భారత ఉపఖండంలోని అధిక భాగాన్ని పాలించిన వరుస ఇస్లామిక్ రాజవంశాలు (1206-1526) From Wikipedia, the free encyclopedia
ఢిల్లీ సల్తనత్ స్వల్పకాలీన ఐదు వంశాల రాజ్య కాలాన్ని ఢిల్లీసల్తనత్ గా వ్యవహరిస్తారు. ఈ ఐదు వంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని వివిధ కాలాలలో పరిపాలించాయి. ఈ సల్తనత్ లకు చెందిన సుల్తానులు ప్రముఖంగా మధ్యయుగపు భారత్ కు చెందిన టర్కిక్, పష్తూన్ (అఫ్గాన్) జాతికి చెందిన వారు. వీరు 1206 నుండి 1526 వరకు పరిపాలన చేశారు. అని కూడా అంటారు. ఈ ఐదు వంశాల పాలన మొఘల్ సామ్రాజ్యం ఆరంభంతో పతనమయ్యింది. ఈ ఐదు వంశాలు మమ్లూక్ వంశం (1206–90); ఖిల్జీ వంశం (1290–1320); తుగ్లక్ వంశం (1320–1414); the సయ్యద్ వంశం (1414–51);, ఆప్ఘనుల లోడీ వంశం (1451–1526).
ఢిల్లీ సలాతీన్ / ఢిల్లీ సల్తనత్ | |||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1206–1526 | |||||||||||||||||
Delhi Sultanate under various dynasties. | |||||||||||||||||
రాజధాని | ఢిల్లీ (1206–1327) దౌలతాబాదు (1327–1334) ఢిల్లీ (1334–1506) ఆగ్రా (1506–1526) | ||||||||||||||||
సామాన్య భాషలు | పర్షియన్ (అధికారిక)[1] | ||||||||||||||||
మతం | సున్నీ ఇస్లాం | ||||||||||||||||
ప్రభుత్వం | రాచరిక వ్యవస్థ | ||||||||||||||||
సుల్తాన్ | |||||||||||||||||
• 1206–1210 | కుతుబుద్దీన్ ఐబక్ (మొదటి) | ||||||||||||||||
• 1517–1526 | ఇబ్రాహీం లోఢీ (ఆఖరి) | ||||||||||||||||
చారిత్రిక కాలం | మధ్యయుగ ఆఖరు | ||||||||||||||||
• స్థాపన | 1206 | ||||||||||||||||
• పతనం | 1526 | ||||||||||||||||
|
కుతుబుద్దీన్ ఐబక్, ఒక బానిస, ఇతడు ముహమ్మద్ ఘోరీ యొక్క బానిస, ఇతడు బానిస వంశానికి చెందిన మొదటి సుల్తాన్. ఇతడి కాలంలో ఉత్తరభారతదేశం వీరి వశంలో ఉండేది. ఆ తరువాత ఖిల్జీ వంశం పరిపాలించింది. వీరికాలంలో పరిపాలన మధ్యభారతదేశం వరకూ వ్యాప్తి చెందింది. ఈ రెండు సల్తనత్ లు భారతధేశ ఉపఖండానికి కేంద్రీకృతం చేయడంలో విఫలమయ్యింది. కానీ మంగోల్ సామ్రాజ్యం విస్తరించకుండా అడ్డుపడడంలో సఫలీకృతం అయినది.[2]
ముయిజు అడ్-దిను ముహమ్మదు ఘోరి (సాధారణంగా ముహమ్మదు ఘోరీ అని పిలుస్తారు) మాజీ బానిస కుతుబు అల్-దిను ఐబాకు ఢిల్లీ సుల్తానేటు మొదటి పాలకుడు. ఐబాకు కుమను-కిప్చకు (టర్కీ) మూలానికి చెందినవాడు. ఆయన వంశం కారణంగా ఆయన రాజవంశాన్ని మమ్లుకు (బానిస) రాజవంశం అని పిలుస్తారు (ఇరాకు మమ్లుకు రాజవంశం లేదా ఈజిప్టు మామ్లుకు రాజవంశంతో గందరగోళం చెందకూడదు).[3] ఐబాకు 1206 నుండి 1210 వరకు నాలుగు సంవత్సరాలు ఢిల్లీ సుల్తానుగా పరిపాలించాడు.
