![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/04/Nagercoil_Clock_Tower.jpg/640px-Nagercoil_Clock_Tower.jpg&w=640&q=50)
నాగర్‌కోయిల్
తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలోని ఒక నగరం / From Wikipedia, the free encyclopedia
నాగర్‌కోయిల్, భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని ఒక నగరం.ఇది కన్యాకుమారి జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం.దీనిని నాగర్‌కోవిల్, నాగాల దేవాలయం, లేదా నాగరాజ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది భారత ద్వీపకల్పం కొనకు దగ్గరగా ఉన్న పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం మధ్య అలలులేని భూభాగంలో ఉంది. నాగర్‌కోయిల్ నగరం తమిళనాడు లోని 12వ అతిపెద్ద నగరం.[3] [4]
Nagercoil | |
---|---|
City | |
Clockwise from top:
Nagercoil Clock Tower, Nagaraja Temple, Home church, St. Xavier's Cathedral, Nagercoil Junction railway station | |
Nickname(s): Granary of South Travancore, Greenest City of Tamilnadu, City of Temple Jewels, Southernmost City of India. | |
Coordinates: 8.183300°N 77.411900°E / 8.183300; 77.411900 | |
Country | India |
State | Tamil Nadu |
District | Kanyakumari |
Named for | "Temple of the Nāgas" |
Government | |
• Type | Mayor–Council |
• Body | Nagercoil Municipal Corporation |
• Member of Legislative Assembly | M. R. Gandhi |
• Mayor | Mr. Magesh BA BL |
• Deputy Mayor | Mrs. Mary princy MA |
• Corporation Commissioner | Mr. Anand Mohan IAS |
• Member of Parliament | Vijay Vasanth |
విస్తీర్ణం | |
• Total | 61.36 కి.మీ2 (23.69 చ. మై) |
Elevation | 82 మీ (269 అ.) |
జనాభా (2021) | |
• Total | 6,22,759 (approx.) |
• జనసాంద్రత | 9,813/కి.మీ2 (25,420/చ. మై.) |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 629001, 629002, 629003, 629004 |
Telephone code | 91-4652 & 91-4651 |
Vehicle registration | TN-74 |
Literacy | 96.99%[1] |
Climate | Aw[2] (Köppen) |
Precipitation | 2,477.7 మిల్లీమీటర్లు (97.55 అం.) |
ప్రస్తుత నాగర్‌కోయిల్ నగరం కొట్టార్ చుట్టూ పెరిగింది. ఇది సంగం కాలంనాటి వర్తక పట్టణం.[5] కొట్టార్ ఇప్పుడు నగర పరిధిలో ఒకప్రాంతం.1947లో బ్రిటన్ నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందేవరకు దాదాపు ఒక దశాబ్దం వరకు 735 సంవత్సరాలపాటు ఇది పూర్వపు ట్రావెన్కోర్ రాజ్యం, తరువాత కేరళ రాష్ట్రంలో కేంద్ర భాగంగా ఉంది.1956లో కన్యాకుమారి జిల్లాతోపాటు, నాగర్‌కోయిల్ నగరం తమిళనాడులో విలీనం చేసారు.
నాగర్‌కోయిల్ నగరం జనసాంద్రతలో చిన్నదైననూ, కన్యాకుమారి జిల్లాలో అనేక ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. నగరంచుట్టూ ఉన్న ఆర్థిక కార్యకలాపాలలో పర్యాటకం, పవన శక్తి, ఐటి సేవలు, సముద్ర చేపల ఉత్పత్తి, ఎగుమతులు, రబ్బరు, లవంగాల తోటలు, వ్యవసాయ-పంటలు, పూలఉత్పత్తి, చేపల వలల తయారీ, రబ్బరు ఉత్పత్తులు వంటి ఇతర అనేక కార్యకలాపాలు నాగర్‌కోయిల్ నగరంతో ముడిపడి ఉన్నాయి.[6]
'నాగర్‌కోయిల్ లవంగాలు' సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైందిగా చెప్పకోవచ్చు. ఎండిన లవంగాలు, వాటివాసన ప్రత్యేక నాణ్యతకలిగి ఉంటాయి. ఇవి ఔషధ విలువలకు ప్రసిద్ధి చెందాయి. [7] లవంగాలు, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు పట్టణం వెలుపల పశ్చిమ కనుమలలోని ఎస్టేట్లలో పండిస్తారు.
ఇస్రో చోదక సముదాయం, మహేంద్రగిరి [8]కూడంకుళం అణు విద్యుత్ సంస్థకు నాగర్‌కోయిల్ సమీప నగరం. విద్య, తలసరి ఆదాయం, ఆరోగ్యసూచికలు మొదలైనవాటితో సహా తమిళనాడు రాష్ట్రం లోని అనేక మానవాభివృద్ధి సూచిక పారామితులలో కన్యాకుమారి జిల్లాతోపాటు నగరం అగ్రస్థానంలో ఉంది [9] నాగర్‌కోయిల్ నగరం 2019 ఫిబ్రవరి 14 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నసందర్భంగా నాగర్‌కోయిల్ నగపాలక సంస్థగా ఉన్నతస్థితికి మారింది. [10]