బంగ్లాదేశ్‌లో హిందూమతం
From Wikipedia, the free encyclopedia
2011 జనాభా లెక్కల ప్రకారం, బంగ్లాదేశ్‌లో, హిందూమతం రెండవ అతిపెద్ద మతం. సుమారు 1.273 కోట్ల మంది ప్రజలు హిందువులమని ఆ జనగణనలో చెప్పారు. మొత్తం 14.97 కోట్ల జనాభాలో ఇది 8.5%. [3] [4] జనాభా పరంగా, భారతదేశం, నేపాల్ ల తరువాత బంగ్లాదేశ్ లోనే ప్రపంచంలో అతిపెద్ద హిందూ జనాభా ఉంది.
మొత్తం జనాభా | |
---|---|
1,27,30,651 (2011 Census) (8.54% of the country's population) | |
Regions with significant populations | |
బంగ్లాదేశ్ అంతటా, ముఖ్యంగా సిల్హెట్, చిట్టగాంగ్, ఖుల్నా | |
సిల్హెట్ | 14,43,182 (17.8%) |
ఖుల్నా | 24,19,010 (16.45%) |
రంగాపూర్ | 18,74,904 (13.54%) |
చిట్టగాంగ్ | 30,72,733 (12.65%) |
డాకా | 27,21,416 (6.97%) |
మతాలు | |
హిందూమతం (మెజారిటీ)[1] Tribal religions identified as Hindus (minority)[2] | |
భాషలు | |
సంస్కృతం (Sacred) బెంగాలీ, ఇతర గిరిజన భాషలు | |
Related ethnic groups | |
Indian Bengali Hindus |
బంగ్లాదేశీ హిందూమతం భారత సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ తో పోలి ఉంటాయి. దేశ విభజన ముందు వరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ కలిసే ఉండేవి. [5] విస్తారమైన బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో మెజారిటీ బెంగాలీ హిందువులే. [6]
దుర్గ లేదా కాళికను విస్తృతంగా పూజిస్తారు. [7] సాధారణంగా బంగ్లాదేశ్‌లోని ఉన్నత కులాలలో శివుని ఎక్కువగా అరాధిస్తారు. [8] విష్ణువును మాత్రం (సాధారణంగా అతని అవతారాలు లేదా అవతారమైన రాముడు లేదా కృష్ణుడి రూపంలో ) కులాతీతంగా అందరూ ఆరాధిస్తారు. [9] బెంగాల్లో విష్ణు ఆరాధన, ప్రేమ, భక్తి సంప్రదాయంలో స్త్రీ పురుషుల కలయికను వ్యక్తపరుస్తుంది. [10] [9] హిందూ విశ్వాసం లోని ఈ రూపం, ఇస్లాం లోని సూఫీ సంప్రదాయం బెంగాల్లో ఒకదానినొకటి ప్రభావితం చేసుకుని వ్యవహరించాయి. [9] బ్రాహ్మణులు లేదా ఉలేమాల మూస పద్ధతులు కాకుండా మత పెద్దలు-శిష్యుల వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెప్పే ప్రసిద్ధ ఆధ్యాత్మిక ఉద్యమాలే ఈ రెండూ. [9] [11] బెంగాలీ ఇస్లామిక్ సంప్రదాయం లాగానే, విష్ణు ఆరాధన తరచుగా చిన్నచిన్న భక్తి సమూహాల్లో (సమాజ్) జరుగుతుంది. [9] ఇద్దరూ దైవంతో కమ్యూనికేట్ చేయడానికి ప్రేమ భాషను ఉపయోగిస్తారు. [9] [12] రెండు సంప్రదాయాలలోనూ, బెంగాలీ భాష లోని గొప్ప సౌందర్యం భావోద్వేగ ప్రభావం కలిగిన ఆధ్యాత్మిక సాహిత్యమే మౌలిక వాహనం. [9] [13]
బంగ్లాదేశ్ హిందూమతంలో తీర్థ స్నానాలు, మొక్కులు, పవిత్ర నదులు, పర్వతాలు, పుణ్యక్షేత్రాలకు చేసే తీర్థయాత్రలూ సాధారణంగా ఆచరించే పద్ధతులు. ఒక సాధారణ హిందువు ముస్లిం పీర్ల పుణ్యక్షేత్రాల వద్ద కూడా పూజలు చేస్తాడు, ఆ స్థలం ఏ మతానికి చెందినదనే దానితో సంబంధం లేకుండా. [9] [13] హిందువులు చాలా మంది పవిత్ర పురుషులు, సన్యాసులను గౌరవిస్తారు. [9] గొప్ప పవిత్ర వ్యక్తి దర్శన మాత్రం చేత ఆధ్యాత్మిక ప్రయోజనం పొందుతామని కొందరు నమ్ముతారు. [9] సెప్టెంబరు-అక్టోబర్‌లో జరిగే దుర్గా పూజ బంగ్లాదేశ్ హిందువుల అతి ముఖ్యమైన పండుగ. ఇది బంగ్లాదేశ్ అంతటా విస్తృతంగా జరుపుకుంటారు. పండుగను పురస్కరించుకుని వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాలలో వేల సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేస్తారు. కాళీ పూజ, జన్మాష్టమి, హోలీ, సరస్వతి పూజ, శివరాత్రి, రథయాత్ర, శతాబ్దాల నాటి ధామరాయ్ రథయాత్ర అత్యంత ప్రసిద్ధమైన ఇతర పండుగలు.
గొడ్డు మాంసం తినడానికి వ్యతిరేకంగా దాదాపు విశ్వవ్యాప్తంగా ఆచరించిన నియమాలలో అహింసా సూత్రం వ్యక్తమౌతుంది. బంగ్లాదేశ్ హిందువులందరూ శాకాహారులేమీ కాదు, కానీ అన్ని రకాల మాంసాహారానికి దూరంగా ఉండటం "ఉన్నత" ధర్మంగా పరిగణిస్తారు. [14] [9] బంగ్లాదేశ్ బ్రాహ్మణులు దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల వారి మాదిరిగా కాకుండా, చేపలు, చికెన్ తింటారు. [15] [9] ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పోలి ఉంటుంది, ఇక్కడ హిందువులు చేపలు, గుడ్లు, చికెన్, మటన్ కూడా తింటారు. బంగ్లాదేశ్‌లో బెంగాలీయేతర హిందువులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని హజోంగ్, రాజ్బాంగ్షి ప్రజలు, త్రిపురిలలో ఎక్కువ మంది హిందువులు. [16]