గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో నవ్సారి జిల్లా ఒకటి. నవ్సారి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2,211 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,229,250
దుధియా తలాయో గతంలో ఒక సరోవరం. ప్రస్తుతం ఇది ప్రధాన షాపింగ్ కేంద్రంగా మార్చబడింది. దుధియా తలాయో సమీపంలో ప్రబల నేత్రచికిత్సాలయం ఉంది. దుధియా తలాయో 1970లో నిర్మించబడింది. దుధియా తలాయో మీద " ఆషాపూరీ ఆలయం " నిర్మించబడింది. దుధియా తలాయో కొంతభాగం " జి.ఎన్ టాటా మెమోరియల్ ట్రస్ట్ "కు ఇవ్వబడింది. వారు ఈ సరసును పూడ్చి ఇక్కడ ఒక అందమైన అడిటోరియం నిర్మించారు. ఇక్కడ సభలు, కళాప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. దీనిని టాటా మెమోరియల్ హాల్ అని పిలువబడుతుంది.
నవ్సారిలో పెద్దసంఖ్యలో జొరోయాస్ట్రియన్ సముదాయానికి చెందిన ప్రజలు ఉన్నారు.
ప్రముఖులు
డాక్టర్ దాదాభాయ్ నౌరోజి (మంత్రి)
జంషద్జి టాటా, టాటా గ్రూప్ కంపెనీల స్థాపకుడు, ఇక్కడ జన్మించారు.
జె. ఎన్. టాటా జన్మస్థలాన్ని టాటా గ్రూప్ ఫ్యాక్టరీ శాఖ స్మారక చిహ్నంగా పరిరక్షిస్తూ ఉంది.
నవ్సారిలో ఉన్న " వైభవ్ పబ్లిక్ లైబ్రరీ " నగరంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వాలలో ఒకటిగా గిర్తినబడుతుంది.
మహరాజ్ రాణా గ్రంథాలయం (తరోటాబజార్, మొటఫాలియా, నవ్సార్) ఇక్కడ జొరోయాస్ట్రియన్ సమూహానికి చెందిన వ్రాతప్రతులు భద్రపరచబడి ఉన్నాయి.
ఆర్ధికం
నగరంలో వజ్రాల వ్యాపారం అభివృద్ధి చెందిన కారణంగా నగరం వ్యాపారకూడలిగా కూడా అభివృద్ధి చెందింది.
నగరంలో " జహంగీర్ టాకీస్ " పురాతన సినిమా థియేటర్‌గా గుర్తించబడుతుంది.
నవ్సారిలో ఉన్న క్లాక్ టవర్ నగరానికి ఒక గుర్తింపు చిహ్నంగా ఉంది. ఈ గడియార గోపురానికి సమీపంలో సమీపంలో పురాతన పోస్ట్ ఆఫీస్ ఉంది. నవసారి పోస్టల్ కోడ్ 396445.