ట్రాన్సిస్టర్
సిగ్నల్స్ మరియు విద్యుత్ శక్తిని విస్తరించేందుకు మరియు మార్చడానికి ఉపయోగించే సెమీకండక్టర్ ప / From Wikipedia, the free encyclopedia
ట్రాన్సిస్టర్ అనేది విద్యుత్ తరంగాల కంపన పరిమితిని పెంచడానికి లేదా విద్యుత్ ప్రసారాన్ని నియంత్రించడానికి వాడే ఒక అర్ధవాహక పరికరం. ఇది డయోడ్ వలె సిలికాన్ వంటి అర్ధవాహకానికి ఒక క్రమమైన పద్ధతిలో మలినాలను చేర్చడం వల్ల ఏర్పడుతుంది. బయటి సర్క్యూట్లకు కలపడానికి వీలుగా దీనికి మూడు టర్మినళ్ళు ఉంటాయి. దీన్ని 1948లో న్యూజెర్సీ లోని బెల్ పరిశోధనా సంస్థకు సంబంధించిన విలియం షాక్లీ, జాన్ బార్డీన్, వాల్టర్ బ్రాట్టైన్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధన కారణంగా వీరు ముగ్గురికీ 1956లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.[1] ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో వీటిని ఏదో రకంగా వాడుతున్నారు. సూక్ష్మ రూపంలో ఉన్న ట్రాన్సిస్టర్లు కంప్యూటర్ తయారీలో చాలా ముఖ్యమైన భాగాలు. వీటిని సిలికాన్ లేదా జర్మేనియం లాంటి అర్ధ వాహకాలనుపయోగించి తయారు చేస్తారు. రోదసీ సాంకేతిక శాస్త్రంలో చాలా తేలికగా ఉండే పరికరాల్లోనూ వీటిని విస్తారంగా వాడతారు. ట్రాన్సిస్టర్ కనుగొనక ముందు రేడియోల్లో, టెలివిజన్లలో వీటికన్న పరిమాణంలో సుమారు 10 రెట్లు పెద్దవైన వాల్వు (వాక్యూం ట్యూబు) లను వాడుతుండే వారు. వాల్వుల స్థానంలో వీటి వాడకం వలన ఇలాంటి విద్యుత్ పరికరాల క్ పరిమాణం గణనీయంగా తగ్గిపోయింది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇవి రెండు రకాలు పి-ఎన్-పి, ఎన్-పి-ఎన్.