నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం
మహారాష్ట్రలోని నాగపూర్ నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. / From Wikipedia, the free encyclopedia
నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం మహారాష్ట్రలోని నాగపూర్ నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. ఇది 3780 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగివుంది. ఈ ప్రాంతాన్ని నాగపూర్ మహానగర అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, రవాణా, గృహాల బాధ్యత నిర్వర్తించే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.
త్వరిత వాస్తవాలు నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం, దేశం ...
నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం | |||||||
---|---|---|---|---|---|---|---|
పైనుంచి సవ్యదిశలో: దీక్షభూమి, నాగపూర్ నారింజ, విదర్బ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్ పట్టణం, స్వామి నారయణ్ దేవాలయం | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | మహారాష్ట్ర | ||||||
జిల్లా | నాగపూర్ | ||||||
తాలూకా[1] |
| ||||||
విస్తీర్ణం | |||||||
• Metro | 3,780 కి.మీ2 (1,460 చ. మై) | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
అభివృద్ధి సంస్థ | నాగపూర్ మహానగర అభివృద్ధి సంస్థ | ||||||
చైర్మన్ | ఉద్దవ్ థాకరే, ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వం | ||||||
మెట్రోపాలిటన్ కమీషనర్ | శ్రీమతి. షీతల్ తేలి-ఉగలే (ఐఏఎస్) |
మూసివేయి
నాగపూర్ నగరం జనాభాలో భారతదేశంలో 13వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం, భౌగోళికంగా భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది. ఈ నగరం మీదుగా ప్రవహించే నాగ్ నది వల్ల దీనికి నాగ్పూర్ అనే పేరు పెట్టారు. పాత నాగ్పూర్ (నేడు 'మహల్' అని పిలుస్తారు) నగరం, నాగ్ నదికి ఉత్తర ఒడ్డున ఉంది. పూర్ భారతీయ భాషలలో "నగరం" అని అర్ధం.[2]