ఒడిశా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో నౌపడా్ర ఒక జిల్లా.
నౌపడా జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
స్థాపన | 1993 మార్చి 27 |
ప్రధాన కార్యాలయం | నౌపడా |
Government | |
• కలెక్టరు | Sri.Jayakumar Venkataswamy.IAS |
• Member of Lok Sabha | Bhakta Charan Das |
విస్తీర్ణం | |
• Total | 3,408 కి.మీ2 (1,316 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 6,06,490 |
• జనసాంద్రత | 157/కి.మీ2 (410/చ. మై.) |
భాషలు | |
• అధికార | ఒరియా, హిందీ,ఇంగ్లీషు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 766 xxx |
Vehicle registration | OD-26 |
లింగ నిష్పత్తి | 1020 ♂/♀ |
అక్షరాస్యత | 58.20% |
లోక్‌సభ నియోజకవర్గం | Kalahandi |
శాసనసభ నియోజకవర్గాలు | 2, 71.Nuapada, 72.Khariar |
శీతోష్ణస్థితి | Aw (Köppen) |
అవపాతం | 1,230 మిల్లీమీటర్లు (48 అం.) |
1993 మార్చి వరకు కలహంది జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి నౌపడా జిల్లా ఏర్పాటు చేయబడింది. జిల్లాలో ఒక ఉపవిభాగం, 5 తాలూకాలు (నౌపడా,కొమన, ఖరియర్, సినపల్లి, బొడెన్), 5 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు (నౌపడా,కొమన, ఖరియర్, సినపల్లి, బొడెన్) ఉన్నాయి.
నౌపడా జిల్లా ఒడిషా పశ్చిమ భాగంలో ఉంది. జిల్లా 20° 0' ఉ, 21° 5' ఉ డిగ్రీల ఉత్తర అక్షాంశం 82° 20' తూ, 82° 40' తూ రేఖాంశంలో ఉంది. జిల్లా ఉత్తర, దక్షిణ, పశ్చిమ సరిహద్దులో చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లా, తూర్పు సరిహద్దులో బర్గఢ్ బలంగీర్ మరయు కలహంది జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 3407.5చ.కి.మీ.జిల్లా కేంద్రగా నౌపడా పట్టణం ఉంది. నౌపడా ఉపవిభాగం మైదానాలు అంచులలో పదునైన కఠినమైన కొండలు ఉన్నాయి. ఇవి తూర్పు కనుమలలో చేరి ఉన్నాయి. ఇవి సముద్రమట్టానికి 4,000 అడుగుల ఎత్తులో దట్టమైన వృక్షాలతో నిండి ఉన్నాయి. జిల్లాలో లిటరైట్, గ్రాఫైట్, బాక్సైట్ ఖనిజాలు ఉన్నాయి.
జిల్లాలో పరిశ్రమలు లేని కారణంగా ఆర్థికరంగం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో ఉప్పర్ జంక్, సుందర్ ఆనకట్ట, రాబోయే లోయర్ ఇందిరా ఇరిగేషన్ ప్రాజెక్ట్ 45,000 వేల ఎకరాల వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యం అందిస్తుంది. జిల్లా మొత్తంలో వడ్లు ప్రధాన పంటగా పండించబడుతుంది. మొక్కజొన్న, పత్తి, ఎర్రగడ్డలు అధికంగా పండించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం పంట కాలం ముగియగానే 10,000 కంటే అధికంగా ఇతర రాష్ట్రాలకు మంచి అవకాశాలను వెతుక్కుంటూ వలస పోతుంటారు. పనివారిని ఆకర్షించడానికి నౌఖై ఉత్సవానికి ముందు అడ్వాంస్ ఇస్తుంటారు. ఇలాంటి ఒప్పంద కూలీల నియామకానికి నౌపడా జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ప్రభుత్వానికి అనుమతి రహితంగా, నమోదు చెయ్యకుండా జరిగే ఈ వలసలు ప్రభుత్వానికి సవాలుగా మారింది.
