బరువు
From Wikipedia, the free encyclopedia
భారము ఒక కొలమానము. భౌతిక శాస్త్రం ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలాన్ని "భారము" లేదా "బరువు" అంటారు. వస్తువు బరువు దాని ద్రవ్యరాశి, గురుత్వ త్వరణాల లబ్ధానికి సమానం. 'm' ద్రవ్యరాశి గల వస్తువుపై, 'g' గురుత్వ త్వరణం కలగజేసే భారం W=mg అవుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక కిలోగ్రాము ద్రవ్యరాశి గల వస్తువు భారం భూమిపై సాధారణంగా 9.8 న్యూటన్లు ఉంటుంది. భారం అంటే వస్తువుపై గురుత్వాకర్షణ బలం కావున దీని ప్రమాణాలు బలం ప్రమాణాలతో సమానంగా ఉంటుంది. భారమునకు దిశ ఉంటుంది. కాబట్టి, భారం సదిశ రాశి