తపస్ పాల్
From Wikipedia, the free encyclopedia
తపస్ పాల్ ( 1958 సెప్టెంబర్ 29 - 2020 ఫిబ్రవరి 18) ఒక భారతీయ నటుడు రాజకీయ నాయకుడు. [2] బెంగాలీ సినిమా రంగంలో ప్రసిద్ధిగాంచిన నటులలో తపస్ పాల్ ఒకరు, మహువా రాయ్ చౌదరి దేబాశ్రీ రాయ్ సరసన నటించి తపస్ పాల్ గుర్తింపు పొందాడు. [3] [4] తపస్ పాల్ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. [5]
తపస్ పాల్ | |
---|---|
జననం | (1958-09-29)1958 సెప్టెంబరు 29 చంద్రా నగర్ పశ్చిమ బెంగాల్ , భారతదేశం |
మరణం | 2020 ఫిబ్రవరి 18(2020-02-18) (వయసు 61)[1] ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు రాజకీయ నాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1980 నుంచి 2019 వరకు |
రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ |
పిల్లలు | సోహిని పాల్ |
తపస్ పాల్ 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి పార్లమెంటు సభ్యుడు అయ్యాడు . [6] [7]
తపస్ పాల్ తన తొలి సినిమా దాదర్ కీర్తి (1980) సినిమాతో సినీ రంగంలోకి అడిగి పెట్టాడు.తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించిన సినిమాలలో తపస్ పాల్ నటించి ప్రజాదరణ పొందాడు. సాహెబ్ (1981), [8] పరబత్ ప్రియా (1984), భలోబాసా భలోబాసా (1985), వంటి వంటి సినిమాలు బెంగాలీ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. అనురాగేర్ చోయన్ (1986), అమర్ బంధన్ (1986), గురు దక్షిణ (1987) సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. సాహెబ్ (1981) సినిమాలో తపస్ పాల్ పాత్ర కుఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. [9]
తపస్ పాల్ మాధురీ దీక్షిత్ సరసన హిరేన్ నాగ్ అబోధ్ (1984) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. [10] తపస్ పాల్ తరుణ్ మజుందార్‌తో రెండో సినిమా భలోబాస భలోబాస (1985)లో దేబశ్రీ రాయ్‌తో కలిసి నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతమైంది. దేబాశ్రీ రాయ్ తో తపస్ పాల్ చాలా సినిమాలలో నటించాడు. అర్పన్ (1987), సురేర్ సతి (1988), సురేర్ ఆకాషే (1988), నయన్మణి (1989), చోఖేర్ అలోయ్ (1989), శుభ కమన (1991), మాయాబిని (1992), తోబు మోనే రేఖో ( 1994), తుమీ జే అమర్ (1994) సినిమాలలో నటించాడు. తపస్ పాల్ ఉత్తర (2000) మోండో మేయర్ ఉపాఖ్యాన్ (2002)లో బుద్ధదేబ్ దాస్‌గుప్తాతో కలిసి పనిచేశాడు. [11] 2016 డిసెంబర్లో రాజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ తపస్ పాల్ ను సిబిఐ అరెస్టు చేసింది, [12] [13] [14] [15] ఆరెస్టు చేసిన 13 నెలల తర్వాత ఆయన బెయిల్ పొందారు. [16]