డెహ్రాడూన్
From Wikipedia, the free encyclopedia
డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని, ఆ రాష్ట్రంలో అతిపెద్ద నగరం.[7] [8] ఇది డెహ్రాడూన్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ నగరం గఢ్వాల్ ప్రాంతంలో భాగం. గఢ్వాల్ డివిజనల్ కమీషనర్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఇది ఢిల్లీకి ఉత్తరాన 248 km (154 mi) దూరాన ఏడవ జాతీయ రహదారిపై ఉంది. రైలు మార్గం (డెహ్రాడూన్ రైల్వే స్టేషన్), విమానాశ్రయం (జాలీ గ్రాంట్ విమానాశ్రయం) తోనూ బాగా అనుసంధానించబడి ఉంది. నగర పరిపాలనను డెహ్రాడూన్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్ శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నగరంలో నిర్వహిస్తారు. డెహ్రాడూన్, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) చుట్టూ అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ ప్రయత్నాల్లో ఒకటి. ఇది ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతం లోకి వలసలను తగ్గించి అక్కడ జనాభా విస్ఫోటనాన్ని తగ్గించడానికీ, హిమాలయాల్లో ఒక స్మార్ట్ సిటీ గానూ ఇది అభివృద్ధి చెందుతోంది.[9][10]
డెహ్రాడూన్
దేహ్రా డూన్ | |||
---|---|---|---|
నగరం | |||
Nickname: డూన్ | |||
Coordinates: 30.345°N 78.029°E / 30.345; 78.029 | |||
దేశం | India | ||
రాష్ట్రం | ఉత్తరాఖండ్ | ||
జిల్లా | డెహ్రాడూన్ | ||
స్థాపన | 1817 | ||
Area | |||
• నగరం | 196.48 km2 (75.86 sq mi) | ||
• Metro | 300 km2 (100 sq mi) | ||
Elevation | 430 మీ (1,410 అ.) | ||
Population | |||
• నగరం | 8,03,983 (2018) | ||
• Rank | 79th | ||
• Metro | 12,79,083 (2001) | ||
భాషలు | |||
• అధికారిక | హిందీ[4] | ||
• Additional official | సంస్కృతం[5][6] | ||
• Regional | గఢ్వాలీ, జౌన్సారీ | ||
Time zone | UTC+5:30 (IST) | ||
PIN | 248001 | ||
Telephone code | +91-135 | ||
Vehicle registration | UK-07 |
డెహ్రాడూన్ హిమాలయాలకు దిగువన ఉన్న డూన్ వ్యాలీలో ఉంది. తూర్పున గంగానదికి ఉపనది అయిన సోంగ్ నది, పశ్చిమాన యమునా ఉపనది అయిన అసన్ నది ప్రవహిస్తున్నాయి. ఈ నగరం, దాని సుందరమైన ప్రకృతి అందాలకూ, కొద్దిగా తేలికపాటి వాతావరణానికీ ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల ప్రాంతానికి ఇది ప్రవేశ ద్వారంగా ఉంది. ఇది ముస్సోరీ, ధనౌల్తి, చక్రతా, న్యూ టెహ్రీ, ఉత్తరకాశి, హర్సిల్, చోప్తా - తుంగనాథ్, ఔలి వంటి హిమాలయ పర్యాటక ప్రాంతాలకూ దోడితల్, దయారా బుగిలియాల్‌లోని పూల లోయ వంటి ప్రసిద్ధ వేసవి, శీతాకాల హైకింగ్ గమ్యస్థానాలకూ, కేదార్కాంత, హర్ కీ దున్, హేమకుంట్ సాహిబ్ వంటి క్యాంపింగ్ స్థలాలకూ సమీపంలో ఉంది. హిందూ పవిత్ర నగరాలైన హరిద్వార్, రిషికేశ్ , చోటా చార్ ధామ్ హిమాలయ తీర్థయాత్ర సర్క్యూట్‌తో పాటు, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను కూడా డెహ్రాడూన్ ద్వారా చేరుకోవచ్చు. డెహ్రాడూన్ బాస్మతి బియ్యానికి, బేకరీ ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది.
డెహ్రాడూన్ ప్రముఖ విద్య, పరిశోధనా కేంద్రం. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ది డూన్ స్కూల్, వెల్హామ్ బాయ్స్ స్కూల్, వెల్హామ్ గర్ల్స్ స్కూల్, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ, ఉత్తరాఖండ్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం, వాడియా ఇన్స్టిట్యూట్లకు నిలయం. హిమాలయన్ జియాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ మొదలైన సంస్థలు నగరంలో ఉన్నాయి. సర్వేయర్-జనరల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. దైనిక్ జాగరణ్, KPMG నిర్వహించిన ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ, విద్య, నేరాలపై ఆధారపడిన సంయుక్త సర్వే ప్రకారం, డెహ్రాడూన్ భారతదేశంలోని సురక్షితమైన నగరాలలో ఒకటి.
డెహ్రాడూన్ సముద్రమట్టానికి 640 metres (2,100 ft) ఎత్తున ఉంది. ద్రోణ నివాసం అని పేరున్న డెహ్రాడూన్, గఢ్వాల్ పాలకులకు ముఖ్యమైన కేంద్రంగా ఉంది. వారి నుండి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. దాని వ్యూహాత్మక ప్రాధాన్యత కారణంగా, భారత సాయుధ దళాలు తమ ప్రధాన అకాడమీతో పాటు, గర్హి కంటోన్మెంట్, నేవల్ స్టేషన్లో గణనీయమైన ఉనికీ డెహ్రాడూన్‌లో స్థాపించాయి. డెహ్రాడూన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సైన్యం కోసం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తయారు చేస్తుంది. టిబెటన్ సరిహద్దులో మోహరించిన భారతీయ దళాలకు ఇది సరఫరా కేంద్రంగా ఉంది. భారతదేశపు పరిశోధన, విశ్లేషణ విభాగం పాకిస్తాన్, చైనాల నుండి ప్రసారాలను వినేందుకు జాలీ గ్రాంట్ విమానాశ్రయంలో ఎలక్ట్రానిక్ లిజనింగ్ పోస్ట్‌ను నిర్వహిస్తోంది.