వర్స్ " వ్రాస్తున్నారు. తరచుగా రాజకీయ, వ్యతిగత విషయాలు చోౠచేసుకుంటున్నాయి. [267] కవి అలి అల్ షర్గా, 2011లో " అల్ షొర్ఫా " బహ్రయిన్ సాహిత్య చిహ్నం " అని వర్ణించాడు.[268] సాహిత్యంలో బహ్రయిన్ పురాతన భూమి దిల్మున్గా వర్ణించబడుతుంది. దీనిని గురించిన ప్రస్తావన " గిల్గమేష్ " కావ్యంలో ఉంది. పురాణాలలో కూడా ఇది " గార్డెన్ ఆఫ్ ఈడెన్ "గా వర్ణించబడుతుంది. [269][270]
బహ్రయిన్ సంగీత శైలి పొరుగుదేశాలను పోలి ఉంటుంది. ది ఖలీజి శైలి సంగీతం (జానపద సంగీతం) దేశంలో ప్రాబల్యత సంతరించుకొని ఉంది. సాత్ శైలి సంగీతానికి ఓద్ సంగీతపరికరం ఉపయోగిస్తారు. వయోలిన్, మిర్వాస్ (డ్రం) కూడా బహ్రయిన్లో ప్రధాన్యత సంతరించుకుంది.[271] బహ్రయిన్ ప్రముఖ గాయకులలో అలి బీహార్ ఒకరు. పర్షియన్ గల్ఫ్ దేశాలలో " రికార్డ్ స్టూడియో " నిర్మించుకున్న మొదటి దేశంగా బహ్రయిన్ గుర్తించబడుతుంది.[271]
బహ్రయిన్లో అత్యధిక ప్రాబల్యంక్రీడ అసోసియేషన్ ఫుట్‌బాల్.[272] బహ్రయిన్ నేషనల్ ఫుట్‌బాల్ టీం పలుమార్లు ఆసియన్ కప్, అరబ్ నేషంస్ కప్, ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ క్వాలిఫైయ్యర్ క్రీడలలో పాల్గొన్నది. అయినప్పటికీ బహ్రయిన్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేదు.[273] బహ్రయిన్లో స్వంత ఫుట్‌బాల్ టీం, ది బహ్రయినీ ప్రీమియర్ లీగ్, ఉన్నాయి. బాస్కెట్ బాల్, రగ్బీ, గుర్రపుస్వారీ క్రీడలు కూడా బహ్రయిన్లో ప్రాబల్యత సంతరించుకున్నాయి. [272]
బహ్రయిన్లో " ఫార్ములా వన్ రేస్ ట్రాక్ " ఉంది. బహ్రయిన్ 2004 ఏప్రిల్ 4న " గల్ఫ్ ఎయిర్ బహ్రయిన్ గ్రాండ్ ప్రిక్స్ " ఆతిథ్యం ఇచ్చింది. 2005లో బహ్రయిన్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వహించబడింది. 2006 మార్చి 12న ఓపెనింగ్ గ్రాండ్ ప్రిక్స్‌కు ఆయిథ్యం ఇచ్చింది. రెండు రేసులలో రెనౌల్ట్కు చెందిన ఫెర్నాండో అలొంసొ విజయం సాధించాడు. బహ్రయిన్ హార్స్ రేస్‌కు వార్షికంగా ఆతిథ్యం ఇస్తుంది. 2011 బహ్రయిన్ గ్రాండ్ ప్రిక్స్ " బహ్రయిన్ తిరుగుబాటు " కారణంగా రద్దుచేయబడింది. [274] 2012 బహ్రయిన్ గ్రాండ్ ప్రిక్స్ ప్రతిపక్షాల వ్యతిరేక ప్రదర్శనల మద్య రక్షణ గురించిన ఆందోళనల మద్య నిర్వహించబడింది.[275] [276][277][278][279] [280] '[281]2006లో బహ్రయిన్ " ఆస్ట్రేలియన్ వి 8 సూపర్ కార్ (డిసర్ట్ 400) కు ఆతిథ్యం ఇచ్చింది. [282]
2006 సెప్టెంబరు 1న బహ్రయిన్ గురువారం మరుయు శుక్రవారాలుగా ఉన్న వారాంతపు శలవుదినాలను శుక్రవారం, శనివారంగా మార్చింది.
బహ్రయిన్ ప్రధాన శలవుదినాల జాబితా:-
తారీఖు | ఇంగ్లీష్ పేరు | ప్రాంతీయ అరబిక్ పేరు | వివరణ |
---|---|---|---|
1 జనవరి | కొత్త సంవత్సరం | رأس السنة الميلادية | గ్రిగేరియన్ కొత్తసంవత్సరం. |
1 మే | లేబర్ డే | يوم العمال | ఈద్ అల్ కుమాల్ (వర్కర్స్ డే) |
16 డిసెంబరు | నేషనల్ డే | اليوم الوطني | బహ్రయిన్ జాతీయ దినం |
17 డిసెంబరు | అసోసియేషన్ డే | يوم الجلوس | గతించిన అమీర్ " ష్. ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా " సంబంధిత దినం. ' |
ముహరం మొదటి దినం | ఇస్లామిక్ కొత్త సంవత్సరం | رأس السنة الهجرية | హిజ్రి (కొత్తసంవత్సరం) ఇస్లామిక్ కొత్తసంవత్సరం. |
9-10 ముహరం | అసుర దినం | عاشوراء | హిజ్రి (కొత్తసంవత్సరం 10వ రోజు) |
12వ రబి- అల్- అవాల్ | మవ్లిద్ (ప్రవక్త ముహమ్మద్ జన్మదినం) | المولد النبوي | ముహమ్మద్ ప్రవక్త జన్మదినం . |
1-2, 3 షవాల్ | ఈద్ ఉల్- ఫిర్ట్ | عيد الفطر | రంజాన్ చివరి రోజు. |
9 వ ధు- అల్- హిజ్జాహ్ | డే ఆఫ్ అరాఫత్ | يوم عرفة | ముహమ్మద్ చివరి ఉపన్యాసం. |
10-11-12, 13 ధు- అల్ - హిజ్జా | ఈద్- ఉల్- అధా | عيد الأضحى | బిగ్ ఫీస్ట్ అబ్రహాం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.