ఐబాకు మరణించిన తరువాత అరాం షా 1210 లో అధికారాన్ని చేపట్టాడు. కాని ఆయనను 1211 లో షామ్సు ఉదు-దిను ఇల్టుట్మిషు హత్య చేశాడు.[4] ఇల్తుట్మిషు శక్తి ప్రమాదకరమైనది. గతంలో కుతుబు అలు-దిను ఐబాకు మద్దతుదారులుగా ఉన్న అనేక మంది ముస్లిం అమీర్లు (ప్రభువులు) ఆయన అధికారాన్ని సవాలు చేశారు. వరుస విజయాలు, వ్యతిరేకత క్రూరమైన మరణశిక్షల తరువాత, ఇల్టుట్మిషు ఆయన శక్తిని పదిలం చేసుకున్నాడు.[5] ఆయన పాలనను కుబాచా వంటి అనేకమంది సవాలు చేశారు. ఇది వరుస యుద్ధాలకు దారితీసింది.[6] ఇల్టుమిషు ముస్లిం పాలకులతో పోటీలో ముల్తాను, బెంగాలు మీద విజయం సాధించాడు. అలాగే హిందూ పాలకులు రణతంబోరు, సివాలికులను జయించాడు. ఆయన ముజు అడు-దిను ముహమ్మదు ఘోరి వారసుడిగా తన హక్కులను నొక్కిచెప్పిన తాజు అలు-దిను యిల్డిజు మీద దాడి చేసి, ఓడించి ఉరితీశాడు.[7] ఇల్టుట్మిషు పాలన 1236 వరకు కొనసాగింది. ఆయన మరణం తరువాత ఢిల్లీ సుల్తానేటు పాలకులు శక్తిహీనులయ్యారు. ఫలితంగా ఢిల్లీ సుల్తానేటులో ముస్లిం ప్రభువులతో వివాదాలు, హత్యలు, స్వల్పకాలిక పదవీకాలాలు సంభవించాయి. గియాసు ఉదు-దిను బాల్బను అధికారంలోకి వచ్చి 1266 నుండి 1287 వరకు పాలించే వరకు అధికారం రుక్ను ఉదు-దిను ఫిరుజు నుండి రజియా సుల్తానాకు తరువాత ఇతరులకు మారింది.[6][7] జలాలు ఉదు-దిన్ ఫిరుజు ఖల్జీని సైన్యం కమాండరును నియమించారు. ఖిల్జీ కైకాబాదును హత్య చేసి అధికారాన్ని చేపట్టాడు. తద్వారా మమ్లుకు రాజవంశం ముగింపుకు వచ్చి ఖిల్జీ రాజవంశం ప్రారంభమైంది.
కుతుబు అలు-దిను ఐబాకు కుతుబు మినారు.[8] ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన క్వవతు-ఉలు-ఇస్లాం (మైటు ఆఫ్ ఇస్లాం) మసీదు నిర్మాణాన్ని ప్రారంభించింది.[9] కుతుబు మినారు కాంప్లెక్సు లేదా కుతుబు కాంప్లెక్సు 14 వ శతాబ్దం ప్రారంభంలో ఇల్టుట్మిషు చేత విస్తరించబడింది. తరువాత అలా ఉదు-దిను ఖల్జీ (ఖల్జీ రాజవంశం రెండవ పాలకుడు) చేత విస్తరించబడింది.[9][10] మామ్లుకు రాజవంశం సమయంలో పశ్చిమ ఆసియా మంగోలుయోధుల ముట్టడిలోకి వచ్చినందున, ఆఫ్ఘనిస్తాను, పర్షియా నుండి చాలామంది ప్రభువులు వలస వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారు.[11]
ఖల్జీ రాజవంశం తుర్కో-ఆఫ్ఘను వారసత్వానికి చెందినది.[12][13][14][15] వారు మొదట తుర్కికు మూలానికి చెందినవారు.[16] భారతదేశంలో ఢిల్లీకి వెళ్లడానికి ముందు వారు ప్రస్తుత ఆఫ్ఘనిస్తానులో స్థిరపడ్డారు. "ఖల్జీ" అనే పేరు ఖలాత్-ఎ ఖల్జీ (గిల్జీ కోట) అని పిలువబడే ఆఫ్ఘను గ్రామం లేదా పట్టణాన్ని సూచిస్తుంది.[17] స్థానిక ఆఫ్ఘన్లతో వారి వివాహసంబంధాలు ఆఫ్ఘను అలవాట్లు, ఆచారాల కారణంగా ఇతరులు వీరిని ఆఫ్ఘన్లుగా భావించారు.[18][19] దీని ఫలితంగా రాజవంశాన్ని తుర్కో-ఆఫ్ఘను అని అంటారు.[13][14][15] అల్లావుద్దీను ఖల్జీ భార్య, షిహాబుద్దీను ఒమరు తల్లి జాత్యపాలి (రామచంద్ర కుమార్తె (దేవగిరి)) ద్వారా ఈ రాజవంశం భారతీయ వంశపారంపర్యంగా ఉంది.[20]
