నవరాత్రి
From Wikipedia, the free encyclopedia
నవ్రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.[1]
త్వరిత వాస్తవాలు శారద నవరాత్రి, యితర పేర్లు ...
శారద నవరాత్రి | |
---|---|
యితర పేర్లు | నవరాత్రి, నవరాత్రులు |
జరుపుకొనేవారు | హిందూ |
ప్రారంభం | ఆశ్వయుజమాసము శుక్ల పక్షం ప్రథమ (రోజు) |
ముగింపు | ఆశ్వయుజమాసము శుక్ల పక్షం నవమి (రోజు) |
ఉత్సవాలు | 10 రొజులు (9 రాత్రులు) |
వేడుకలు | వేదిక ఏర్పాటు, ప్రార్థనలు, నాటకాలు, నాటకాలు, ఉపవాసం, పూజ , మూర్తి నిమజ్జనం, భోగి మంటలు, ప్రార్థనలు దుర్గా, పార్వతీ దేవికి సమర్పించబడతాయి. |
సంబంధిత పండుగ | విజయదశమి, దశమి |
ఆవృత్తి | సంవత్సరానికి ఒకసారి |
మూసివేయి