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నౌపడా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 606,490 [2] |
ఇది దాదాపు. | సొలోమాన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 542 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 157 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.28%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1020:1000[2] |
జాతియ సరాసరి (928) కంటే. | అత్యధికం |
అక్షరాస్యత శాతం. | 58.2%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
మైదానాలలో దట్టమైన అరణ్యాలతో ఉన్న కొండలలో సాలవృక్షాలు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని అరణ్య ప్రాంతాలను ఖరియర్ డివిషన్ ఆటవీ శాఖ పర్యవేక్షిస్తుంటుంది. అటవీశాఖ అరణ్య భూభాగాన్ని సాల అరణ్యాలు, టేకు అరణ్యాలు, వెదురు వృక్షాలతో నిండిన ఇతర జాతులుగా విభజించారు. ఇవన్నీ పొడి భూములతో కూడిన అరణ్య భూభాగంలో చేరుతుంది. అరణ్యాల నుండి టింబర్ అధికంగా లభిస్తుంది. అదనంగా బిజ, అసన్, బంధన్, టేకు లభిస్తుంది. స్వల్పంగా లభిస్తున్న ఆటవీ ఉత్పత్తులలో కెందు ఆకులు, వెదురు, రెల్లుగడ్డి, మొహుయా పూలు, విత్తనాలు, అతియా బార్క్, సబై - గ్రాస్. టింబర్, వెదురు, కెందు లీఫ్ ఇక్కడి నుండి వెలుపలి రాష్ట్రాలకు ఎగుమతి చేయబడుతుంటాయి. .
నౌపడా పట్టణానికి 18 కి.మీ దూరంలో పతోరా వద్ద ఉన్న యోగేశ్వరాలయంలో ఉన్న పురాతనమైన శివలింగం ఉంది.[5] ఆలయ పునరుద్ధరణ కొరకు సహాయం గుల్షన్ కుమార్ అనుమతి లభించింది.[6]
నౌపడా జిల్లాలోని ఒడిషా అసెంబ్లీ నియోజక వర్గాల జాబితా : [7][8] of Nuapada district and the elected members[9] of that area
సంఖ్య | జియోజకవర్గం | రిజత్వేషన్ | అసెంబ్లీ నియోజక వర్గాలు (బ్లాకులు) | 14వ అసెంబ్లీ సభ్యుడు | రాజకీయపార్టీ |
---|---|---|---|---|---|
71 | నౌపడా | లేదు | నౌపడా, కొమ్మ, ఖరియార్ (ఎన్.ఎ.సి) | బసంత కుమార్ పంద | బి.జె.పి. |
72 | ఖరిర్ | లేదు | బొడెన్, సినపల్లి, ఖరియార్ (ఎన్.ఎ.సి) | దుర్యాధన్ మఝి | బి.జె.పి |
నౌపడా జిల్లా 80లలో సంభవించిన కరువు సందర్భంలో జీల్లాలలో సంభవించిన ఆకలిమరణాల కారణంగా నిరంతరంగా వార్తలకు ఎక్కింది. కోరాపుట్ జిల్లా నుండి నౌపడా జిల్లా విభజించిన తరువాత కరువు బాధిత ప్రదేశాలన్నీ నౌపడా న్యాయపరిధిలోకి వాచ్చాయి. పంటభూములు కలహంది జిల్లాలో చేరాయి. కలహంది జిల్లాలో సంభవించినట్లు భావిస్తున్న ఆకలి మరణాలు మిగిలిన కరువు సంబంధిత సంఘటనలు వాస్తవంగా నౌపడా ప్రాంతానికి చెందినవే కాని కలహంది ప్రాంతానికి సంబంధించినవి కాదు. 21వ శతాబ్దం నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. నౌపడా జిల్లా వడ్లు అధికంగా పండించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు అందిస్తుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం చక్కగా నిర్వహించబడుతుంది. నక్సల్ బాధిత ప్రదేశాలలో ప్రధానంగా వెనుకపడినా సునబేడా మైదానం వంటి ప్రాంతాలలో అభివృద్ధి పనులు వెనుకబడ్డాయి. ఈ ప్రాంతంలో సమీపకాలంలో కూడా ఆకలి మరణాలు నమోదైయ్యాయి.
నౌపడా ప్రాంతంలో ఆమ్లపల్లి గ్రామంలోని గిరిజయువతి ఫనాస్ పుంజి తన 20 సంవసరాల అవివాహిత ఆడబిడ్డను నిరుద్యోగ 40 సంవత్సరాల అంధునికి 40 రూపాయలు, ఒక చీరెకు విక్రయించిన విషయం వార్తా మాధ్యమంలో హెడ్ లైన్ వార్తగా ప్రచురించబడడం వలన నౌపడా పేరు అతర్జాతీయ గుర్తింపు పొందింది.[10] ఈ సంఘటన తరువాత రాజీవ్‌గాంధి ఈ గ్రామాన్ని సందర్శించాడు.[11] ఈ సంఘటన జానపద గీతాలలో కూడా చోటు చేసుకుంది. [12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.