ఖల్జీ రాజవంశం మొదటి పాలకుడు జలాలు ఉదు-దిను ఫిరుజు ఖిల్జీ. కిరీటాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందే ఫిరుజు ఖల్జీ ఆఫ్ఘన్లలో తగినంత మద్దతును కూడగట్టుకున్నాడు.[21] 1290 లో మమ్లుకు రాజవంశం చివరి పాలకుడు ముయిజు ఉదు-దిను కైకాబాదును ఆఫ్ఘను, టర్కీ ప్రభువుల మద్దతుతో చంపిన తరువాత ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన సింహాసనం ఆరోహణ సమయంలో సుమారు 70 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. సాధారణ ప్రజలకు సౌమ్యమైన, వినయపూర్వకమైన, దయగల చక్రవర్తిగా కీర్తించబడ్డాడు.[22][23] జలాలు ఉదు-దిను ఫిరుజు తుర్కో ఆఫ్ఘను మూలానికి చెందినవాడు. [24][25][26] 1296 లో అతని మేనల్లుడు, అల్లుడు జునా ముహమ్మదు ఖిల్జీ చేత హత్య చేయబడటానికి ముందు 6 సంవత్సరాలు పాలించాడు. [27] తరువాతి కాలంలో ఆయన అలా ఉదు-దిను ఖల్జీ అని పిలుస్తారు.
అలా ఉదు-దిను కారా ప్రొవిన్సు గవర్నరుగా తన వృత్తిని ప్రారంభించాడు. అక్కడ నుండి మాల్వా (1292), దేవగిరి (1294) మీద రెండు దాడులు చేశాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఈ భూములతో పాటు ఇతర దక్షిణ భారత రాజ్యాలను స్వాధీనం చేసుకుని తిరిగి మాల్వాకు వచ్చాడు. ఆయన గుజరాతు, రణతంబోరు, చిత్తోరు మాల్వాలను జయించాడు.[28] అయినప్పటికీ మంగోలు దాడులు, వాయువ్య దిశ నుండి దోపిడీలు దాడుల కారణంగా ఈ విజయాలు తగ్గించబడ్డాయి. తరువాత మంగోలులు దోపిడీ ఉపసంహరించుకుని ఢిల్లీ సుల్తానేటు వాయువ్య భాగాల మీద దాడి చేయడం మానేశారు.[29]
మంగోలులు ఉపసంహరించుకున్న తరువాత అలాదు-దిను ఖల్జీ మాలికు కాఫూరు ఖుస్రో ఖాను వంటి సైనికాధికారుల సహాయంతో ఢిల్లీ సుల్తానేటును దక్షిణ భారతదేశానికి విస్తరించడం కొనసాగించారు. వారు యుద్ధాలలో ఓడించిన వారి నుండి కొల్లగొట్టి (అన్వాటను) సంపదనుసేకరించారు.[30] ఆయన కమాండర్లు యుద్ధ దోపిడీలను సేకరించి ఖనిమా (అరబిక్: الْغَنيمَة, యుద్ధం మీద పన్ను) చెల్లించారు. ఇది ఖిల్జీ పాలనను బలోపేతం చేయడానికి సహాయపడింది. యుద్ధం తరువాత దోపిడీ చేసిన వాటిలో ప్రసిద్ధ కో-ఇ-నూరు డైమండు ఉన్న వరంగలు దోపిడి కూడా ఉంది. [31]
