From Wikipedia, the free encyclopedia
గియాసుద్దీన్ బల్బన్ (రాజ్యకాలం: 1256 – 1287) (Urdu: غیاث الدین بلبن) ఒక బానిసవంశపు సుల్తాన్.[1]
గియాసుద్దీన్ బల్బన్ | |
---|---|
ఢిల్లీ సుల్తాను | |
పరిపాలన | 1266–1287 |
ఉత్తరాధికారి | మొయిజుద్దీన్ కైకుబాద్ (మనుమడు) |
Burial | |
రాజవంశం | బానిస వంశం ఢిల్లీ సల్తనత్ |
మధ్యాసియా కు చెందిన ఇల్బారీ తెగ టర్కిక్ రాజకుటుంబానికి చెందిన వాడు. కానీ ఇతడిని బాల్యంలో మంగోలు తస్కరించి గజనీ లో ఒక బానిసగా అమ్మేశారు.[2] ఆ తరువాత ఇతడిని అల్తమష్ 1232 లో కొనుక్కొని తన రాజ్యానికి తీసుకువచ్చాడు. ఇతని మొదటి పేరు బహావుద్దీన్.
ఆ తరువాత అల్తమష్ ఇతడిని ఒక సుల్తానుగా తీర్చిదిద్దాడు. 1266 ఇతడు ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించాడు.[2]
రాజు దైవాంశ సంభూతుడు, రాజరికం దైవదత్తం అనే సిద్దంతాన్ని పాటించాడు. సుల్తాన్ భూమి మీద భగవంతుని నీడ (జిల్ -ఇ -అల్లాహ్ ) అని అభివర్ణించిన తొలి సుల్తాన్ గా బాల్బన్ ను పేర్కొంటారు. ఇతని ఆస్థానం ను లాల్ మహల్ (రెడ్ ప్యాలెస్ ) గా పిలుస్తారు. ఇతని బిరుదులు : ఘియాజుద్దీన్,జిల్ -ఇ - అల్లాహ్ , భారతదేశపు ఉక్కు మనిషి , అల్గుఖాన్, సేవియర్ ఆఫ్ డిల్లీ సుల్తాన్.
మెవాటిలు ఆ కాలంలో రహదారి-చోరులుగా ప్రసిద్ధి. వీరు పగటి సమయానే ప్రజలను దోచుకునేవారు. వీరిని బల్బన్ కట్టుబాటు చేశాడు.[3]
ఇతడు సుల్తానుగా 1256 నుండి తన మరణకాలం 1286 వరకూ పరిపాలించాడు. ఇతను రక్త పాత లేక కఠిన విధానాలు అవలంబించేవాడు.
ఇతను నౌరోజ్ పండగను ప్రవేశపెట్టాడు. సైనిక మంత్రుత్వ శాఖ దివాన్ -ఇ - అరీజ్ ను మొదటి సారి ఏర్పరిచాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.