పాలపిట్ట
పాలపిట్ట గురించి / From Wikipedia, the free encyclopedia
పాలపిట్ట ఒక పక్షి. ఇది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రముల యొక్క రాష్ట్రపక్షి. దీని శాస్త్రీయ నామము (Coracias benghalensis). ఇది "బ్లూ-బర్డ్"గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి. ఇవి ముఖ్యముగా భారత దేశములోనూ, ఇరాక్, థాయిలాండ్ దేశాలలోనూ కనబడతాయి. ఇవి సాధారణంగా రహదారులకు యిరువైపులా గల చెట్లపైననూ, విద్యుత్ తీగల పైననూ, గడ్డి భూముల పైననూ, పొదల లోనూ కనబడతాయి. ఇవి వలస పక్షులు కావు. కానీ కొన్ని కాలములలో చిన్న చిన్న వలసలు పోతాయి. ఈ పక్షిని భారతదేశం లోని పలు రాష్ట్రములు వాటి రాష్ట్ర పక్షిగా తీసుకున్నాయి.
త్వరిత వాస్తవాలు పాలపిట్ట Indian roller, Scientific classification ...
పాలపిట్ట Indian roller | |
---|---|
రాజస్థాన్ లోని తాల్ ఛాపర్ పక్షుల సంరక్షణా కేంద్రం వద్ద గల పాలపిట్ట. | |
Scientific classification | |
Kingdom: | Animalia |
Phylum: | |
Class: | |
Order: | Coraciiformes |
Family: | Coraciidae |
Genus: | Coracias |
Species: | C. benghalensis |
Binomial name | |
Coracias benghalensis (Linnaeus, 1758) | |
Synonyms | |
Corvus benghalensis |
మూసివేయి