అలా ఉదు-దిను ఖల్జీ పన్ను విధానాలను మార్చారు. వ్యవసాయ పన్నులను 20% నుండి 50% కి పెంచారు (ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల రూపంలో చెల్లించాలి), స్థానిక ప్రముఖులు వసూలు చేసిన పన్నుల మీద చెల్లింపులు, కమీషన్లను తొలగించాడు. తన అధికారులలో సాంఘికీకరణను, ప్రముఖుల మద్య మతాంతర వివాహం నిషేధించడం ద్వారా ఆయనకు వ్యతిరేకత ఏర్పడకుండా చేసుకున్నాడు. ఆయన అధికారులు, కవులు, పండితుల జీతాలను తగ్గించాడు.[27] ఈ పన్ను విధానాలు, వ్యయ నియంత్రణలు ఆయన పెరుగుతున్న సైన్యాన్ని అవసరమైన ఆయన ఖజానాను బలపరిచాయి. ఆయన రాజ్యంలోని అన్ని వ్యవసాయ ఉత్పత్తులు, వస్తువుల మీద ధరల నియంత్రణలను ప్రవేశపెట్టాడు. అలాగే ఈ వస్తువులను ఎక్కడ, ఎలా, ఎవరి ద్వారా విక్రయించవచ్చనే దాని మీద నియంత్రణలను ప్రవేశపెట్టాడు. "షహానా-ఇ-మండి" అని పిలువబడే మార్కెట్లు సృష్టించబడ్డాయి.[32] ముస్లిం వ్యాపారులకు అధికారిక ధరలకు కొనుగోలు చేయడానికి, తిరిగి అమ్మడానికి ఈ "మండి" లో ప్రత్యేకమైన అనుమతులు, గుత్తాధిపత్యం లభించింది. ఈ వ్యాపారులు తప్ప మరెవరూ రైతుల నుండి కొనలేరు లేదా నగరాల్లో అమ్మలేరు. అలాచేసిన ఈ "మండి" నిబంధనలను ఉల్లంఘించినట్లు కఠినంగా శిక్షించబడ్డారు. ధాన్యం రూపంలో వసూలు చేసిన పన్నులు రాజ్య నిల్వలో నిల్వ చేయబడ్డాయి. తరువాతి కరువు సమయంలో ఈ ధాన్యాగారాలు సైన్యానికి తగిన ఆహారాన్ని కల్పించాయి. [27]
అల్లావుద్దీను హింసాత్మక పాలన సాగించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. అలా ఉదు-దిను తన శక్తికి ముప్పు ఉందని భావించిన వారిని ఎవరినైనా వారి కుటుంబంలోని మహిళలు, పిల్లలతో పాటు హతమార్చాడు.. 1298 లో ఇస్లాం మతంలోకి మారిన ఢిల్లీ సమీపంలో 15,000 - 30,000 మంది ప్రజలను తిరుగుబాటు చేస్తారన్న భయంతో ఒకే రోజులో హతమార్చాడు.[33] ఆయన యుద్ధంలో ఓడించిన రాజ్యాల మీద క్రూరత్వం ప్రదర్శినదానికి కూడా పేరుగాంచాడు.
1316 లో అలా ఉదు-దిను మరణించిన తరువాత భారతదేశంలో హిందూ కుటుంబంలో పుట్టి ఇస్లాం మతంలోకి మారిన నపుంసకుడైన ఆయన సైనికాధికారి మాలికు కాఫూరు అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నించారు. తరువాత ఆయనకు పర్షియా, టర్కీ ప్రభువుల మద్దతు లేని కారణంగా చంపబడ్డాడు.[27]
అలా ఉదు-దిను- ఖిల్జీ 18 సంవత్సరాల కుమారుడు " క్తుబుద్దీను ముబారకు షాహు ఖిల్జీ " నాలుగు సంవత్సరాల కాలం పాలించిన తరువాత అల్లవుద్దీను ఖిల్జీ సైనికాధికారి ఖుష్రొఖాను చేత చంపబడ్డాడు. ఖుష్రొఖాను ఘాజి మాలికు (గియాతు అల్-దిను తుగ్లకు) చేతిలో చంపబడడంతో ఖుష్రొఖాను పాలన కొన్ని నెలలలో ముగింపుకు వచ్చింది. తరువాత 1320 లో ఖిల్జీ రాజవంశం ముగింపుకు వచ్చి తుగ్లకు రాజవంశం ప్రారంభం అయింది.[11][33]
1526 సం.లో మొఘలుల దండయాత్రతో ఈ ఢిల్లీ సల్తనత్ అంతమయినది. బాబర్ ఆక్రమణతో ఢిల్లీ సల్తనత్ పతనము, మొఘల్ సామ్రాజ్య ప్రారంభం జరిగింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.