పూర్భా మేదినిపూర్ జిల్లా
వెస్ట్ బెంగాల్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో పూర్భా మేదినిపూర్ (బెంగాలీ: পূর্ব মেদিনীপুর জেলা) ఒకటి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 3 ప్రధాన విభాగాలలో ఒకటైన బర్దావన్ విభాగంలో ఇది దక్షిణ సరిహద్దులో ఉంది. జిల్లా ప్రధానకేంద్రంగా తమ్లక్ పట్టణం ఉంది. 2002 జనవరి 1 న రూపొందించబడింది. మేదినిపూర్ జిల్లాను పూర్భా మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలుగా విభజించబడింది. జిల్లా ఆగ్నేయ సరిహద్దులో ఒడిషా రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో బంగళాఖాతం, తూర్పు సరిహద్దులో హుగ్లీ నది, దక్షిణ 24 పరగణాలు, ఈశాన్య సరిహద్దులో హౌరా జిల్లా ఉన్నాయి. మునుపటి మెదినీపూర్ జిల్లాలో ఉపవిభాగాలైన తమ్లక్, కోంటై, హల్దియా ప్రాంతాలు పూర్భా మేదినీపూర్ జిల్లా రూపొందించబడింది. [1] మేదినీపూర్ జిల్లాలోని కోంటై ఉపవిభాగం నుండి ఎగ్రా ఉపవిభాగం రూపొందించబడింది. 2011లో ప్రభుత్వం ఈ జిల్లాకు తామ్రలిప్తా అని నామాంతరం చేయాలని ప్రతిపాదించింది. జిల్లాకు కేంద్రంగా ఉన్న తామ్రలిప్త పురాతనకాలంలో నౌకాశ్రయ పట్టణం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పూర్భా మేదినీపూర్ ఈ జిల్లా పలు రాజకీయ ఉద్యమాలకు సాక్షిగా నిలిచింది. తమ్లక్ వద్ద క్విట్ ఇండియా ఉద్యమం చేసిన కాలంలో ఇక్కడ " తాంరలిప్తా జాతీయ సర్కార్ " పేరిట ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది.[2]2007లో పూర్భా మెదీనాపూర్ " నందిగ్రాం హింసాత్మక " సంఘటనలకు సాక్షిగా నిలిచింది. [3]
పూర్భా మేదినిపూర్ జిల్లా
পূর্ব মেদিনীপুর জেলা | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | West Bengal |
డివిజను | Burdwan |
ముఖ్య పట్టణం | Tamluk |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Kanthi (Contai), Tamluk, Ghatal (partly), Medinipur (partly) |
• శాసనసభ నియోజకవర్గాలు | Tamluk, Panskura Purba, Panskura Paschim, Moyna, Nandakumar, Mahisadal, Haldia, Nandigram, Chandipur, Patashpur, Kanthi Uttar, Bhagabanpur, Khejuri, Kanthi Dakshin, Ramnagar, Egra |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,736 కి.మీ2 (1,829 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 50,94,238 |
• జనసాంద్రత | 1,100/కి.మీ2 (2,800/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 87.66 per cent |
• లింగ నిష్పత్తి | 936 |
ప్రధాన రహదార్లు | NH 6, NH 41 |
Website | అధికారిక జాలస్థలి |