పంబన్ వంతెన
పంబన్ ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగానికి అనుసంధానించే రైల్వే వంతెన From Wikipedia, the free encyclopedia
పంబన్ ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగానికి అనుసంధానించే రైల్వే వంతెన From Wikipedia, the free encyclopedia
పాంబన్ వంతెన (తమిళం: பாம்பன் பாலம்) భారతదేశంలోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన. ఇది శ్రీలంకకు భారత్ కు మధ్య గల పాక్ జలసంధి పై ఉంది. ఈ వంతెన పంబన్ ద్వీపం, రామేశ్వరం పట్టణాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జి రోడ్డు, రైలు వంతెన కలిగిఉంది. ఇది 1914 లో ప్రారంభించబడింది.ఈ వంతెన 2010 వరకు భారతదేశంలోని అన్ని వంతెనలలో పెద్దదిగా నిలిచింది. 2.3 కిలోమీటర్లు ఉన్న ఈ వంతెన నిర్మించి 2014 ఫిబ్రవరి 24 నాటికి వందేళ్ళు పూర్తైంది.
పంబన్ బ్రిడ్జి பாம்பன் பாலம் | |
---|---|
నిర్దేశాంకాలు | 9°16′57.25″N 79°12′5.91″E |
OS grid reference | |
దీనిపై వెళ్ళే వాహనాలు | 2 వరుసల రోడ్డు ట్రాఫిక్ |
దేనిపై ఉంది | పాక్ జలసంధి |
స్థలం | రామేశ్వరం, తమిళనాడు, భారతదేశం |
అధికారిక పేరు | అన్నై ఇందిరా గాంధీ బ్రిడ్జి |
ప్రదేశం | |
ఈ రైలు వంతెన 6,776 అ. (2,065 మీ.) పొడవు కలిగి ఉంది. దీనిని 1914 లో ప్రారంభించారు.[1] ఈ రైలు మార్గం వంతెన డబుల్-లీఫ్ బేస్కూల్ వంతెన. ఇది ఈ మార్గంలో బ్రిడ్జి కింద నుండి వచ్చే ఓడలకు దారినిచ్చేవిధంగా వెసులుబాటు ఉంది.
చారిత్రాత్మకంగా ఈ రైలు వంతెన మీటర్ గేజ్ రైళ్ళకు నిర్దెశింబడింది. కానీ భారతీయ రైల్వేలు బ్రాడ్ గేజ్ రైళ్ళను దానిపై పోయేవిధంగా 2007 ఆగస్టు 12 న రూపొందించారు. రెండు భాగాలుగా (టూ లీవ్స్) మనుషులు విడదీసే విధంగా రూపకల్పన చేశారు[1]. 10 ఓడలవరకు, కార్గో కేరియర్స్, కోస్ట్ గార్డు షిప్స్, ఫినిషింగ్ వెసల్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఈ బ్రిడ్జి క్రింది నుండి వెళ్ళే విధంగా రూపొందించిన బ్రిడ్జి ఇది. అదే విధంగా రెండు వరుసలు గల రోడ్డు వంతెన ఈ రైలు వంతెనకు సమాంతరంగా ఉంది.
ఈ రైల్వే వంతెన మీటరు గేజ్ గా రూపొందిన తర్వాత పాంబన్ స్టేషను నుండి మండపం వరకు రైలు మార్గం ఉండి అచట రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక మార్గం సుమారు 6.25 మైళ్లు (10.06 కి.మీ.)తో రామేశ్వరానికి కలుపబడి ఉంటే, రెండవ మార్గం 15 మైళ్లు (24 కి.మీ.)తో ధనుష్కోటి వరకు విస్తరించబడి ఉంది. ఈ భాగం 1014 లో ప్రారంభమైంది.[2][3]
1915, 1964 లలో గుర్తించదగిన బోట్ మైల్ మద్రాసు-ఎగ్మూరు నుండి ధనుష్కోటి వరకు జరిగింది. దీనివల్ల సిలీన్ లోని తలైమన్నారు నుండి ప్రయాణీకులు రావటానికి అవకాశం కలిగింది. పాంబన్ జంక్షన్ నుండి ధనుష్కోటి వరకు వచ్చే మీటరు గేజ్ లైన్ "1964 ధనుష్కోటి తుఫాను" మూలంగా నాశనం అయింది..[4]ఈ వంతెన తిరిగి 46 రోజులలో ఇ.శ్రీధరన్ అధ్వర్యంలో పునః ప్రారంభించబడింది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.